Satyabhama Serial Today Episode సత్య, విశ్వనాథం ఎమోషనల్ అవుతూ మాట్లాడుకుంటారు. ఒకర్ని ఒకరు ఓదార్చుకుంటారు. నువ్వు అంటే నాకు ఇష్టం కాదు ప్రాణం నాన్న అని సత్య చెప్తుంది. మా నాన్నకి మనసు ఉంది కోరికలు ఉన్నాయి ఆశలు ఉన్నాయని అవేంటో తెలుసుకొని నెరవేర్చాల్సిన బాధ్యత నాకు ఉందని సత్య అంటుంది. సాధ్యమో అసాధ్యమో తెలీదు కానీ ఈ ఇళ్లు మీకు దక్కేలా చేస్తానని అంటుంది.
విశ్వనాథం: ఈ ఇళ్లు మనకు దూరం చేయాలి అనుకున్నది మీ మామగారే అది నేను నమ్ముతున్నాను అమ్మా. రుజువులు అడగకు. కొన్ని నిజాలకు రుజువులు ఉండవని నువ్వే చెప్తావ్. మౌనంగా నువ్వు పడే బాధ నాకు తెలిసేలా చేసిందమ్మా. దేవుడు ఉన్నాడు అనేదాని కంటే నా సత్య అబద్ధం చెప్పదని నేను నమ్ముతాను అమ్మ. మీ మామ చూపించిన ప్రేమ నటన. అయినా నువ్వు గొంతు దాటి ఒక్క మాట బయటకు చెప్పలేదు. అది నా కూతురు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది కంగారు పడకమ్మా నేను అడగను. ఎందుకంటే చెప్పాలి అనుకుంటే నా కూతురు ఎప్పుడో చెప్పేది.
సత్య: లాభ నష్టాలు లెక్కించుకోకుండా కొన్ని సార్లు న్యాయం వైపు నిలబడాల్సి ఉంటుంది నాన్న. అన్యాయం బెదిరిస్తుంది. భయపెడుతుంది అంతే.
విశ్వనాథం: నీ మాటలు వింటుంటే యుద్ధంలో చాలా దూరం వెళ్లినట్లుంది.
సత్య: మనసులో నా భర్తని ప్రమాదం నుంచి తప్పించుకోవాలని తాపత్రయ పడుతున్నా నాన్న.
సత్య ఇంటికి వస్తే భైరవి ఆపి సత్యతో గొడవ పెట్టుకుంటుంది. ఇప్పుడు మాట్లాడటానికి నాకు ఓపిక లేదు అని సత్య చెప్తే అంతా నీ ఇష్టం అయిపోయింది నేను నీ భర్తని కన్న తల్లిని గౌరవం లేదా అని అంటుంది. దానికి సత్య మీకు చెప్పకుండా వెళ్లి తప్పు చేశాను నన్ను క్షమిస్తారా కాళ్లు పట్టుకోవాలా అని అంటుంది. నా తల నొప్పి నాకు ఉంది అని చిరాకు పెట్టొద్దని అంటుంది. దానికి భైరవి నా పెనిమిటి ఏం చేశాడే నా భర్త పరువు తీస్తున్నావ్ అంటుంది. నా కూతురు, కొడుకుని నా భర్త మీదకి పంపిస్తున్నావని తిడుతుంది. నా భర్త మీద కుట్రలు చేస్తావా అని అడుగుతుంది. ఇక మహదేవయ్య వస్తాడు. కోడలిని ఏం అనొద్దు అని నేను మాట్లాడుతా అని భైరవిని పంపేస్తాడు. గట్టిగా వార్నింగ్ ఇవ్వమని భైరవి చెప్తుంది. ఇక మహదేవయ్య సత్యతో తన మనసు సంతోషంతో నిండిపోయిందని చెప్పి సిగరెట్ కాల్చి నా ఆట బాగుందా నా ముందు తల ఎగరేస్తే అవతల ఎలా ఉన్నా బలిస్తా అని అంటాడు.
మహదేవయ్య: నిన్ను చూసి జాలి పడాలి అనిపిస్తుంది. రాజీ పడాలి అనిపిస్తుంది.
సత్య: రాజీ అంటే క్రిష్ తండ్రి ఎవరో చెప్పేస్తారా.
మహదేవయ్య: నాతో పెట్టుకుంటే నష్టపోతావ్. నీ పుట్టింటికి నష్టం కలిగించా అయినా బుద్ధి రాలేదా నేను తలచుకుంటే మీ బతుకులు నరకం చేస్తా.
సత్య: మిస్టర్ మహదేవయ్య మీరు ఎంత పిరికి వాడో అర్థమైంది నన్ను ఎదుర్కొలేక నా పుట్టింటి మీద పడ్డారు అదేనా మీ మీసాలకు ఉన్న రోషం.
మహదేవయ్య: సత్య నేను తలచుకుంటే నువ్వు ఈ లోకంలోనే ఉండవు. పొగరు బోతు మాటలు మాట్లాడకు.
సత్య: నాకు మా నాన్న అంటే ప్రాణం మీరు మళ్లీ మా నాన్న జోలికి వస్తే నేను చూస్తూ ఊరుకోను.
మహదేవయ్య: నీ వీక్ నెస్ మీ తండ్రి అని చెప్పావు కదా మళ్లీ మళ్లీ నీ తండ్రిని ఇబ్బందులకు గురిచేస్తా.
సత్య: అదే జరిగితే క్రిష్ వరకు కాదు నేను మీ ప్రాణాలు తీస్తా.
మహదేవయ్య: ఏయ్.
సత్య: వద్దు మా నాన్న జోలికి వెళ్లొద్దు చాలిక.
మహదేవయ్య: నువ్వు కూడా క్రిష్ తండ్రి గురించి వదిలేయ్ లేదంటే నీ పని అయిపోతుంది
సత్య: ఆట నేను ఆడిస్తా మీరు నాకు కండీషన్లు పెట్టకూడదు.
మహదేవయ్య: ఇప్పటికే నన్ను ఎదుర్కొలేవు ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా రేపోమాపో ఎమ్మెల్యే అవుతా అప్పుడేం చేయలేవ్.
సత్య: నేనే రాజకీయ బాహుబలి అయితే.. ఏం చేస్తారు.
మహదేవయ్య పెద్దగా నువ్వుతాడు. మిమల్ని రాజకీయాలకు దూరం చేస్తా పవర్ మీకు దక్కకుండా చేస్తానని సత్య ఛాలెంజ్ చేస్తుంది. ఏం చేయగలవు అని మహదేవయ్య అంటే ఎమ్మెల్యే అవుతా అని సత్య అంటుంది. దానికి మహదేవయ్య నీకు అంత సీన్ లేదు నువ్వు పబ్లిక్‌లో పాంప్లెట్స్ పంచుతావాని అంటాడు. దానికి సత్య మీ మీద పోటీగా మీ మీదే గెలుస్తాను అంటుంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని సత్య అంటుంది. ఒకరి మీద ఒకరు ఛాలెంజ్‌లు చేసుకుంటారు. ఎలక్షన్‌లోకి వస్తే క్రిష్ నీకు దూరం అయిపోతాడు అని మహదేవయ్య అంటాడు. ఇక విశ్వనాథం ఇంట్లో అందరూ కష్టాల మీద కష్టాలు రావడంతో చాలా భయం వేసిందని మన బతుకులు రోడ్డున పడినట్లయిందని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.