Satyabhama Serial Today Episode విశ్వనాథం ఇంటికి మహదేవయ్య రౌడీలను పంపడం వాళ్లు హర్ష చేసిన 25 లక్షల అప్పు తీర్చమని వీరంగం సృష్టిస్తారు. దాంతో విశ్వనాథం పరువు తీయొద్దని వారంలో ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బు ఇస్తానని రౌడీలను ఒప్పిస్తాడు. ఇక సత్య పుట్టింటికి వెళ్తానని భైరవికి చెప్తే భైరవి పర్మిషన్ ఇవ్వదు. నా బిడ్డ రావడం లేదు నువ్వు మాత్రం మాట అంటే పుట్టింటికి వెళ్తున్నావ్ అని చెప్తుంది. ఇక సత్య ఎంత బతిమాలినా భైరవి ఒప్పుకోదు. రేణుక నేను పనులు చేస్తానని వెళ్లమని అంటే భైరవి ఇద్దరు కోడళ్లను తిడుతుంది.
జయమ్మ వచ్చి భైరవి మీద విరుచుకుపడుతుంది. కావాలనే సత్యని అడ్డుకుంటున్నావ్ అని తిడుతుంది. ఇంతలో క్రిష్ వచ్చి నేను దింపుతా పద అని సత్యతో చెప్తాడు. నన్ను కాదని వెళ్తుందా నా మాటకు విలువ లేదా అని భైరవి అంటుంది. దాంతో సత్య పుట్టింటిలో ఇప్పుడు నా అవసరం ఉంది ప్లీజ్ అత్తమ్మ వెళ్తాను అని చెప్పి క్రిష్‌తో వెళ్తుంది. జయమ్మ మనసులో భైరవి రోగం కుదిరిందని అనుకుంటుంది. ఇక భైరవి కోపంతో ఎలా వెళ్లావో అలాగే నిన్ను ఇంటికి రప్పించకపోతే నా పేరు నాగభైరవినే కాదుని అనుకుంటుంది.
విశ్వనాథం ఇంటికి సేటు రావడంతో తన డాక్యుమెంట్లు ఇచ్చి ఇంటిని తాకట్టు పెడతాడు. సేటు ఆ ఏర్పాట్లు చేస్తుంటాడు. అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టే టైంకి సత్య, క్రిష్ ఇంటికి వస్తారు. సత్య వాళ్లకి విషయం తెలీకుండా ఉండాలి అని విశ్వనాథం ప్రయత్నిస్తే అన్నీ తెలిసే వచ్చాను అని సత్య అంటుంది. అవసరం ఉన్నప్పుడు నేను ఎందుకు గుర్తు రాలేదు మామయ్య అని క్రిష్ అడుగుతాడు. డబ్బు ఎంత కావాలి అని అడుగుతాడు క్రిష్ అయితే డబ్బు వద్దని బంధాలు దూరం అయిపోతాయని విశ్వనాథం అంటాడు. నందిని కూడా నేను చెప్పి చెప్పి అలిసిపోయాను అన్న అని చెప్తుంది. ఇంతలో ఇంకో ముగ్గురు ఇంటికి వస్తారు. అందులో ఒకాయన మీ ఇళ్లు కాని ఇంటిని మీరు ఎలా తాకట్టు పెడతారు అని అంటాడు. నేనే ఇంటి అసలైన ఓనర్‌ని అని చెప్తాడు. విశ్వనాథం ఆ వ్యక్తి మీద సీరియస్ అవుతాడు డాక్యుమెంట్స్ చూపిస్తాడు. దాంతో ఆ వ్యక్తి అవి తప్పుడు డాక్యుమెంట్లు అని తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు చూపిస్తాడు. నేను ఒప్పుకోను అది నా ప్రాపర్టీ అని విశ్వనాథం అంటాడు.
ఫారెన్‌లో ఉన్నానని మీరు కబ్జా చేశారని వెంటనే ఇళ్లు ఖాళీ చేయమని అంటాడు. దాంతో క్రిష్ ఆ వ్యక్తి శేషు మీద కోప్పడితే సేటు ఆ వ్యక్తిదే ఇళ్లు అని ఎవరో మీకు మళ్లీ అమ్మి మిమల్ని మోసం చేశారని అంటాడు. అందరూ తల పట్టుకొంటారు. ఇక ఆ శేషు రెండు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్లిపోతాడు. ఇక శేషు మహదేవయ్యకి కాల్ చేసి ప్లాన్ అంతా సక్సెస్ అని చెప్తాడు. రెండు రోజుల తర్వాత వెళ్లి ఖాళీ చేయకపోతే సామాను పడేయమని చెప్తాడు. సత్య తన జోలికి రాకుండా సమస్యలు సృష్టించానని మహదేవయ్య నవ్వుకుంటాడు. విశ్వనాథం ఇళ్లంతా కలయ తిరిగి ఏడుస్తాడు. అందరూ ఓదార్చుతూనే ఏడుస్తారు. మీ అమ్మకి కనీసం చీర కూడా కొనలేదు అని కడుపు కట్టుకొని మరీ రూపాయి రూపాయి కూడ బెట్టుకొని ఇళ్లు కొన్నానని ఏడుస్తాడు. బికారి అయిపోయి రోడ్డున పడ్డానని తల బాదుకొని ఏడుస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం అని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గుత్తి వంకాయతో దీపలో మార్పు.. ఎగిరి గంతులేస్తున్న కార్తీక్.. గాలి తీసేసిన జ్యోత్స్న!