Satyabhama Today Episode సత్యని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోతానని క్రిష్ అంటాడు. దాంతో మహదేవయ్య ఫుల్ ఫైర్ అవుతాడు. ఒకసారి గడప దాటితే మీకు మాకు సంబంధం తెగిపోయినట్లే మరోసారి ఈ ఇంటి వైపు కూడా చూడ్డానికి కుదరదని అని చెప్పి క్రిష్‌ని వెళ్లిపోమని అంటాడు. భైరవి కూడా ఇక మమల్ని మర్చిపో అని అంటుంది.
క్రిష్: నేను ఇంటితోనే సంబంధం కాదు అనుకుంటున్నా నువ్వు ఏకంగా పేగు బంధమే కాదు అనుకుంటున్నావా అమ్మ. నీ పెనిమిటి వైపు నువ్వు నిలబడటం న్యాయం అయితే నేను నా భార్య వైపు నిలబడటం న్యాయమే కదా అమ్మ. పద సత్య.
జయమ్మ: ఆగండి..
క్రిష్: బామ్మా నువ్వు మాట్లాడుతున్నావా.
జయమ్మ: అవున్నా మాట్లాడుతున్నాను. ఓ దేవతని అత్యంత అవమానకరంగా ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంటే తట్టుకోలేక కడుపు మండి మాట్లాడుతున్నాను రా. జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి మాట్లాడుతున్నానురా. ఇన్ని రోజులు ఈ ఇళ్లు ఓపాపపు కూపంలా మారిపోయింది. ఇక్కడ అన్యాయాలు చూడలేక ఇది తప్పు అని చెప్పినా నా మాట వినేవారు లేక మూగబోయాను. నోరు నొక్కేసుకొని కళ్లు మూసుకొని జరిగే పాపాలు అన్నీ చూస్తూ ఉండిపోయాను. ఈ జీవితం ఇలా అంతమైపోతుందని అనుకున్నాను. నన్ను మూగదానిలా ఉంచేశారు కానీ మీరు మనుషుల్లా మారి నన్ను మార్చాలి అనుకోలేదు. ఆ దేవుడు నా బాధ చూసి జాలిపడ్డాడు. ఈ ఇళ్లు బాగుపడటానికి సత్య లాంటి ఓ దేవతని పంపాడు. ఏదో ఒక రోజు సత్య ఈ ఇంటిని స్వర్గంలా మారుస్తుందని ఆశతో బతుకుతున్నాను. అలాంటి దేవతని కూడా మీరు నిందలు వేసి ఇంటి నుంచి పంపేస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. ఇప్పటికైనా నేను నోరు తెరవకపోతే నేను బతికి ఉండి లాభం ఏంటిరా. చూడరా ఆ ముఖం చూడు ఎంత బాధ గుండెల్లో దాచుకుందో తెలుస్తుంది. మీ అమ్మా నాన్నలకి అహంకారం తప్ప మంచి తనం అంటే ఏంటో తెలీదు. నువ్వు నీ భార్యని తీసుకొని ఇళ్లు వదిలి వెళ్లడం ఏంటిరా. ఇది జయమ్మ ఇళ్లు. ఇక్కడ ఏం జరిగినా ఈ జయమ్మ అనుమతితోనే ఈ జయమ్మ ఇష్టంతోనే జరగాలి. ఈ ఇంటి దేవత ఈ ఇళ్లు వదిలిపోదు ఈ ఇంట్లోనే నా కళ్లముందే ఉంటుంది. ఈ ఇంటిని బృందావనంగా మార్చుతుంది.
భైరవి: సత్య ఇంట్లో ఉంటే మేం ఒప్పుకోం.
జయమ్మ: ఇష్టం లేని వాళ్లు ఈ ఇంటి నుంచి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు.
భైరవి: చూశావా అయ్య అత్తమ్మ ఏమంటుందో మనల్ని గడ్డి పోచల్లా తీసేస్తుంది. ఇంటి నుంచి పొమ్మంటుంది.
మహదేవయ్య: పదేళ్ల తర్వాత నా తల్లి మాట్లాడుతుంది. నాకు సంతోషంగా ఉంది కానీ నన్ను ఎదురించింది అదే బాధగా ఉంది కానీ నీ పెద్దరికాన్ని నిలబెడతా నీ ఇష్టమే మా ఇష్టం.
జయమ్మ సత్య, క్రిష్‌లను తీసుకొని ఇంట్లోకి వెళ్లుంది. భైరవి, రుద్ర కోపంతో రగిలిపోతారు. మరోవైపు విశ్వనాథం ఇంటికి వస్తాడు. కొడుకుని చూసి శాంతమ్మ ఎమోషనల్ అయిపోతుంది. విశ్వనాథం సత్య అత్తారింట్లో జరిగినదంతా చెప్తాడు. ఇంతలో నందిని వచ్చి అసలు సినిమా ఇప్పుడు మొదలవబోతుందని ఆ ఇంట్లో మీ కూతురు కష్టపడుతుందని చెప్తుంది. మా అమ్మ ఏం చేసైనా సత్యని పుట్టింటికి పంపేయాలి అని చూస్తుందని చెప్తుంది. క్రిష్ ఆలోచిస్తూ బాధ పడుతూ గదిలో కూర్చొని ఉంటే సత్య వస్తుంది. క్రిష్ గులాబి మొక్కని చేతిలో పట్టుకొని మాట్లాడుతాడు అది సత్య వింటుంది.
క్రిష్: నిన్ను ఎంత ఇష్టపడితే అంత అలుసు. ఎంత నమ్మి దగ్గరకు వస్తే అంత బాధ.
సత్య: ఎందుకు నన్ను దూరం పెడుతున్నావ్ క్రిష్.
క్రిష్: నిన్ను దూరం పెట్టడం కాదు నేను ఉండాల్సిన జాగాలో నేను ఉంటున్నా.
సత్య: క్రిష్ ఎందుకు వెళ్లిపోతున్నావ్.
క్రిష్: వెళ్లిపోవడం లేదు పారిపోతున్నా. ఇప్పుడు నువ్వు అడగబోయిన ప్రశ్నలకు నా దగ్గర లేదు. పిచ్చోడి లెక్క నేను మనసులో ఉన్నది మీదకి చెప్పేస్తా.
సత్య: నేను నీతో చెప్పని నిజాన్ని చెప్పాను అని ఇంట్లో అందరికీ అబద్దం ఎందుకు చెప్పావ్.
క్రిష్: ఒక నిజాన్ని దాచి పెట్టి నువ్వు చేసిన తప్పుని ఒక అబద్దంతో సరిచేద్దామని చెప్తాను.
సత్య: అంటే నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా.
క్రిష్: కచ్చితంగా నమ్ముతున్నా.
సత్య: అలాంటప్పుడు అందరి ముందు నువ్వు నన్ను ఎందుకు నిలదీయలేదు.
క్రిష్: నువ్వు ఏ తప్పు గురించి అనుకుంటున్నావో నాకు తెలీదు నేను అంటున్న తప్పు కిడ్నాప్ గురించి చెప్పకుండా నా దగ్గర దాచడం గురించి.
సత్య: ఎలా చెప్పమంటావ్ కాళీ నిన్నే కాదు నన్ను మోసం చేశాడు వాడి చేతిమీద సత్య అని రాసుకున్నాడు. తర్వాత చెప్పాలే అనుకున్నా కానీ చెప్పొద్దని నాన్న మాట తీసుకున్నాడు. చెప్తే నువ్వు అపార్థం చేసుకొని మన కాపురం పోతుందని.
క్రిష్: క్రిష్ అపార్థం చేసుకోడు మంచోడు అర్ధం చేసుకుంటాడని నువ్వు ఎందుకు చెప్పలేదు. అంటే నీకు కూడా నా మీద నమ్మకం లేదు కదా. సత్యని కాళీ ఇబ్బంది పెట్టాడని వాడిని చితక్కొట్టా మా వాళ్లు వద్దన్నా నిన్ను పుట్టింటికి తీసుకెళ్లా కాళీని మీ నాన్న ఎందుకు చంపాడో మీ ఇంట్లో అందరికీ తెలిసి నన్ను దూరం పెట్టారు. నీ గురించి నాకు తెలిసి కూడా ఎలా అనుమానిస్తా అనుకున్నావ్ సత్య.
సత్య: అంత దూరం ఆలోచించలేకపోయా.
క్రిష్: నీకు ఇష్టం లేకుండా నిన్ను ప్రేమించా అని నీకు నా మీద ఇంకా కోపం కదా. మళ్లీ మళ్లీ అదే చెప్తున్నా అది తప్పే తెలియక చేసిన తప్పు ఆ తప్పుని దిద్దుకొని నీ మనసు గెలుచుకోవాలని అప్పటి నుంచి తాపత్రయపడుతున్నా అది అయ్యే పని కాదు అని ఇప్పుడు అర్థమైంది. నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు కానీ నా బాధని గుర్తించు. ఓపికకి కూడా ఓ హద్దు ఉంటుంది కదా సత్య. నిన్ను మార్చుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నా కానీ అది జరగదు అని క్షణం అర్థమైంది. అందుకే ఒంటరిగా ఉంటున్నా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.