Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కోర్ట్ సీన్ ప్రారంభమవుతుంది. బోనులో ఉన్న దీపని లాయర్ వీవీ ప్రశ్నిస్తుంటారు. నోట్ లేకుండా అంత డబ్బు కార్తీక్ ఇచ్చాడు అంటే నీకు ఆయనకు మధ్య అంత పరిచయం ఉందా అని ప్రశ్నిస్తాడు. ఇక నర్శింహ ఊరిలో ఉన్న అప్పులన్నీ కార్తీకే తీర్చాడని నాలుగు లక్షల డబ్బై వేలు ఇచ్చాడని అంటాడు. పాప హాస్పిటల్స్‌ బిల్‌ కూడా కార్తీక్‌నే కట్టాడని అంటారు. ఇక వీవీ దీపతో నువ్వు ఎప్పుడైనా డబ్బులు అడిగావా అని అంటే దీప లేదు అని చెప్తుంది. 


వీవీ: కార్తీక్ నీ బంధువు కాదు చుట్టం కాదు మరేంటి. ఆరు లక్షల ఇవ్వడం ఏంటి అది కూడా నోట్ లేకుండా. తెలిసిన వాడు అయితే పాప స్కూల్ తండ్రి అని కార్తీక్ ఎందుకు సంతకం పెట్టాడు. చెప్పండి దీప మీ సంబంధం నిజమేనా.
జ్యోతి: ఇవన్నీ కార్తీక్ నాకు ముందు చెప్పుంటే బాగున్ను దీపనే బోనులో నిలబడి ఒప్పుకుంటే నేనేం చేసేది.
కార్తీక్: మనసులో.. నా వల్ల దీప ఇబ్బంది పడుతుంది ఎలా కాపాడాలి.
నర్శింహ: నా భార్య ఆ కార్తీక్‌తో ఉంది సంబంధం పెట్టుకుంది సార్. నా కూతుర్ని సరిగా చూసుకోవడం లేదని నేను నా కూతుర్ని నాకు ఇవ్వమంటే ఆయన అది నా కూతురు కాదు తన కూతురు అని అన్నాడు సార్ అది కూడా దీప ముందే. కావాలి అంటే దీపని అడగండి సార్. 
వీవీ: ఏమ్మా శౌర్య నీ కూతురు అని కార్తీక్ నీ ముందు నర్శింహతో చెప్పాడా.
దీప: ఏడుస్తూ.. చెప్పాడు. ఈ నర్శింహ నా కూతుర్ని ఎత్తుకుపోవాలి అని చూశాడు అందుకే కార్తీక్ బాబు అలా చెప్పారు.
వీవీ: కార్తీక్ నీ కూతురికి తండ్రి అయితే అప్పుడు మీకు ఏమవుతాడు. దీపకి వేరే ఒకరితో వివాహేతర సంబంధం ఉంది. 
దీప: లేదు ఎవరితో నాకు ఏ సంబంధం లేదు.
వీవీ: దీప నువ్వు నిజం ఒప్పుకోవడం లేదు ఎందుకంటే నువ్వు ఒప్పుకున్న మరుక్షణం నీకు నీ కూతురు దూరం అవుతుంది. 
దీప: మీకు దండం పెడతాను లాయర్ గారు నాకు ఎవరితోనూ ఏ సంబంధం లేదు. 
వీవీ: నువ్వు అరిచి గోల పెట్టినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. నీకు కార్తీక్‌కి సంబంధం ఉంది అనడానికి నా దగ్గర ఆధారం కూడా ఉంది.


వీవీ పెన్‌ డ్రైవ్ జడ్జికి ఇస్తారు. అందులో దీప కార్తీక్, శౌర్య ముగ్గురు చేతిలో చేయి వేసి ఒట్టు పెట్టిన ఫొటో, దీప కార్తీక్‌ని పట్టుకునేలా ఫొటోలు జడ్జి చూస్తారు. దీపకి కూడా లాయర్ ఆ ఫొటోలు చూపిస్తాడు. ఇక లాయర్ జ్యోతి తనలో తాను ఆ విజువల్స్ చూస్తే తనకే డౌట్‌ ఉందని అనుకుంటుంది. ఏ సంబంధం లేకుండానే కార్తీక్ మిమల్ని పట్టుకున్నాడా అని లాయర్ అడుగుతాడు. ఓ వైపు దీపకు కళ్లు తిరుగుతుంటాయి లాయర్‌ ప్రశ్నలకు దీప కళ్లు తిరిగి పడిపోతుంది. కార్తీక్ పరుగున బోను దగ్గరకు వెళ్తాడు. కార్తీక్, లాయర్ జ్యోతిలు దీపని లేపడానికి ప్రయత్నిస్తారు. కార్తీక్‌ దీప దగ్గరకు వెళ్లడం చూసి జ్యోత్స్న కోపంతో చూస్తుంది. దీప లేస్తే జ్యోతి నీరు ఇచ్చి దీపని నిల్చొపెడుతుంది. వాయిదా అడుగుదామంటే దీప వద్దని అనేస్తుంది. ఇక దీప కళ్లు తిరిగి పడిపోతే తన భర్త, అత్త ఇక్కడే ఉండగా కార్తీక్ మాత్రమే పరుగున వచ్చాడని దీప, కార్తీక్‌లకు సంబంధం ఉందని వీవీ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: 'త్రినయని' సీరియల్: నయనికి అండగా పోచమ్మ.. అమ్మవారి ప్రసాదంలో తిలోత్తమ ఏం కలపబోతుందో!