Satyabhama Serial Today Episode మట్టి కుండ పగిలిపోయినందుకు భైరవి సత్యని తిడుతుంది. అపచారం జరిగిందని నిందిస్తుంది. పిచ్చిగా మాట్లాడకని జయమ్మ భైరవిని తిడుతుంది. భైరవి మాటలకు సత్య బాధ పడుతుంది. ఇక రుద్ర అనుకున్నదొకటి అయినది ఒకటి అని అనుకుంటాడు. ఇక పంతులు వచ్చి కుండ  కడగలేదు కాబట్టి అరిష్టం కాదని ఇంకో కుండ తీసుకొచ్చి బోనం ఎత్తమని అంటాడు.


క్రిష్: నా చేతికి కంకణం కట్టి గంట కూడా కాలేదు ఇంతలో ఇలా జరిగింది. మనం కలిసి ఉండటం ఆ అమ్మవారికి కూడా ఇష్టం లేదు అనుకుంటా.
సత్య: కంకణం కట్టాను కాబట్టే బోనం ఎత్తే అవకాశం ఇంకా నాకు ఉంది. దిష్టి పోయింది అనుకుంటున్నా.
నందిని: వాళ్ల ఓ వైపు మీ కూతుర్ని అవమానిస్తున్నారు. పరీక్ష పేరుతో నిందిస్తున్నారు. మీకు కోపం రావడం లేదా ఎదురు తిరగాలి అనిపించడం లేదా. ఎందుకు వాళ్ల దిక్కు మాట్లాడతున్నారు. పుట్టింటి మీద ప్రేమ చంపుకున్నాను నేను నన్ను ఎందుకు సముదాయిస్తున్నారు. 
విశాలాక్షి: ఏ ఆడపిల్లా పుట్టింటికి దూరం కాకూడదు. ఆడపిల్లకి కష్టం వస్తే మొదటి గుర్తొచ్చేది పుట్టిలే.
నందిని: అందరి ఆడపిల్లలకు అలాంటి అదృష్టం ఉండదు అత్తమ్మ నాలాంటి దురదృష్ట వంతులు ఉంటారు. 
విశ్వనాథం: సత్యకి ఏం కాకూడదని అండగా ఉండేది ఎవరు పుట్టింటివాళ్లే. 
హర్ష: మీ వాళ్ల మీద నీకు కోపం ఉండొచ్చు కానీ అది శాశ్వతం కాదు నందిని.
విశ్వనాథం: నువ్వు అత్తింటి వాళ్లతో కలిసిపోవడం మాకు సంతోషంగా ఉంది కానీ నువ్వు పుట్టింటికి దూరం అవ్వడం మాకు కష్టంగా ఉందమ్మా. నాకు కూతుళ్లు ఉన్నారు ఆడపిల్లల మనసు మాకు తెలుసు.
విశాలాక్షి: మా కూతురిని అక్కడ ఏడిపించొచ్చు కానీ నా కోడలిని సంతోషంగా ఉండాలి. మీ అమ్మ అడిగిందని బోనం ఎత్తకు. మీ అమ్మానాన్న మారాలి అని బోనం ఎత్తు. నీ కాపురం బాగుండాలని బోనం ఎత్తు. సత్య బాగుండాలని బోనం ఎత్తు. చివరిగా నీ అత్తిళ్లు బాగుండాలి అని ఎత్తు.
నందిని: అత్తని హగ్ చేసుకొని ఎప్పుడూ నన్ను ఎవరూ అర్థం చేసుకోరని బాధ పడేదాన్ని కానీ ఈరోజు అర్థమైంది నేను అందర్ని అర్థం చేసుకోవాలని బోనం ఎత్తుతా అత్తమ్మ అందరి కోసం బోనం ఎత్తుతా. 


భైరవి క్రిష్ తనని తిడుతున్నాడని బాధ పడుతుంది. మహాదేవయ్యకి చెప్పుకొని ఫీలవుతుంది. ఇక అందరూ అక్కడికి వస్తారు. జయమ్మ నందిని బోనం ఎత్తుకుంటుందా అని అంటే భైరవి బోనం ఎత్తదని అంటుంది. దాంతో నందిని బోనం ఎత్తుతా అంటుంది. అత్త చెప్తే ఎత్తావా అంటే అవును అంటుంది నందిని. ఇక అందరిని మీ వలలో వేసుకున్నారని సత్య ఫ్యామిలీని భైరవి అంటుంది. ఇక సంధ్య కూడా బోనం ఎత్తుతానని అంటుంది. జయమ్మ అందరికీ బోనాలు సిద్ధం చేసుకోమని చెప్తుంది. 


సత్య, నందిని, సంధ్యలు బోనాలు రెడీ చేస్తారు. రేణుకని చూసి రుద్ర తప్పించుకున్నావ్ అయినా వదిలి పెట్టనని అనుకుంటాడు. క్రిష్ సత్యని చూస్తూ నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి సత్య అని అంటాడు. ఇక భైరవి పంకజానికి సైగ చేస్తుంది. పంకజం వెళ్తుంది. సంధ్య, నందిని, సత్య కోసం మజ్జిగ సిద్ధం చేసి సత్యకి ఇచ్చే మజ్జిగలో మత్తు మందు కలుపుతుంది. సత్యకి క్రిష్ నందినికి హర్ష సంధ్యకి విశాలాక్షి బోనం ఎత్తుతారు. ఇక పంకజం ముగ్గురికి మజ్జిక తీసుకొని వచ్చి ఇస్తుంది. ముగ్గురు తాగుతారు. బోనం పట్టుకొని అమ్మవారి దగ్గరకు వెళ్తారు. సత్యకి కళ్లు తిరడగం మొదలవుతుంది. సత్య కళ్లు తిరుగుతున్నాయని అంటుంది. అందరూ కంగారు పడతారు. క్రిష్ వాటర్ తెచ్చి సత్య ముఖం మీద వేస్తుంటాడు. అందరూ సత్యకి నడవమని ధైర్యం చెప్తారు. మరోవైపు బాబీని కొందరు కావాలని గొడవ పెట్టుకుంటారు. బాబీ క్రిష్‌కి కాల్ చేసి పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తియిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కన్నతండ్రి చెంప పగలగొట్టిన జ్యోత్స్న.. బావ, దీపలను ఎంజాయ్ చేయమంటావని తల్లిపై జ్యో సీరియస్!