Karthika Deepam Idi Nava Vasantham Serial Episode బూబోడు ఇక ఎప్పటికీ రాడు అనీ అమ్మ చెప్పినట్లు వినాలని అమ్మకి చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకని కార్తీక్ శౌర్యతో చెప్తాడు. దానికి శౌర్య ఇవన్నీ చెప్తున్నావ్ అంటే ఇక నువ్వు రావా అని అడుగుతుంది. దీప కార్తీక్‌లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. శౌర్య కార్తీక్ గుడ్ ఫ్రెండ్స్ కదా మనం ఎప్పటికీ విడిపోమని అంటాడు. ఇక జ్యోత్స్న, పారిజాతం బాగా చర్చలు జరుగుతున్నాయని అనుకుంటారు. ఇక కార్తీక్ శౌర్య మూతి తుడిచి తినిపిస్తాడు. జ్యోత్స్న రగిలిపోతుంది. దానికి పారిజాతం ఒక తల్లి తండ్రి పిల్ల ఫ్యామిలీ సినిమా  చూపిస్తున్నారని అంటుంది. ఇక జ్యోత్స్న వాళ్లకి సినిమా చూపిస్తానని ఫోటో తీస్తుంది. ఇక కార్తీక్ వాళ్లు వెళ్లిపోతారు. 


నర్శింహ: అమ్మా అమ్మా ఎక్కడున్నావే.
శోభ: ఈవిడ ఇంకా ఇంటికి రాలేదు.
నర్శింహ: మా అమ్మ రాని తన సంగతి చెప్తాను. 
శోభ: ఆపండి మీ నాటకాలు. నువ్వు దీపనే కాదురా నన్నుకూడా మోసం చేశావ్. మీ అమ్మ కూడా మోసం చేసింది. ఆవిడ ఏదో ఉద్దరిస్తుందని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు చెప్పుతో కొట్టినట్లు బాగానే బుద్ధి చెప్పింది. ఇంత చేసిన తర్వాత మీ అమ్మని నేను క్షమించను. ఆవిడ నా ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. ఆవిడ వచ్చేలోపే ఆవిడ బట్టలు వాకిట్లోకి విసిరేసి గేటు దగ్గర నుంచే గెంటేయాలి.
అనసూయ: అంత శ్రమ నీకు ఇవ్వాలి అనుకోవడం లేదు శోభ. 
నర్శింహ: నిజం చెప్పొద్దని చేతులు పట్టుకొని బతిమాలాను కదా అయినా కొడుకు కోసం ఆ మాత్రం కూడా చేయలేవా . ఇప్పుడు దీప కేసు పెడితే నేను జైలుకి వెళ్తాను.
శోభ: నువ్వు జైలుకి వెళ్తే నష్టపోయేది నేను కదా ఈవిడకి ఏం. బాగానే ఉంటుంది.
అనసూయ: లాగి పెట్టి కొట్టానంటే దవడ ఎండిపోతుంది.
శోభ: కొడతారా.
అనసూయ: కొట్టడం కాదే ఎగిరి తంతాను. ఈ రచ్చ అంతా జరగడానికి కారణం నువ్వే కదా. ఈ కేసు కోర్టుకి వెళ్లడానికి కారణం నువ్వే ఆరోజే వీడికి చెప్పా కోర్టులు వద్దని నువ్వే వాడిని రెచ్చగొట్టావ్ ఇప్పుడు మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు.
నర్శింహ: నువ్వు నిజం చెప్పకపోయి ఉంటే నా కూతురు నా దగ్గరే ఉండేది.
అనసూయ: ఏంట్రా నీ కూతురు కన్నప్పుడే వదిలేసి పోయావ్ ఏ రోజు అయినా దానికి కడుపు నిండా అన్నం పెట్టావా అప్యాయంగా దగ్గరకు తీసుకున్నావా దాని పేరు కూడా నేను చెప్తే నీకు తెలిసింది. దీప బిడ్డని ప్రాణంగా చూసుకుంది. బిడ్డ కోసం అయినా వస్తావని ఎదురు చూసిందిరా. దాన్ని నువ్వు దారుణంగా మోసం చేశావ్. ముగ్గురు ఆడవాళ్ల నమ్మకంతో ఆడుకున్నావ్ ఇంకా నీ కూతురి జీవితంతో కూడా ఆడుకోవాలి అనుకున్నావా దీప పాపని అల్లారు ముద్దుగా పెంచిందిరా ఆ చంటిది దీని చేతిలో పడితే బోరు బావిలో పడినట్టే. దీప మీద నీకు పగ ఉందని నాకు తెలుసు నువ్వు దాన్ని బతకనిస్తావా. ఇవన్నీ ఆలోచించి చేసిన పాపం కడిగేసుకున్నాను. నేను నా దారి చూసుకుంటాను. నేను ఎవరి పంచ తొక్కను నా దారి నేను చూసుకుంటాను. సంచిలో ఏమో పట్టుకొని పోయా అనుకుంటావు. నేను తెచ్చిన నాలుగు చీరలే పట్టుకెళ్తున్నా చూడు.
శోభ: మీ అమ్మ మనల్ని అన్యాయం చేయడమే కాకుండా ఎలా మాట్లాడుతుందో చూశావా.
నర్శింహ: మా అమ్మ మామూలుగా పోవట్లేదే మనల్ని నిలువునా ముంచి పోతుంది. మా అమ్మతోనే నా అడ్డు తొలగించుకున్నావ్ కదా దీప.


జ్యోత్స్న, పారిజాతం ఇంకా కార్తీక్, దీపల గురించి ఆలోచిస్తుంటారు. ఇక పారిజాతం ఆర్డర్ ఇచ్చి వాష్ రూమ్‌కి వెళ్తుంది. ఇక పారిజాతం కన్నకొడుకు కూడా అదే రెస్టారెంట్‌కి వస్తాడు. బేరర్ వాటర్ తీసుకెళ్తుండటం అతను అక్కడికి వచ్చి ఆయన్ను ఢీ కొట్టడంతో వాటర్ జ్యోత్స్న మీద కొడుతుంది. దాంతో జ్యోత్స్న వెయిటర్‌తో పాటు తన కన్నతండ్రిని కొడుతుంది. పారిజాతం షాక్ అయిపోతుంది. అలాంటి వాళ్లని చెప్పుతో కొట్టాలని జ్యోత్స్న అంటే పారిజాతం జ్యోత్స్నని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. 


పారిజాతం: జ్యోత్స్న నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా.
జ్యోత్స్న: ఎవర్ని.
పారిజాతం: మనసులో వాడు నీ కన్న తండ్రి అని చెప్పలేను నా కొడుకు అని చెప్పలేనే. వైజాగ్‌లో ఉండాల్సిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు. తనని చూసే దాసు ఇక్కడికి వచ్చాడా అని అంటుంది. దీప మీద కోపం అందరి మీద చూపిస్తావా. చేసింది చాలు ఇక పద. 
జ్యోత్స్న: నువ్వు ఎందుకు ఇంత కోపం వస్తుందో నాకు తెలీడం లేదు గ్రానీ. 


 జ్యోత్స్న ఇంటికి వచ్చి దీప ఉన్నింటికి తాళం వేస్తుంది. విడాకులు తీసుకున్న మనిషి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని అంటుంది. సుమిత్ర వచ్చి ఎందుకు తాళం వేశావని అడిగితే దీప ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. అది నువ్వు చెప్పకూడదని అంటుంది. దానికి జ్యోత్స్న మరి ఎవరు బావ చెప్తాడా అని అంటుంది. కార్తీక్ దీప పాప కలిసున్న ఫొటో చూపిస్తుంది. అది చూసిన సుమిత్ర తాను వాళ్లని రెస్టారెంట్కి పంపానని అంటుంది. దీపకి ఈ రేంజ్ ఎంక్‌రేజ్ మెంట్ ఉంటే ఇక నాకు పెళ్లి ఎందుకు అవుతుందని జ్యోత్స్న అంటుంది. నిన్ను చూస్తుంటే దీప బాగా కష్టపడింది రెండు రోజులు అలా సరదాగా రండి అని దీపని బావని తీసుకెళ్లమనేలా ఉన్నావని అంటుంది. సుమిత్ర కోపంతో కొట్టబోతూ దీపని చూసి ఆగిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాకి బోల్తా కొట్టించిన రామ్, సీతలు.. సూర్య, మధులకు గుడ్ న్యూస్ చెప్పిన అన్న!