తెలుగు బుల్లితెర వీక్షకులకు ప్రతి రోజూ అనేక టీవీ సీరియళ్లను అందిస్తున్న టీవీ ఛానళ్లల్లో సన్ నెట్వర్క్ గ్రూప్ ఛానల్ జెమిని (Gemini TV) ఒకటి. జెమిని టీవీలో ఇప్పటికే పలు సీరియళ్లు టెలికాస్ట్ ఉన్నాయి. ఇవాళ్టి నుంచి రెండు కొత్త సీరియళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఆ రెండు సీరియళ్ల పేర్లు ఏమిటి? అవి ఏయే సమయాల్లో టెలికాస్ట్ అవుతాయి? అనేది చూస్తే...
రాత్రి 8.30 గంటలకు జెమిని టీవీలో 'రాధ'
Radha Telugu TV Serial On Gemini TV: ప్రతి చిన్నారికి బాల్యంలో అమ్మ ఎంతో ప్రేమతో తినిపించే గోరుముద్దలు, 'చందమామ రావే జాబిల్లి రావే' అంటూ పాడే జోల పాటలు ఎప్పటికీ మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలు.
అటువంటి మధుర స్మృతులు, జ్ఞాపకాలు ఏవీ ఖుషికి ఉండవు. అయితే... అమ్మను, అమ్మ ప్రేమను పొందాలని ఆరాటపడే ఖుషికి రాధ ఎదురు పడుతుంది. ఆమె మనసును ఆమె ప్రేమ తాకుతుంది. అమ్మను తలపించింది. దాంతో తనకు రాధే అమ్మలా రావాలని పట్టు పడుతుంది ఖుషి. మరి, అప్పుడు రాధ ఏమని చెప్పింది? ఖుషికి అమ్మ కాగలిగిందా? లేదా? రాధ జీవితంలో ఏం జరుగుతుంది? ఆమె ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది? దైవం ఇచ్చిన బాధ్యతను ఎలా నిర్వర్తించింది? ఆమె జీవితం ఎలా సాగింది? అనేది తెలియాలంటే... జెమినీ టీవీలో ఈ నెల 30 (స్టెప్టెంబర్ 30) నుంచి టెలికాస్ట్ అయ్యే సరికొత్త డైలీ సీరియల్ 'రాధ' చూడాలి.
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8:30 గంటలకు 'రాధ' టెలికాస్ట్ కానుందని 'జెమిని టీవీ' వర్గాలు చెప్పాయి. మరి, ఈ సీరియల్ వీక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది? అనేది చూడాలి.
మూడు ముళ్ళు... రాత్రి 9 గంటలకు!
Moodu Mullu New Serials On Gemini TV: జెమినీ టీవీలో ఈ నెల (సెప్టెంబర్) 30వ తేదీన మొదలైన మరో సీరియల్ 'మూడు ముళ్ళు'. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి తొమ్మిది గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.
'మూడు ముళ్ళు' సీరియల్ కథకు వస్తే... పల్లెపాలెం అనే ఒక చిన్న ఊరిలో ఇద్దరు చెల్లెళ్లే తన ప్రపంచంగా బతుకుతుంటుంది నీలవేణి. ఒకవేళ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే... మూడు ముళ్ళు వేసి, ఏడు అడుగులు నడిచి తన జీవితంలోకి ఓ మగతోడు వస్తే... తన చెల్లెళ్లు ఇద్దరి జీవితాలు ఏమైపోతాయో? అనుకుని అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకుంటుంది నీలవేణి.
అటువంటి అమ్మాయి నీలవేణి జీవితంలోకి ఆమె ప్రమేయం లేకుండా ఓ వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడు ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తే? తనది కాని ప్రపంచంలో ఏడు అడుగులు వేసి నీలవేణికి అడుగడుగునా సమస్యలు ఎదురైతే, వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనేది సీరియల్ చూసి తెలుసుకోవాలి.
Also Read: థియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...