Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పెళ్ళికొడుకులకి పెళ్ళికూతురులకి పసుపు రాసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ముందుగా సుగుణ రెండు జంటలకి పసుపు రాసి ఆశీర్వదిస్తుంది. తర్వాత హరీష్ అమ్మ ఆశీర్వదిస్తుంది.


ఒక ఆవిడ : రాధకి అమ్మ నాన్న లేరు కదా ఇప్పుడు ఆమెని ఎవరి దీవిస్తారు అని అడుగుతుంది.


పిల్లలు: ఇదిగో మా అమ్మమ్మ ఉంది కదా తనే మా అమ్మకు అన్ని చేస్తుంది అని పద్దు ని చూపిస్తారు.


సుగుణ: పద్దు మొహమాటపడుతుంటే ఆవిడ దగ్గరికి వెళ్లి మీరు నిండు ముత్తయిదువ,పిల్లలు కూడా మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తున్నారు మీరే రాధకి తల్లి స్థానంలో ఉండి పసుపు రాయండి అని చెప్పడంతో ఆమె ఆర్య కి పసుపు రాస్తుంది.


ఆర్య : నన్ను క్షమించండి, నేను ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయడం లేదు అంటాడు.


పద్దు : అలా అనకండి మీ మంచితనం నాకు తెలుసు మా అమ్మి చేసిన పనికి నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి అంటుంది.. ఆ తర్వాత పెళ్ళికొడుకులకి, పెళ్ళికూతురులకి ఆశీర్వదించి అక్కడ ఉండలేక బయలుదేరుతాను అని చెప్తుంది.


సుగుణ: పెళ్లికి అన్నయ్య గారిని తీసుకొని తప్పకుండా రండి. రాధకి తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ పనులన్నీ మీరు చేయాలి అంటుంది. అలాగే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పద్దు. 


తర్వాత ఏదో ఆలోచనలో ఉన్న ఆర్య దగ్గరికి వస్తుంది సుగుణ. నువ్వు ఇక్కడ ఉన్నావా? రేపు పెళ్లి అయ్యేంతవరకు మీరు ఏమి తినకూడదు అందుకే కడుపునిండా తినిపిద్దామని భోజనం తీసుకొచ్చాను అంటుంది.


పిల్లలు: మా నాన్నకి మేమే తినిపిస్తాము అంటారు. అమ్మకి కూడా మేము తినిపిస్తాము ఇక్కడే తినిపిస్తాము అని చెప్పి పిల్లలిద్దరూ వెళ్లి రాధ ని తీసుకొని వచ్చి ఆర్య పక్కన కూర్చోబెట్టి ఇద్దరికీ భోజనం తినిపిస్తారు. రేపటి నుంచి మీ ఇద్దరు మాకు భోజనం తినిపించాలి అంటారు.


దివ్య : నీకు నా మీద అసలు ప్రేమ లేదు నేను కూడా ఉపవాసం ఉండాలి కదా నాకు తినిపించావా అని అడుగుతుంది.


యాదగిరి: ఇప్పుడే కదా కుంభాలు కుంభాలు తిన్నావు అది చూసిన వాడు ఎవడైనా నీకు తినిపించాలనుకుంటాడా వెళ్లి మా కోబ్రా తో ముచ్చట్లు పెట్టుకో అని ఆమెని అక్కడ నుంచి పంపించేస్తాడు.


ఆ తర్వాత పెళ్లి హడావిడి ప్రారంభమవుతుంది పిల్లలిద్దరూ చక్కగా ముస్తాబయి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు.


సుగుణ: యాదగిరి దగ్గరికి వచ్చి పెళ్లి ఏర్పాట్లు అవి బాగా జరుగుతున్నాయి కదా, అల్లుడుగారు అన్ని మీరే చూసుకోవాలి అంటుంది. పెళ్ళికి మినిస్టర్ గారిని పిలిచాను ఆయనని బాగా రిసీవ్ చేసుకోవాలి అంటుంది.


యాదగిరి : మినిస్టర్ గారా అని అడుగుతాడు.


సుగుణ : మీ మావయ్య గారు ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసేవారు అందుకే ఆయన్ని పిలిచాను అంటుంది.


వీళ్ళు మాట్లాడుకోవడం చూసిన పిల్లలిద్దరూ పరిగెత్తుకొని వస్తారు.


పిల్లలు: యాదగిరి అంకుల్ మా అమ్మానాన్న వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పటానికి ఏర్పాట్లు చేశారు కదా, రాజా రాణి కి వెల్కమ్ చెప్పినట్లు చెప్పాలి అంటారు.


అందుకు సరే అంటాడు యాదగిరి. ఇంతలో మినిస్టర్ గారు వస్తారు ఆయనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు యాదగిరి వాళ్లు. ఇందులో మినిస్టర్ కి ఒక ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడిన మినిస్టర్ జెండే తో మాట్లాడి ఆర్య వర్ధన్ గారితో మీటింగ్ ఏర్పాటు చేయండి చాలా అవసరం అని చెప్తాడు. ఆ తర్వాత ఇంటిదగ్గర పెళ్ళికొడుకు ముస్తాబులో ఉన్న ఆర్య ని మెచ్చుకుంటుంది ఉష.


ఆర్య: సరేగాని అక్కడ అమ్మ ఒక్కతే కంగారుపడుతూ ఉంటుంది. రాధా, దివ్య రెడీ అయ్యారో లేదో చూడు బయలుదేరుదాం అంటాడు.


ఉష : దివ్య దగ్గరికి వెళ్లి రెడీ అయిన అంటే నేను ఎప్పుడో రెడీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఉష రాధ దగ్గరికి వెళ్లి ఈ ముస్తాబులో మీరు చాలా అందంగా ఉన్నారు అంటుంది. ముభావంగా ఉన్న రాధ తో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటుంది దేవుడు ఏం చేసినా మన మంచికే అని.అందుకే ప్రశాంతంగా ఉండండి అంటుంది.


అను: జరుగుతున్న దానికి సంతోషించాలో బాధపడాలో అర్థం కావడం లేదు నా బాధ ఎలా చెప్పుకోవాలి అనుకుంటుంది.


ఆ తర్వాత పిల్లలిద్దరూ యాదగిరి ఫోన్ తీసుకొని ఆర్య కి ఫోన్ చేస్తారు.


అక్కి : మీరు మండపానికి ఎప్పుడు వస్తారు మిమ్మల్ని అమ్మని పెళ్ళికూతురు పెళ్లి కొడుకుగా చూడాలని ఉంది అంటుంది.


అభయ్ : మీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్ అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.