Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో దాని మాటలు ఏమి పట్టించుకోవద్దు పెళ్లి జరగనువ్వు ఆర్యతో చెప్తుంది సుగుణ.


అను : ఈ గొడవ అడ్డుపెట్టుకొని సార్ పెళ్లి ఆపొచ్చు కదా, ఎందుకు పెళ్లి జరగాలని పట్టుబడుతున్నారు అనుకుంటుంది.


పంతులు: అయిందేదో అయిపోయింది, వాళ్లని పెళ్లి బట్టలు మార్చుకొని రమ్మనండి అని చెప్తారు.


అను: బట్టలు మార్చుకోవడానికి తన రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఈ పెళ్లి జరిగిపోయేలాగా ఉంది అంతా విదికే వదిలేస్తాను. పరిస్థితులను చూస్తుంటే సార్ కూడా రాజీ పడిపోయేలాగా ఉన్నారని బాధపడుతుంది.


మరోవైపు బట్టలు మార్చుకోవటానికి తన రూమ్ కి వెళుతూ ఉంటాడు ఆర్య తనకి తోడుగా యాదగిరి కూడా ఉంటాడు. అప్పుడే కీర్తికి మెలకువ రావటంతో తలుపు గడియ వేసి ఉన్న తన రూమ్ నుంచి రక్షించండి అని కేకలు వేస్తుంది.


ఆమెని రచించిన ఆర్య, యాదిగిరి ఆమె ద్వారా హరీష్ నిజ స్వరూపం తెలుసుకుంటారు.


మరోవైపు పీటల మీద కూర్చున్న హరీష్ ఎక్కడ కీర్తికి మెలకువ వస్తుందో అని కంగారుగా ఉంది పెళ్లి త్వరగా జరిగిపోతే బాగున్ను అనుకుంటాడు.


ఇంతలో యాదగిరి వాళ్లు పెళ్లి మండపం దగ్గరికి వస్తారు.


యాదగిరి: పంతులు.. మంత్రాలు చదవక్కర్లేదు ఇక ఈ పెళ్లి జరగదు అంటాడు.


హరీష్:  ఎందుకు ఏం జరిగింది అని అడుగుతాడు.


ఆర్య : నీకు కారణం కావాలా అంటూ కీర్తిని స్టేజి మీదకి పిలుస్తాడు.


హరీష్ : ఈమె ఎవరో నాకు తెలియదు అంటాడు.


యాదగిరి: ఆమె నీ ఫ్రెండ్ అని చెప్పి ఇందాక నీ రూమ్ కి వచ్చింది. నువ్వు ఆ రూమ్  ఎందుకు ఖాళీ చేశావు, తను నీ రూమ్ లోనే ఎందుకు ఉంది అని అడుగుతాడు.


హరీష్: నేను కేవలం ఫ్రెండ్ గానే ట్రీట్ చేశాను కానీ తను లవ్, ప్రెగ్నెన్సీ అంటే నేనేం చేయాలి అంటాడు.


యాదగిరి: ఇందాక ఆమె ఎవరో తెలియదు అన్నావు అంటాడు.


హరీష్: నిజంగానే నాకు ఏమీ తెలీదు మన పెళ్ళి ఆపటానికి ఇదంతా మీ అన్నయ్య చేస్తున్నాడు అని దివ్యతో చెప్తాడు.


అప్పుడు కీర్తి తన దగ్గర ఉన్న సాక్షాధారాలు చూపిస్తుంది. హరీష్ కీర్తిని ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పి లైఫ్ లో తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిన ఊరుకునేది లేదు అని చెప్పి వార్నింగ్ ఇవ్వటంతో హరీష్ కీర్తి తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జరిగిందానికి ఏడుస్తూ ఉంటుంది దివ్య.


సుగుణ: ఇప్పుడు ఎందుకు ఏడవటం, వద్దు వద్దు అంటే ప్రేమించాను అని చెప్పి వాడినే పెళ్లి చేసుకుంటానన్నావు ఇంకా అదృష్టమే పెళ్లికి ముందే నిజం తెలిసింది అంటుంది.


ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని పంతులు అడుగుతారు. పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని చెప్పి అనుని ఆర్య ని  పీటల  మీద కూర్చోమంటుంది  సుగుణ.


అను ఆర్య ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చుంటారు. మాన్సీ కంగారు పడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి అయిపోతే నిజం తెలిసిపోతుంది ఇంకా మనం ఎందుకు ఇక్కడ పదండి వెళ్ళిపోదాం అని ఛాయాదేవితో అంటుంది.


ఛాయాదేవి : అప్పుడే ఏం జరిగింది ఇంకా జరగాల్సింది చాలా ఉంది లెట్స్ వెయిట్ అండ్ సీ అంటుంది.


ఇంతలో పెళ్లి పీటల దగ్గర ఒక పొగ బాంబు ఎవరు పడేస్తారు.


ఆర్య: పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చి ఉంటారు అని చెప్పి గబగబా పిల్లల్ని దగ్గరకు తీసుకొని వాళ్లని  ప్రొటెక్ట్ చేస్తాడు యాదగిరి తో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టించు అని చెప్తాడు.


ఇంతలో కొంతమంది దుండగులు కారు లో వచ్చి అనుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి పోతారు.


కాసేపటి తర్వాత కళ్యాణ మండపం దగ్గర అంతా సర్దుకున్న తర్వాత అక్కడ రాధలేదని అందరూ గుర్తిస్తారు.


ఆర్య నేరుగా వెళ్లి మాన్సీ వాళ్ళని ఈ పని మీరే చేశారని నాకు తెలుసు రాధ ని ఏం చేశారు అని అడుగుతాడు.


ఛాయాదేవి: మేమేదో పెళ్లి చూడటానికి వచ్చాము, మీ ఎదురుగానే కదా ఉన్నాము మాకేం అవసరం అంటుంది.


ఆర్య: ఈ పెళ్లి ఆపవలసిన అవసరం మీకు కాకుండా వేరే ఎవరికీ లేదు అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.



Read Also: ‘యానిమల్‘లో అండర్‌వేర్ యాక్షన్ సీన్ - సందీప్ రెడ్డి భార్య, కొడుకు రియాక్షన్ ఇదే!