Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో మనవళ్లు దగ్గరికి వెళ్ళటానికి హడావిడి పడుతుంది శారదమ్మ. అయితే ఒకసారిగా స్తబ్దుగా అయిపోయిన తల్లిని చూసి ఏం జరిగిందమ్మా అంటాడు నీరజ్.
శారదమ్మ: ఇన్నాళ్లు ఈ ఇల్లు జీవం లేనట్లు ఉండేది కానీ ఇప్పుడు ఈ ఇంటికి కొత్త కళ వచ్చినట్లు అనిపిస్తుంది.
నీరజ్ : నువ్వు కోరుకున్నట్టే తొందరలోనే దాదాని పిల్లల్ని వదినమ్మ ని తీసుకొచ్చేద్దాంలే అమ్మ అంటాడు నీరజ్.
తర్వాత ఇద్దరు అనువాళ్ళ ఇంటికి వెళ్తారు.
అదే సమయంలో అను పూజ చేసి భర్తకి హారతి ఇస్తుంది. హారతి తను తీసుకోకుండా అనుకి ఇస్తాడు ఆర్య.
అను అదేమిటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
ఆర్య : మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇలాగే చేసావు గుర్తుందా.
ఆ మాటలకి సిగ్గుపడుతుంది అను.
ఆర్య : ఆ సిగ్గు, ఆ చిరునవ్వుతోనే నన్ను నీ లవ్ లో పడేసావు. అందరూ ఒకసారి రెండుసార్లు లవ్లో పడతారు కానీ నేను నిన్ను చూసిన ప్రతిసారి లవ్ లో పడిపోతూ ఉంటాను.
వీళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకోవడం చూసిన సుగుణమ్మ ఆనందపడుతుంది. పిల్లల కోసం బలవంతంగా పెళ్లి చేసుకున్నారు ఎలా కాపురం చేస్తారో అనుకున్నాను. భగవంతుని దయవల్ల అంతా సవ్యంగానే సాగుతుంది అనుకుంటుంది. ఇంతలో పిల్లలు అమ్మానాన్న అనుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళబోతే వాళ్లని వారించి నేను స్కూల్ కి రెడీ చేస్తాను పదండి అని తీసుకెళ్లి పోతుంది.
ఇంతలో శారదమ్మ వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన అను అత్తమ్మ అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి శారదమ్మ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది.
శారదమ్మ: ఈ పిలుపు విని ఎన్నాళ్ళయింది.
ఆర్య: ఎలా ఉన్నావ్ అమ్మ అని అడుగుత.
శారదమ్మ: ఇచ్చిన మాట కోసం ఆస్తిని ఆడంబరాలతో పాటు అమ్మను కూడా వదిలేసి వచ్చేసావు ఇంకా ఈ అమ్మ ఎలా సంతోషంగా ఉంటుంది.
అను :మమ్మల్ని క్షమించండి మేము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము.
శారదమ్మ: పర్వాలేదు ఇప్పటికైనా ఆ దేవుడి కరుణించి మీరందరూ ఒకటి అయ్యారు.
ఇంతలో బయట ఉన్న వాళ్ళని చూసి సుగుణ, ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరా అన్నట్లు చూస్తూ ఉంటారు. అను పిల్లల్ని పిలిచి మీ నానమ్మ అని పరిచయం చేస్తుంది. వాళ్ల నీ దగ్గరికి తీసుకుని ముద్దులాడిన శారదమ్మ బాగా ఎమోషనల్ అవుతుంది.
సుగుణ: వీళ్ళు ఎవరు.
అను : మా అత్తమ్మ.
దివ్య: అంటే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన నీ మొదటి భర్త వాళ్ళ అమ్మ?
జ్యోతి: ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చారు నా కోడలు అంటూ తీసుకుపోవటానికా?
సుగుణ: పిల్లలిద్దర్నీ వారించి, క్షమించండి మీ కోడల్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను అక్కడికి నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని రాదని అడిగాను కూడా .
శారదమ్మ: చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది తను మాత్రం ఏం చెప్తుంది, అయినా నా కోడలికి కష్ట కాలంలో నీడనిచ్చారు నేనే మీకు కృతజ్ఞతలు తెలపాలి. దంపతులిద్దరికీ సారె తీసుకువచ్చాను మీరు ఒప్పుకుంటే ఇస్తాను .
సుగుణ: పిల్లలిద్దర్నీ ఆశీర్వదిస్తాను అంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? (అని చెప్పి వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళుతుంది. శారదమ్మ దంపతులిద్దరికీ బట్టలు పెడుతుంది).
శారదమ్మ పిల్లలిద్దరికీ నీరజ్‌ను మీ బాబాయి అని పరిచయం చేస్తుంది. అక్కి మాకు తెలుసు అనటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
అభయ్ : ఏం మాట్లాడుతున్నావ్ అని చెల్లెల్ని వారించి, తనకేం తెలియదు కానీ అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఇస్తుంది?
నీరజ్ పిల్లలిద్దరి మెడలోని బంగారం చైన్లు వేస్తాడు. ఇక శారదమ్మ అక్కడి నుంచి బయలుదేరుతూ తూలి పడిపోబోతుంది.. ఆమెని పట్టుకుంటాడు ఆర్య. శారదమ్మ పర్వాలేదులే ఆర్య అనటంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.