Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఈ ఇంట్లో పెళ్ళి కళ వచ్చింది, అందరి మొహాల్లోని కళ కనిపిస్తుంది. దీనికి కారణం నా బావమరిది రావటమా లేక దివ్య పెళ్ళా అంటాడు యాదగిరి.
జ్యోతి: టాపిక్ మార్చడం కోసం కాఫీ తీసుకు రమ్మంటారా అని అడుగుతుంది.
యాదగిరి: నువ్వు అదే కదా కట్నం అడిగితే మాత్రం తేలేరు గాని కాఫీ కావాలా అని వయ్యారంగా అడుగుతారు అని కేకలు వేస్తాడు. ఇంతకీ నా బావమరిది ఏడి కనిపించడం లేదు. సింహంలాంటి బావమరిదిని ఫేస్ చేయలేక పిల్లి లాగా దాక్కున్నాడా అని వెటకారంగా మాట్లాడుతాడు.
మరోవైపు కార్ లోంచి దిగిన ఆర్యని ఇంత సఫర్ అవుతూ ఇంట్లో ఎలా మేనేజ్ చేయగలవు, ఏదో ఒకటి చెప్పి మన ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అంటాడు జెండే.
ఆర్య : అది కూడా నా ఇల్లే జెండే. అయినా ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉంటారు ఎవరైనా వచ్చి ఇబ్బంది పడతారు నేను ఉండటం అవసరం.
జెండే : సరే రోజు డ్రెస్సింగ్ చేసుకో రెండు రోజుల తర్వాత హాస్పిటల్ కి వెళ్దాం అంటాడు.
ఆర్య సరే అని చెప్పి తన ఇంటికి బయలుదేరుతాడు. తన ఇంటికి వస్తున్న ఆర్యని చూసి షాక్ అవుతాడు యాదగిరి. ఇదేంటి ఈయన ఇక్కడికి వస్తున్నారు అనుకుంటూ వెళ్లి ఆర్య కాళ్ళ మీద పడిపోయి అతి వినయం చూపిస్తాడు. నేను సార్ యాదగిరిని గుర్తున్నానా అంటూ తెగ ఓవరాక్షన్ చేస్తాడు.
ఉష: మా అన్నయ్య మీకు ముందే తెలుసా? బాగా తెలిసినట్లు పలకరిస్తున్నారు.
ఉష మాటలకి కన్ఫ్యూజ్ అవుతాడు యాదగిరి. ఇతను నా బావమరిది సూర్యనా అని అడుగుతాడు.
ఆర్య : యాదగిరిని హాగ్ చేసుకుని అతని చెవిలో సీక్రెట్ గా నువ్వు ఎక్కడ ఏమి మాట్లాడకు ఇక్కడ నేను సూర్యని మాత్రమే అంటాడు.
అలాగే సార్ నేనే కాదు ఇంకెవరు కూడా మీ జోలికి రాకుండా చూసుకుంటాను అంటాడు యాదగిరి. మనసులో మాత్రం ఆర్య సార్ ఇక్కడ ఉండడమేంటి ఇక్కడ ఏదో జరుగుతుంది మరదలు పెళ్లి అయిన వరకు ఇక్కడే ఉండి అదేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు.
మరోవైపు దివ్యకి కాబోయే భర్తని తన ఇంటికి పిలిపిస్తుంది ఛాయాదేవి.
ఛాయాదేవి : నువ్వు దివ్యని కట్నం అడగాలి అంటుంది.
దివ్యకి కాబోయే భర్త : మాది లవ్ మ్యారేజ్ మేడం, అయినా మేము కట్నాలు అవీ వద్దనుకున్నాం.
ఛాయాదేవి : అయితే నీకు రావాల్సిన కాంట్రాక్టు గురించి మర్చిపో.
దివ్యకి కాబోయే భర్త: వద్దు మేడం మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అయినా అంత కట్నం అంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలా తెస్తారు.
ఛాయాదేవి : అప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు నీ పేరు మీద రాయమని అడుగు. ఎలా చేస్తావో తెలియదు కానీ ఆ ప్లేస్ మాత్రం నీ పేరు మీద రాయించుకో అని చెప్పి అతనిని పంపించేస్తుంది.
మాన్సీ: వాళ్లు కట్నం డబ్బులు ఇవ్వలేక ల్యాండ్ ని ఇతని పేరు మీద రాసిస్తారు కరెక్టే కానీ దానివల్ల మా బ్రో ఇన్ లా కి ఏంటి నష్టం.
ఛాయాదేవి: వెయిట్ అండ్ సీ.
మరోవైపు ఎవరికి కనిపించకుండా డ్రెస్సింగ్ చేసుకోవటం కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతుకుతూ ఉంటాడు ఆర్య. అది చూసిన అను తన రూమ్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని ఇది ఎలా ఆయనకి ఇవ్వాలి భగవంతుడా ఇది ఎలా అయినా ఆయనకి చేరేలాగా చూడు అని మనసులో అనుకుంటుంది.
ఆర్య గాయాన్ని అనుకోకుండా పిల్లలిద్దరూ చూస్తారు. అమ్మో, ఎంత పెద్ద గాయం అంటారు.
ఆర్య : ష్.. అరవకండి ఇంట్లో ఎవరైనా వింటారు.
పిల్లలు: ఎందుకు, వింటే ఏమవుతుంది.
ఆర్య : అమ్మకి తెలిస్తే బాధపడుతుంది.
పిల్లలు: అవును, మాకు దెబ్బ తగిలినప్పుడు కూడా అమ్మ ఇలాగే బాధపడుతుంది అందుకే మేము కూడా అమ్మకు చెప్పము.
ఆర్య: మీరు చిన్నపిల్లలు కదా మీరు ప్రతిదీ అమ్మకు చెప్పాలి.
ఇప్పుడు ఫ్రెండ్ కి డ్రెస్సింగ్ ఎవరు చేస్తారు అని అభయ్ అంటే ఎవరో ఎందుకు మనమే చేద్దాం అంటూ తన రూమ్ కి పరిగెడుతుంది అక్కి. అను చేతిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చూసి ఇది ఎందుకు పట్టుకున్నావ్ అని అడుగుతుంది.
అను : రూమ్ సర్దుతుంటే దొరికింది, అక్కడ పెట్టేద్దామని తీసుకు వెళ్తున్నాను.
అక్కి : నేను అన్నయ్య డాక్టర్ ఆట ఆడుకుంటున్నాము ఆ బాక్స్ ఇటు ఇవ్వు అని చెప్పి చేతిలో బాక్స్ లాక్కొని వెళ్ళిపోతుంది.
తర్వాత ఆర్యకి పిల్లలిద్దరూ కలిసి డ్రెస్సింగ్ చేస్తారు. పిల్లలిద్దరికీ థాంక్స్ చెప్పి ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని పిల్లల దగ్గర మాట తీసుకుంటాడు ఆర్య. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌కు కనకం, కనకానికి కావ్య.. షాకుల మీద షాకులు