Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో సూట్ వేసుకొచ్చిన ఆర్యని చూసి అందరూ షాక్ అవుతారు.
యాదగిరి: సూట్ వేసుకుంటే కటౌట్ ఇలా ఉండాలి, క్లాస్ కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు అంటాడు.
హరిష్ తల్లి : మిమ్మల్ని చూస్తుంటే పెద్ద బిజినెస్ మాన్ లాగా కనిపిస్తున్నారు అంటుంది.
ఆ మాటలకి కంగారు పడిపోతారు అను, యాదగిరి.
ఆర్య : అలాంటిదేమీ లేదండి మీరందరూ వేసుకోమన్నారని వేసుకున్నాను. మీరందరూ షాపింగ్ కంటిన్యూ చేయండి అనటంతో షాపింగ్ పనిలో పడతారు అందరూ.
ఆ తర్వాత బిల్ తీసుకువచ్చి సుగుణకి ఇస్తుంది షాపావిడ. బిల్లు నాలుగు లక్షలు కావటంతో షాక్ అవుతుంది.
హరీష్ తల్లి : మీ పరిస్థితిని చూసి తక్కువ బడ్జెట్లో షాపింగ్ చేసాము. అదే మా అమ్మాయి పెళ్ళికి అయితే పెట్టిపోతలకే 10 లక్షలు అయ్యాయి అంటారు.
హరీష్ బంధువు : అయ్యో పిల్లలకి బట్టలు తీసుకోవడం మర్చిపోయాం.
హరీష్ తల్లి : ఏం పర్వాలేదులే మరో లక్ష క్యాష్ మన చేతికి ఇస్తే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి బిల్ మీ అబ్బాయికి ఇచ్చేయండి అని సుగుణతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
యాదగిరి: 4 లక్షలు బిల్లా ఈ అమౌంట్ తో చిన్న సైజు పెళ్లి చేయొచ్చు.
ఉష: మా బట్టలు అన్నీ కలిపి 20,000 కూడా కాలేదు మిగతా షాపింగ్ అంతా వాళ్లే చేశారు ఇప్పుడు అన్నయ్య ఎలా కడతాడో ఏంటో అని బాధపడుతుంది.
యాదగిరి ఆ బిల్లుని తీసుకువెళ్లి ఆర్యకి ఇస్తాడు. నాకు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వు నేను వచ్చి బిల్ పే చేస్తాను.
ఆ తర్వాత తన భర్తని ఈ ఆపద నుంచి కాపాడమని దేవుడిని కోరుకుంటుది అను.
హరీష్: మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది కానీ ఐ కాంట్ హెల్ప్ యు అని మనసులో అనుకుంటాడు.
దివ్య: అంతా నేను చూసుకుంటానని ఫోజులు కొట్టాడు కదా ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అని జ్యోతితో అంటుంది.
ఇదంతా ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తూ ఉంటారు ఛాయాదేవి, మాన్సీ.
మాన్సీ : బ్రో ఇన్ లా జేబులో 15,000 మాత్రమే ఉన్నాయి అయినా ఆ మొహంలో కాన్ఫిడెంట్ తగ్గలేదు.. ఎలా బిల్ పే చేస్తారో అంటుంది.
ఛాయదేవి : అదే ఆర్య గొప్పతనం, ఎలాంటి ప్రాబ్లం వచ్చిన మొహంలో కాన్ఫిడెన్స్ తగ్గదు. పది నిమిషాల్లో నాలుగు లక్షల కట్టాలి అయినా మొహం లో ఎక్కడ టెన్షన్ కనిపించడం లేదు.
మాన్సీ : మామూలుగా బ్రో ఇన్ లా కి లక్ ఎక్కువ, ఎప్పుడూ ఆ దేవుడు ఆయనకి ఫేవర్ చేస్తూనే ఉంటాడు. కానీ ఈసారి ఆ దేవుడు కూడా ఏమి చేయలేడు చూస్తూ ఉండండి అవమానంతో తలదించుకుంటారు.
మరోవైపు షాప్ లో బిల్ ఇంకా కట్టకపోవడంతో హరీష్ బంధువులందరూ అసహనాన్ని వ్యక్తం చేస్తారు. అసలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అందరి ముందు మమ్మల్ని ఇలా అవమానిస్తారేంటి అంటూ కోప్పడతారు.
దివ్య: సారీ హరీష్ నేను వెళ్లి మాట్లాడతాను అని ఆర్య దగ్గరికి వెళ్లి బిల్ కడతారు అన్నావు కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అని నిలదీస్తుంది.
సుగుణ, యాదగిరి వచ్చి ఆమెని మందలిస్తారు. ఇంతలోనే ఆర్య ఫోన్ కి మెసేజ్ రావటంతో పదండి వెళ్లి బిల్లు కడదాం అని చెప్పి బిల్ మొత్తం పే చేస్తాడు.. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఆర్య : ఇదంతా నీ డబ్బుతోనే జరుగుతుంది సూర్య. నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నువ్వు ఎక్కడున్నా సంతోషంగానే ఫీల్ అవుతావని అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు.
ఒక్కసారిగా ఇంత డబ్బు ఎలా వచ్చింది అని ఇటు దివ్యతో పాటు అటు ఛాయాదేవి, మాన్సీ కూడా షాక్ అవుతారు.
మాన్సీ : చెప్పాను కదా మా బ్రో ఇన్ లా ని ఓడించడం ఎవరితరం కాదు.
ఛాయదేవి: ఒక్క ఇన్సిడెంట్ కే గెలిచినట్లు ఫీల్ అవ్వద్దు, ఈ పెళ్లి జరగనివ్వను ఆర్యని గెలవనివ్వను అని పంతం పడుతుంది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆర్యని నిలదీస్తారు.
ఆర్య : నేను దుబాయ్ లో పని చేస్తూ ఉండగా ఇన్సూరెన్స్ కట్టాను.. ఆ డబ్బులే ఇప్పుడు వచ్చాయి వాటితోనే బిల్ పే చేశాను అని చెప్తాడు.
దివ్య ఇంకా ఏవో ప్రశ్నలు వేస్తుంటే మీ షాపింగ్ అయిపోయింది కదా ఇంక విసిగించకండి అని చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు యాదగిరి.
యాదగిరి : వాళ్ళందరిని పంపించేసాను కానీ నాకు కూడా అదే అనుమానం సార్ ఇన్సూరెన్స్ అనేది చనిపోయాక కదా ఇస్తారు అని అడుగుతాడు.
ఆర్య: అవి సూర్య డబ్బులే తన బాధ్యతలు ఎప్పుడూ తన డబ్బులతోనే జరగాలి అని కోరుకునే వాడు. కానీ ఆ పనులు నా ద్వారా జరిగేలాగా చూస్తున్నాడు.
యాదగిరి: అలా అయితే మా బావమరిది ఏమయ్యాడు అని కంగారుగా అడుగుతాడు.
ఆర్య: అన్ని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అప్పటివరకు ఏమీ అడగవద్దు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అందరూ షాపింగ్ చేసిన బట్టలు చూసుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి కోప్పడతాడు యాదగిరి.
యాదగిరి : షాపింగ్ కి వెళ్లే ముందు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అని లొల్లి చేశారు.. ఇప్పుడు మాత్రం హీరోయిన్ల లెక్క ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అంటాడు.
ఇంతలో అక్కడికి ఆర్య పిల్లలు వస్తారు. వాళ్లని చూసిన సుగుణ.. డబ్బులు తక్కువ ఉన్నాయి అని రాధకి పిల్లలకు బట్టలు కొనటం మర్చిపోయాను అని బాధపడుతుంది.
ఉష: నువ్వు మర్చిపోయిన నేను కొన్నావమ్మా అని చెప్పి బట్టలు పిల్లల చేతిలో పెడుతుంది.
పిల్లలు ఆనందపడుతూ థాంక్స్ చెప్తే మీ ఫ్రెండే కొన్నారు ఆయనకు చెప్పండి అంటుంది ఉష. పిల్లలు ఆర్యకి థాంక్స్ చెప్తారు.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : స్వప్నను కాపాడిన అపర్ణ - రాజ్‌కు షాక్ ఇచ్చిన శ్వేత