Prema Entha Madhuram Telugu Serial Episode: ఈరోజు ఎపిసోడ్ లో పెళ్లి షాపింగ్ కి రమ్మని హరీష్ పిలుస్తాడు. ఆ మాటలు విన్న సుగుణ షాక్ అవుతూ సరే బాబు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. 


దివ్య: విన్నారు కదా, షాపింగ్ అంట.. కట్నం 50 లక్షలు సంగతి పక్కనపెట్టు.. ఇప్పుడు షాపింగ్ చేయటం ఎలాగో ఆలోచించండి.


జ్యోతి: అక్కడికి వెళ్ళాక ఎలాగో పరువు పోవడం తప్పదు, అదేదో ఇక్కడే చెప్పేయండి షాపింగ్ కి రావటం కుదరదని. 


దివ్య: నేను చెప్పలేనమ్మ నువ్వే చెప్పు.


సుగుణ: ఏం చేద్దాం నాన్న అని ఆర్యని అడుగుతుంది.


ఆర్య: అందరం షాపింగ్ కి వెళ్తున్నాము బయలుదేరండి.


ఆ తర్వాత ఆర్య జెండే దగ్గరికి వెళ్తాడు. ఆఫీస్ ఫైల్స్ మీద సంతకం పెడుతూ 50 లక్షల చెక్కు మీద సంతకం పెట్టబోతూ ఈ చెక్ ఎవరికి అని అడుగుతాడు.


జెండే: నీకే ఆర్య, పెళ్ళికి 50 లక్షలు కావాలి కదా.


ఆర్య: నేను అడగలేదే. 


జెండే: అడగకపోయినా నీకు అవసరం కదా.


ఆర్య: 50 లక్షలు తీసుకోవటానికి నేనిప్పుడు ఆర్యని కాదు సూర్యని, ఆ డబ్బులు ఖర్చు పెట్టేటట్లయితే నేను సూర్యలాగా ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. సూర్యలాగే కష్టపడి సంపాదిస్తాను.


జెండే: కానీ ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. కానీ జరుగుతున్నదంతా చూస్తుంటే ఎవరో కావాలని నిన్ను టార్గెట్ చేసి ఈ పెళ్లిని కాంప్లికేట్ చేయాలని చూస్తున్నట్లున్నారు అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు.


ఆర్య: ఇది నేను ఛాలెంజ్ లాగా తీసుకున్నాను ఈ చాలెంజ్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. చూద్దాం ఏదైనా మిరాకిల్ జరుగుతుందేమో.


ఆ తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటాడు ఆర్య.


యాదగిరి: దివ్య మాటలు పట్టించుకోకండి అది అంతే పిచ్చిది పెద్దా, చిన్న తేడా తెలియదు అంటాడు. అయినా అసలు మీరు ఎందుకు మా బావమరిది ప్లేస్ లో ఇక్కడికి వచ్చారు.. మీకు ఇదంతా అవసరమా,


యాదగిరి వైపు కోపంగా చూస్తాడు ఆర్య.


యాదగిరి: మీ అంతటి మనిషిని ఏమీ కాకుండా మాట్లాడుతుంటే నాలాంటి వాడికి బాధగా అనిపిస్తుంది అంటాడు.


ఆర్య: అదేమి లేదులే, ఇప్పుడు ఇంతకుమించి నన్నేమీ వివరాలు అడగకు అంటూ మంచినీళ్లు తాగటానికి కిచెన్ వైపు వెళ్లబోతాడు.


అయితే అను అప్పుడే కిచెన్లోకి వెళ్ళటం చూసిన యాదగిరి కంగారు పడిపోతాడు.


యాదగిరి: మీరు ఎందుకు సార్? మీరు ఇక్కడే కూర్చోండి నేను మంచినీళ్లు తీసుకువస్తాను అంటాడు.


ఆర్య : నువ్వు మరీ ఇంత ఓబీడియెంట్ గా నడుచుకుంటే ఇంట్లో వాళ్లకి అనుమానం వస్తుందంటూ కిచెన్ వైపు అడుగులు వేస్తాడు.


ఏం చేయాలో అర్థం కాక మంచినీళ్ళకి కిచెన్ వరకు వెళ్లడం ఎందుకు ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి అని గట్టిగా అరుస్తూ అనుని ఎలర్ట్ చేస్తాడు.


అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న ఆర్యని చూసి కిచెన్లో ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతాడు. కానీ అను మొహానికి గుడ్డ కట్టుకొని కుర్చీ ఎక్కి బూజులు దులుపుతూ ఉంటుంది. మంచినీళ్లు తాగి ఆర్య వెనక్కి వచ్చేయ్యబోతుంటే అను కాలుజారి కింద పడిపోబోతుంది ఆమెని పట్టుకొని సేవ్ చేస్తాడు. అను కంగారు పడిపోతుంది.


యాదగిరి: మిగిలిన బూజులు నేను దులుపుతాను. నువ్వు వెళ్ళు అని చెప్పి అనుని అక్కడి నుంచి పంపించేస్తాడు.


ఆర్య: ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుగా ఉంది అంటాడు. కానీ యాదగిరి టాపిక్ మార్చేస్తాడు.


తర్వాత హరీష్ దివ్యకి ఫోన్ చేసి మేము షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసాము మీరు బయలుదేరారా అని అడుగుతాడు.


దివ్య: మీరు ఇప్పటికిప్పుడు ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే డబ్బులు చూసుకోవాలి కదా మేము బయలుదేరుతున్నాము, మీరు ఈ లోపు షాపింగ్ చేస్తూ ఉండండి అంటుంది.


హరీష్ తల్లి బంధువులతో మీకు ఎన్ని బట్టలు కావాలంటే అన్ని, ఎంత ఖరీదు కావాలంటే అంత ఖరీదు కొనుక్కోండి అని చెప్తుంది.


మరోవైపు రెండు ఆటోలలో బయలుదేరుతారు సుగుణ వాళ్ళు.


సుగుణ: అయ్యో రాధని పిలవటం మర్చిపోయాను వెళ్లి తీసుకొని రా అని ఉషకి చెప్తుంది.


యాదగిరి కంగారు పడిపోతూ ఇప్పుడు ఆవిడ ఎందుకు అంటాడు. ఆవిడ కూడా మన ఇంటి ఆడపిల్ల అంటుంది సుగుణ. అను వద్దంటున్నా ఉష వినకుండా లాక్కువచ్చి ఆటోలో కూర్చోబెడుతుంది.


తర్వాత వచ్చిన ఆర్య అదే ఆటో ఎక్కబోతే యాదగిరి కంగారు పడిపోతూ అక్కడ ఎందుకు వెనకాల ఆటోలో కూర్చుందాం అని పిలుస్తాడు. ఏ ఆటోలో అయితే ఏమి అని అను ఉన్న ఆటోలోనే కూర్చుంటాడు ఆర్య.


షాపింగ్ కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న జనాలని చూసి సుగుణ కంగారు పడుతుంది.


సుగుణ: ఏంటి నాన్న ఎంతమంది వచ్చారు వీళ్ళందరికీ బట్టలు అంటే చాలా ఖర్చవుతుంది.. షాపింగ్ వద్దని చెప్పేద్దాం అంటుంది.


ఆర్య తనకి నచ్చ చెప్పి పంపిస్తాడు. యాదగిరి కూడా ఇదంతా మనవల్ల కాదు అంటే.. వెళ్లి వాళ్ళకేం కావాలో చూడు మిగతా సంగతి నేను చూస్తాను అంటాడు ఆర్య.


Also Read: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అంజు దెబ్బకి షాకైన ప్రిన్సిపల్, ఒంటరిగా ఉన్న అరుంధతి ఘోర చేతికి చిక్కుతుందా?