Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో పొద్దున్నే నిద్ర లేచిన యాదగిరి పనిచేస్తున్న జ్యోతి దగ్గరికి వచ్చి టీ ఇవ్వాలని తెలీదా అంటూ హడావిడి చేస్తాడు.


జ్యోతి: ఇప్పుడే టీ పెట్టి తీసుకు వస్తాను.


యాదగిరి: వేడి నీళ్లు తోడేవా? తోడలేదు కదా పెద్దల్లుడు అంటే బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది అంటూ కేకలు వేస్తాడు.


సుగుణ: కంగారుగా యాదగిరి దగ్గరికి వచ్చి పనిలో పడి మీకు టీ పెట్టడం మర్చిపోయింది నేను మీకు టి పెట్టి ఇస్తాను అని యాదగిరికి చెప్పి వేడి నీళ్లు తోడమని జ్యోతికి చెప్తుంది.


అదీ లెక్క ఆ మాత్రం భయం ఉండాలి అనుకుంటూ గుమ్మం దగ్గరకి వచ్చేసరికి ఆర్య పాల ప్యాకెట్లు తీసుకొని వస్తూ కనిపిస్తాడు. కంగారు పడతాడు యాదగిరి.


యాదగిరి: అయ్యో బావ, నువ్వు ఎందుకు పాలు ప్యాకెట్లకి వెళ్లావు నాకు చెప్పొచ్చు కదా నేను తెచ్చేవాడిని కదా అంటాడు.


జ్యోతి: అప్పుడే అక్కడికి వచ్చి వేడి నీళ్లు తోడేసాను అని చెప్తుంది.


యాదగిరి: ఆర్యవైపు చూస్తూ కంగారుపడుతూ నేనేదో సరదాగా అన్నాను.. నువ్వు వేడి నీళ్లు తోడేసావా, వేడినీళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు నేను చల్లనీళ్లు స్నానం చేస్తాను అని ఓవరాక్షన్ చేస్తాడు.


ఆ తర్వాత వంట చేస్తున్న సుగుణతో ఎప్పుడూ నీ కొడుక్కి ఇష్టమైన వంటలేనా అంతలా ఏం మాయ చేసాడు అంటుంది దివ్య.


జ్యోతి: ఆ సంగతి పక్కన పెట్టు మా ఆయన అన్నయ్యని చూడగానే పిల్లిలాగా అయిపోతున్నాడు అంటుంది.


ఉష : అదే అక్క నాకు అర్థం కావట్లేదు పోనీ వాళ్లకి ముందు పరిచయం ఉందా అంటే లేదు అంటున్నారు. ఇన్నాళ్ళు మన వెనుక ఎవరూ లేరని అతి చేశాడు బావ, ఇప్పుడు అన్నయ్యని చూసేసరికి వేషాలు వేస్తే నాలుగు తగులుతాయి అని భయపడి ఉంటాడు అని నవ్వుతుంది.


జ్యోతి: పోనీలే ఏదైతేనేమి మా ఆయనలో మార్పు వచ్చింది అదే చాలు.


సుగుణ : సూర్య ముఖంలో ఉన్న కళ అలాంటిది. వాడిని చూస్తే ఎవరైనా గౌరవిస్తారు అంటుంది.


ఆ తర్వాత పిల్లలతో పాటు ఉష బయట ఆడుతూ ఉంటుంది.


యాదగిరి: అప్పుడే అక్కడికి వచ్చి పొద్దునుంచి హడావుడిలో అడగడం మర్చిపోయాను ఈ పిల్లలు ఎవరు అని అడుగుతాడు.


ఉష : రాధ గారని మనకి బాగా కావలసినవారు, అక్క పెళ్లి అయ్యేంత వరకు మనతోనే ఉంటారు అని చెప్తుంది.


యాదగిరి: అవునా అంటూ ఆ పిల్లలతో తను కూడా ఆడటం ప్రారంభిస్తాడు. ఆటలో భాగంగా బాల్ అను రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నేను తీసుకు వస్తాను అంటూ వెళ్తాడు యాదగిరి. అక్కడ అనుని చూసి షాకవుతాడు.


యాదగిరి : అను మేడం మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అంతలోనే నా పిచ్చి గానీ ఆర్య సార్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇంకెక్కడ ఉంటారు అంటాడు.


ఉష : ఈవిడే బావగారు రాధ గారంటే అంటుంది.


యాదగిరి: కన్ఫ్యూజ్ అవుతూ ఈవిడ రాధగారేంటి, ఈవిడ అను మేడం అంటాడు.


కన్ఫ్యూజ్ అవుతుంది ఉష.


అను: కంగారుపడుతూ నేను అనుని కాదు అను మేడం దగ్గర బోటిక్ లో పని చేసేదాన్ని అని ఏవేవో అబద్దాలు చెప్తుంది.


ఆ మాటలకి పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతాడు యాదగిరి. అవునా అంటూ బాల్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఉష.


యాదగిరి: పూర్తిగా కన్ఫ్యూషన్ లో పడిపోయి ఏం జరిగింది అని అనుని అడుగుతాడు.


అను ఎంతకీ మాట్లాడకపోవడంతో నేను ముందు లెక్క కాదు మంచి చెడు చూసుకొని మాట్లాడుతున్నాను, నీ అన్న లాంటివాడిని అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు.


అను: జరిగిందంతా చెప్పి ఎవరికీ చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది.


యాదగిరి: ఎవరికి చెప్పనమ్మా, ఈరోజు బాధపడినా రేపు మీరందరూ కలుస్తారు, మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచే జరుగుతుంది అని ఎమోషనల్ అవుతాడు.


ఆ తర్వాత సుగుణ ఇంటికి హరిష్ తన తల్లిదండ్రులతో వస్తాడు. కట్నం కావాలని డిమాండ్ చేస్తాడు.


సుగుణ: కట్నాలు ఏమి అక్కర్లేదు పెళ్లి గ్రాండ్గా చేయమన్నారు.. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి అంటుంది.


సూర్య: డౌరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.


హరీష్: 50 లక్షలు.


ఆ మాటకి ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాకైపోతారు.


దివ్య: మా ఇంటి పరిస్థితి తెలుసు కదా అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము.


హరీష్: అందుకే డబ్బు పరంగా కాదు మీకు ల్యాండ్ ఉంది కదా అది ఇస్తే చాలు.


సుగుణ: అది నా పిల్లల భవిష్యత్తు కోసం దాచినది, నా పిల్లలకు ఇవ్వటానికి అది తప్పితే వేరే ఏమీ లేదు అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.