Prema Entha Madhuram  Serial Today Episode: మా ఇద్దరికి పెళ్లి సెట్టు అవదని శంకర్‌ చెప్పగానే వాళ్ల బాబాయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చిన్నొడు, పెద్దొడు నీ నిర్ణయం కరెక్టు కాదు అన్నయ్యా అంటారు. వాళ్లు పిల్లలు బాబాయ్‌ వాళ్లను వదిలేయండి. మీరు చెప్పండి నా నిర్ణయం కరెక్టేనా అని అడుగుతాడు. దీంతో యాదగిరి మీ నిర్ణయం చాలా పెద్ద తప్పు సార్‌ అంటాడు యాదగిరి. దీంతో ఆలోచనలో పడిపోతాడు శంకర్‌. మరోవైపు ఫస్ట్‌ రోజు జాబ్‌ కు వెళ్తాడు రవి. ఇంట్లోనే ఉన్న రాకేష్‌, రవికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తాడు. రవి మాత్రం మీకు నేనెప్పుడు రుణపడి ఉంటానని అంటాడు. నాకు కావాల్సింది అదేరా అని మనసులో అనుకుంటాడు.


రాకేష్‌: అబ్బో చాలా పెద్ద మాట. మనుషులు అనుకున్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. రేపు నాకు ఏదైనా అవసరం అయితే నువ్వు నాకు హెల్ఫ్‌ చేయవా? ఏంటి?


రవి: ప్రాణాలైనా ఇస్తాను సార్‌.


రాకేష్‌: నీ ప్రాణాలు నాకెందుకురా..? నీ ప్రాణాలు తీసేసే  పని చేయిస్తాను.


 జెండే, అకి వస్తారు.


రవి: గుడ్‌ మార్నింగ్‌ జెండే సార్‌. హాయ్‌ సార్‌


అభయ్‌: సార్‌ ఎందుకు రవి. అభయ్‌ అనే పిలువు.. మనమంతా ఫ్యామిలీ కదా?


రవి: థ్యాంక్యూ సార్‌ అది  మీ గొప్పతనం. కానీ నా లిమిట్స్‌ లో నేనుంటాను.


అభయ్‌: అలా అంటావేంటి? నాతో ఫ్రెండుగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయాడు.


జెండే: అందరూ రాకేష్‌ అంత క్యాలికిలేటెడ్‌గా ఐ మీన్‌ అడ్వాన్స్‌ డుగా ఉండరులే అభయ్‌. రవి అలా కాదు కొంచెం టైం తీసుకుంటాడు.


   అని చెప్పగానే అభయ్‌ సరే మాకు టైం అవుతుంది వెళ్తాము అని వెళ్లిపోతారు. జెండే రవికి ముందు వెళ్లి అకిని కలువు అంటాడు. సరే అని వెళ్తాడు. అకి పైన రూంలో డాన్స్‌ చేస్తూ ఉంటుంది. ఇంతలో రవి లోపలికి వెళ్తాడు. డాన్స్‌ చేస్తూ అకి కిందపడిపోతుంటే రవి పట్టుకుంటాడు. మరోవైపు పాండు, గౌరి వాళ్ల బాబాయ్‌ ఆలోచిస్తూ ఉంటారు. గౌరి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో శంకర్‌ తో పెళ్లి విషయం మాట్లాడాము అని పాండు చెప్తాడు.



గౌరి: మరి ఆయన ఏమన్నారు.


బాబాయ్‌: ఏమంటాడమ్మా తనకు ఆ ఉద్యేశం లేదు అన్నాడు.


శ్రావణి: బాబాయ్‌ ఆ ఒక్కమాటకైతే నువ్వు ఇంత బాధపడవే.


పాండు: కరెక్టుగా క్యాచ్ చేశావమ్మా.. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ నువ్వసలు తనకు తగవు అన్నట్లుగా మాట్లాడాడు.


సంధ్య: శంకర్‌ గారు అలా అనే రకం కాదే.. వాళ్ల తమ్ముళ్లతో కూడా అక్క గురించి మంచి చెప్తాడు.


పాండు: అవన్నీ డ్రామాలమ్మా.. వాళ్ల తమ్ముళ్లు కూడా ఒప్పుకోమని బతిమాలాడు.


బాబాయ్‌: ఆ ఓనరు గారు ఇప్పుడు అవన్నీ ఎందుకండి. తనకు ఇష్టం లేదని చెప్పాడు కదా వదిలేయండి.


గౌరి: బాబాయ్‌ మీర ఆగండి. ఓనరు గారు అతను ఏమన్నాడో చెప్పండి.


పాండు: నీకు ఆవేశం కోపం ఎక్కువట అమ్మా ప్రతిదానికి అనుమానిస్తావట. రూపాయి రూపాయి గీచి ఖర్చు చేస్తావట. పైగా నిన్ను పిసినారి అని కూడా అన్నాడు.   


 అని పాండు చెప్పగానే గౌరి కోపంగా బాధగా ఇన్ని రోజులు ఇలా అంటున్నాడు అంటే నన్ను ఏడిపించడానికి అనుకున్నాను. అయినా నన్ను అనడానికి అతనెవరు? అంటుంది. మరోవైపు పైన శంకర్‌ ను యాదగిరి నిలదీయడంతో శంకర్‌, గౌరిని చాలా గొప్పదని చెప్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబాయ్‌ గౌరి గారి లాంటి అమ్మాయి భార్యగా రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. రాసిపెట్టి ఉండాలి అంటాడు. ఇంతలో కిందనుంచి గౌరి, శంకర్‌ ను కిందకు రమ్మని పిలుస్తుంది. శంకర్‌ రాగానే మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నిస్తుంది. శంకర్‌ ను తిడుతుంది. తాను కఠినంగా ఉండటం పిసినారిగా ఉండటం ఎందుకనేది చెప్తుంది. అసలు ఎందులోనూ మీరు నాకు ఈక్వెల్‌ కాదు అంటుంది. నువ్వు నన్ను రిజెక్ట్‌ చేయడం కాదు. నేనే నిన్ను రిజెక్ట్‌ చేస్తున్నాను అంటుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!