Prema Entha Madhuram Serial Today Episode: రాకేష్, పాండుకు ఫోన్ చేసి ఏ అడ్డంకి లేకుండా పెళ్లి జరిగిపోవాలని వార్నింగ్ ఇస్తాడు. అలాగేనని ఫోన్ కట్ చేస్తాడు పాండు. మరోవైపు అకి, రవి శంకర్ ఇంటికి వస్తుంటారు. ఇంకోవైపు పాండు వెళ్లి శంకర్ వాళ్లను ఇంకా లేట్ ఏంటని అడుగుతాడు. యాదగిరి వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆగకుండా సామాన్లు వేసుకుని వెళ్లిపోతాడు శంకర్. పాండు ఇంటి గేటుకు టూలెట్ బోర్డు పెడతాడు. యాదగిరి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అకి వచ్చి నాన్నా ఎక్కడ అని అడగ్గానే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారమ్మా అని చెప్తాడు యాదగిరి. మేడం కూడా పెళ్లి మంటపానికి వెళ్లిపోయారు అని చెప్తాడు. అంటే ఇక అమ్మా నాన్నా కలవరా? అంటూ ఏడుస్తూ కూలబడిపోతుంది అకి. మరోవైపు అందరూ పెళ్లి మంటపానికి వెళ్లిపోతారు.
పాండు: రండమ్మా రండి.. ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మా గౌరి నువ్వు పెళ్లి కూతురు గదిలోకి వెళ్లు. అమ్మా అక్కను తీసుకెళ్లండి. రేయ్ పెళ్లి కొడకా.. నువ్వు నీ గదిలోకి వెళ్లు ముహూర్తం టైంకు బయటకు రా..
వినయ్: థాంక్స్ అంకుల్ ఈ గ్యాప్‌లో ఒక దమ్ము కొట్టేసి వస్తా..
పాండు: నీ బొందరా.. నీ బొంద గుడిలో ఎవరైనా చూస్తే నీ దుమ్ము దులుపుతారు. దాంతో నీ పెళ్లి ఆగిపోతుంది. సత్యం ఎవరో సరైన టైంకి తుమ్మాడు. ఏమైనా కానీ అబ్బాయి నీ టైం చాలా బాగుంది. మీ అమ్మా నాన్నలుగా ఎవరిని సెట్ చేయాలని నేను టెన్షన్ పడుతుంటే వాళ్లలో వాళ్లే గొడవ పడి నీ పెళ్లిని ముందుకు జరిపారు.
వినయ్: మీరు చాలా తెలివైన వారండి.
పాండు: నా తెలివి ఇప్పుడేం చూశావురా? ముందు ముందు ఇంకా చూస్తావు.
నువ్వు లోపలికి వెళ్లు నేను హడావిడి చేసి పెళ్లి మరింత ముందే జరిపిస్తాను. ఇదిగో పంతులుగారు. రావాల్సిన సామాగ్రి అంతా వచ్చేసినట్టే కదా?
పంతులు: అన్ని ఉన్నాయి లేండి? ఇంతకీ మీరెవరు?
పాండు: నిన్ను ఈ పెళ్లి చూపులకు తీసుకెళ్లింది. ముహూర్తం పెట్టించింది. మంచి సంబావన ఇప్పించాను.
పంతులు: క్షమించాలి మిమ్మల్ని ఈ గెటప్ లో చూసి గుర్తు పట్టలేదు.
పాండు: అంత బాగుందా? ఈ గెటప్పు..
పంతులు: పంచెలో చించారు.
అని పంతులు చెప్పగానే పాండు గాలిలో తేలిపోతాడు. ఇంతలో రాకేష్ ఫోన్ చేస్తాడు. పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని అడుగుతాడు. అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. ఇంకొద్ది సేపట్లో పెళ్లి జరిగిపోతుంది అని పాండు చెప్తాడు. మరోవైపు శంకర్ సామాన్లు వేసుకుని వెళ్లిపోతుంటాడు. ఎదురుగా జెండే వస్తాడు.
శంకర్: జెండే సార్ మీరేంటి నా దారికి అడ్డొచ్చారు.
జెండే: నిన్ను కరెక్టు దారిలో నడిపించడానికే నేను అడ్డొచ్చాను శంకర్. ఏంటి శంకర్ నువ్వు చేస్తున్న పని. నమ్మిన వాళ్లకోసం ప్రాణాలైన అడ్డేసి నిలబడతావు అనుకున్నాను. ఇలా అర్దాంతరంగా వెళ్లిపోతావు అనుకోలేదు.
శంకర్: మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్.
జెండే: గౌరి పెళ్లి గురించి గౌరి ఒక మోసగాణ్ణి పెళ్లి చేసుకోబోతుంది అని తెలిసి కూడా తన జీవితాన్ని కాపాడకుండా నీదారి నువ్వు చూసుకుంటావా? ఇదేనా నువ్వు స్నేహానికి ఇచ్చే విలువ.
శంకర్: మీరు పొరబడుతున్నారు సార్. మా స్నేహానికి నేను విలవు గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. కానీ ఆవిడే అది నిలబెట్టుకోలేదు.
అనగానే జెండే స్నేహం అంటే ఏంటో తెలుసా? అంటూ శంకర్ ను కన్వీన్స్ చేస్తాడు. నువ్వు తప్పా ఈ ప్రపంచంలో గౌరిని ఎవ్వరూ కాపాడలేరు అని జెండే చెప్పగానే ఈ టైంలో ఎలా సార్ అంటాడు శంకర్. దీంతో ఆలోచించు శంకర్ నువ్వు అనుకుంటే తప్పకుండా చేయగలవు అంటాడు జెండే. మరోవైపు పెళ్లి జరగుతున్న గుడి దగ్గరకు అకి వస్తుంది. ఈ పెళ్లి ఆపాలంటే తను ఎవరో తనకు తెలియాలి. నిజం చెప్పేస్తాను అంటుంది. అమ్మను నిజం చేస్తేస్తాను అంటూ లోపలికి వెళ్తుంటే ఇంతలో శంకర్ ఫోన్ చేస్తాడు. ఆ పెళ్లి జరగదు అంటూ యాదగిరి తన ప్లాన్ చెప్తాడు శంకర్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్: కేదార్ మాల విరమించేందుకు నిషిక ప్లాన్ – నిషిక ప్లాన్ ను ప్లాప్ చేసిన ధాత్రి