Prema Entha Madhuram  Serial Today Episode: అకి, అభయ్ మాట్లాడుకుంటుంటే ఆ ఊరి సర్పంచ్‌  నీలకంఠం వస్తాడు. మిమ్మల్ని చూస్తుంటే మీ అమ్మానాన్నలను చూసినట్టే ఉందని చెప్తాడు. ఇంతలో జెండే రావడంతో నీలకంఠం కంగారుపడతాడు. నువ్వు అప్పటిలాగే ఉన్నావా? లేక మారిపోయావా అని అడుగుతాడు. నేను ఇప్పుడు నీతికి నిజాయితీకి  మారుపేరండి అంటాడు నీలకంఠం. తర్వాత ఎం పనిమీద వచ్చారని ఆస్తులేమైనా అమ్మేస్తున్నారా? అని అడుగుతాడు. అమ్మితే నువ్వు కొంటావా? అని జెండే అడగ్గానే లేదని చెప్పి వెళ్లిపోతూ ఔట్‌హౌస్‌ లో దిగిన వాళ్లను పలకరిస్తాను అంటాడు. వద్దని మీరు అక్కడికి వెళ్తే షాక్‌ తగులుతుందని చెప్తాడు జెండే. సరేనని వెళ్లిపోతాడు నీలకంఠం.


అభయ్‌: ఎవరు ఫ్రెండ్‌ చాలా డిఫరెంట్‌ గా కనిపిస్తున్నారు.


జెండే: ఊళ్లో జనాల సొమ్ము తింటూ ఉంటే మీ నాన్నగారు బుద్ది చెప్పారు. అందుకే మనం అంటే భయం. ఏదో పలకరింపుగా వచ్చాడులే..


అభయ్‌: పద రాకేష్‌..


రాకేష్‌: ఆ నీలకంఠం డబ్బు కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు. మేబీ నాకు యూస్‌ అవుతాడేమో.. ( అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతాడు)


అకి: ఫ్రెండ్‌ అతను అక్కడికి వెళితే అమ్మానాన్నలను చూస్తాడేమో ఇపుడెలా..?


జెండే: చూసిన ఏమీ చేయలేడు. మహా అయితే షాక్‌తో భయంతో చస్తాడు. లేదంటే నాకు వచ్చి చెప్తాడు. వాడు ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు ఇక్కడ. అయినా జోగమ్మ ఆజ్ఞతో వచ్చాం ఇక్కడికి ఏం జరిగినా మంచే జరుగుతుంది.


    అని జెండే చెప్పగానే అకి సరే అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు గౌరి స్నానం చేసి బయటకు వచ్చి ఇంటి ముందు ఉన్న చెట్టుకు సీతాఫలం చూసి కోసుకోవడానికి వెళ్తుంది. అది అందకపోవడంతో శంకర్‌ వచ్చి గౌరిని ఎత్తుకుంటాడు. దీంతో ఒకర్ని ఒకరు కళ్లలోకి చూసుకుంటుంటారు.


సంధ్య: అక్కా ఇక్కడేం చేస్తున్నావు..


గౌరి: ఆహా ఏం లేదు. ఊరికే అలా చెట్టు చూస్తున్నాను.


పెద్దొడు: నువ్వెందుకు వచ్చావు అన్నయ్యా..


శంకర్‌: ఈ చెట్టు ఆ పుట్టా ఈ ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చాను. ఆహా ఎంత బాగుంది.


పెద్దొడు: ఏం లేదు అన్నయ్యా శ్రీను గాడు ఫోన్‌ చేశాడు. పెళ్లి ఇంటికి రమ్మంటున్నాడు వెళ్దామా..?


చిన్నొడు: ఏంటన్నయ్యా.. ఎందుకు కంగారుగా ఉన్నావు.  


శ్రావణి: నీ ఫేసేంటి అక్కా అంత ఎర్రగా కందిపోయింది.


గౌరి: అదేం లేదే వాటర్‌ చేంజ్‌ అయింది కదా అలా అనిపిస్తుంది అంతే..


సంధ్య: అక్కా మనం కూడా పెళ్లింటికి వెళ్దామా..?


గౌరి: ఆ వెళ్దాం అందుకే కదా వచ్చాము.


 అనగానే అందరూ కలిసి వెళ్లిపోతారు. మరోవైపు రాకేష్‌ సిద్దాంతికి ఫోన్‌ చేస్తాడు. శంకర్‌ ను చంపడానికి ప్రయత్నిస్తే ఆ గౌరి కాపాడింది. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టలేదు అంటాడు. దీంతో వాళ్లిద్దర్ని ఏదో శక్తి కాపాడుతుంది అని సిద్దాంతి చెప్తాడు. దీంతో మీరు ఇక్కడికి రావాలని రాకేష్‌ చెప్పగానే సిద్దాంతి సరేనంటాడు. నేనే వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్తాడు. మరోవైపు శంకర్‌, గౌరిలు కలిసి బైక్‌ మీద పెళ్లింటికి వెళ్తుంటే నీలకంఠం చూసి షాక్‌ అవుతాడు.


నీలకంఠం: ఆ బండి మీద వెళ్తున్నవారు ఆర్యవర్థన్‌, అనురాధల్లా ఉన్నారా..?


కోటి: ఊరుకోండి  వీల్లు అనురాధ ఆర్యవర్థన్‌ ఏటి? మీ కళ్లకేదో రోగం వచ్చినట్టు ఉంది.


నీలకంఠం: లేదేహెయ్‌ వాళ్లు సేమ్‌ టు సేమ్‌ అనురాధ ఆర్యవర్థన్‌ లాగే ఉన్నారు.


కోటి: ఇంతసేపు మీరు లోన వాళ్ల గురించే మాట్లాడు కదా? అందుకే అలా అనిపిస్తుంది.


నీలకంఠం: అంతే నంటావా? సరే వెళ్ధాం పద


 అని ఇద్దరూ నడుచుకుంటూ ఔట్‌హౌస్‌ కు వెళ్తారు. అక్కడ ఎవ్వరూ లేరని తెలిసి రిటర్న్‌ వెళ్లిపోతారు. అకి రవికి ఫోన్‌ చేసి తనను కూడా రమ్మని చెప్తుంది. సరేనని ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఇంతలో జెండే వచ్చి నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉన్నావు రవిని రమ్మను చెప్పు అని నేనే కాల్ చేస్తాను అంటూ జెండే కాల్ చేస్తాడు. ఇప్పుడే అకి చెప్పిందని నేను అక్కడికే బయలుదేరుతున్నాని చెప్తాడు రవి. అకి సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!