Prema Entha Madhuram Serial Today Episode: శంకర్ కు చెప్పకుండా తన చెల్లెల్లను తీసుకుని షాపింగ్ వెళ్తుంది గౌరి. ఇంతలో శంకర్ నిన్ను వీడని నీడను నేనే అంటూ పాట పాడుకుంటూ వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దీంతో గౌరి ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే అడగకూడదని తెలియదా అంటుంది. దీంతో శంకర్ మీరు క్యాబ్ బుక్ చేస్తే.. వాడు వచ్చి ఎక్కడికి అని అడిగితే ఇలాగే మాట్లాడతారా..? అంటాడు. దీంతో షాపింగ్ కు వెళ్తున్నాము అని చెప్తుంది. ఇంతలో అకి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో శంకర్ బట్టలు కొనడానికి షాపింగ్‌కు వెళ్తున్నారు అని చెప్తుంది. దీంతో అకి రేపు చాలా స్పెషల్ డే మీరు మా ఇంటికి దీపావళికి రావాలని అకి అడుగుతుంది.
గౌరి: ఆయన ఎందుకు కాదంటారు. నేను ఎక్కడ ఏమేం కొంటానో చూడ్డానికైనా వస్తారు.
శంకర్: నేను ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదు. కానీ మీరన్నాక ఇక రాకుండా ఊరుకుంటానా..? పదండి వెళ్దాం
అని అందరూ వెల్లిపోతారు. మరోవైపు రాకేష్ నంబూద్రి దగ్గరకు వెళ్తాడు. పండగకి అభయ్ తన అమ్మా నాన్నలను కలవబోతున్నాడని జోగమ్మ చెప్పిన విషయం చెప్తాడు. నంబూద్రి కూడా అది నిజమే అంటాడు. నువ్వు ఏదో ఒకటి చేసి ఆపాలని లేకపోతే వాళ్లను ఎవ్వరూ ఆపలేరు. అని చెప్పగానే రాకేష్ ఈసారి ఇది నాకు మంచి అవకాశం అని చెప్తాడు. మరోవైపు షాపింగ్ కు వెళ్తారు అందరు.
సేల్స్‌మేన్: హాస్ సార్ హౌ కెన్ హెల్ప్ యూ..
శంకర్: ఓ రెండు లక్షలు అప్పు కావాలి. ఇస్తారా..?
గౌరి: శంకర్ గారు
శంకర్: మరి లేకపోతే ఏంటండి. బట్టల షాపుకు ఎందుకు వస్తాం. బట్టలు కొనుక్కోవడానికి వస్తాం.
సేల్స్‌మెన్: అంటే మీకు ఏ రకమైన బట్టలు కావాలో మేము చెప్తాము.
శంకర్: అంటే ఇప్పుడు మాకు కళ్లు లేవు. మాకు ఏం కావాలో చెప్తే మీరు సెలెక్ట్ చేస్తారు. మేము బిల్లు కట్టి వెళ్లాలి అంతేగా..?
సేల్స్‌మెన్: మీకు అలా అర్థం అయిందా..? సార్
అంటూ శంకర్, గౌరిలను వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు అని సేల్స్ మేన్ చెప్పగానే గౌరి కోపంగా అతన్ని తిడుతుంది. తర్వాత అందరూ కలిసి బట్టలు తీసుకుంటుంటే అదే షాపుకు చిన్నొడు, పెద్దొడు వస్తారు. వాళ్లు షాపింగ్ చేస్తున్నారని తెలిసి పాండు, రాకేష్‌కు ఫోన్ చేసి నువ్విచ్చిన కార్డ్స్ ఇష్టమొచ్చినట్టు వాడుతున్నారని చెప్తాడు. దీంతో కార్డ్స్ బ్లాక్ చేయిస్తానని ఆ మాల్ లోనే మీ పరువు తీస్తాను అని రాకేష్ కార్డ్స్ బ్లాక్ చేయిస్తాడు.
అకి: మీకు ఈ షర్ట్ చాలా బాగుంటుంది శంకర్ గారు.
శంకర్: బాగుందమ్మా.. ( రేటు చూస్తాడు) అబ్బే ఇదేం బాగాలేదమ్మా..
అకి: మీకు అసలు నచ్చలేదా..?
శంకర్: అసలు రేటు చూశావా ఎంత ఉందో ఈ రేటుకు బయట అయితే నాలుగు షర్ట్ వస్తాయి.
అకి: ఇవి బ్రాండెడ్ అండి మీరు రేటు గురించి అసలు ఆలోచించొద్దు నేను మీకు గిఫ్ట్ చేస్తాను.
శంకర్: నువ్వు నాకు కొనివ్వడం ఏంటి అకి.. నేను నీకు కొనాలి కానీ
అకి: మీరు చాలా సార్లు కొనిచ్చారుగా..
శంకర్: నేనా నేను ఎప్పుడు కొనిచ్చాను. అమ్మ..
అకి: అంటే అది ఇక మీదట కొనిస్తారని అడుగుతున్నాను. కొనిస్తారుగా..?
శంకర్: నేనెందుకు కొనివ్వను అమ్మ.. నువ్వు అడుగుతుంటే నాకు ఎలాగుందంటే.. చిన్న పిల్లలు చాక్లెట్ కొనిస్తేనే స్కూల్ వెళ్తాం అన్నట్లు ఉంది.
అని శంకర్ చెప్పగానే అకి ఎమోషనల్ అవుతుంది. గతం గుర్తు చేసుకుని ఏడుస్తుంది. దీంతో శంకర్ అకి ఏమైందని అడుగుతాడు. దీంతో మా నాన్న కూడా ఇలాగే తల మీద చెయ్యి వేసి నిమిరేవాడు. అంటుంది. తర్వాత శంకర్ షర్ట్ ట్రయల్ వేసుకోవడానికి వెళ్తుంటే అక్కడే చిన్నొడు, పెద్దొడు ఉంటారు. శంకర్ ను అవమానిస్తారు. అకి వచ్చి వాళ్లను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!