Prema Entha Madhuram  Serial Today Episode: షాపింగ్‌ మాల్‌ లో అను, మీరా గొడవపడుతారు. ఆస్థి, అధికారం పోయినా నీకింకా బుద్ది రాలేదని మీరా అనడంతో తేరగా వచ్చిన ఆస్థిని అధికారాన్ని చూసుకుని ఎగిరిపడుతున్నావు అంటూ అను మీరాకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు అజయ్‌ని చూసిన కొంతమంది ఎంబీఏ స్టూడెంట్స్‌ దగ్గరకు వెళ్లి మీతో మాట్లాడాలని అడగ్గానే నా అపాయింట్‌మెంట్‌ తీసుకుని వచ్చి కలవండి అని చెప్పగానే ఇంతలో ఆ స్టూడెంట్స్‌ ఆర్యను చూసి అజయ్‌ని పట్టించుకోకుండా ఆర్య దగ్గరకు పరిగెత్తుతారు. ఆర్యతో స్టూడెంట్స్‌ బిజినెస్‌ గురించి మాట్లాడి చైర్మన్‌ పోస్టును ఎందుకు మీ బ్రదర్‌కు ఇచ్చారని అడగ్గానే.. మేనేజ్‌మెంట్‌ నా బ్రదర్స్‌ కూడా తెలుసుకోవాలని ఇచ్చానని చెప్పి ఆర్య వెళ్లిపోతాడు. అజయ్‌ చాలా ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంటాడు. మీరా వస్తుంది.


మీరా: అజయ్‌ మనం వెంటనే ఇక్కణ్నుంచి వెళ్లిపోదాం పద


అజయ్‌: ఏమైంది ఇంకా ఏం తీసుకోలేదు కదా


మీరా: లేదు అజయ్‌ ఆ అను నా మూడ్‌ అంతా స్పాయిల్‌ చేసింది.


అజయ్‌: నాకు కూడా చాలా డిస్టర్బ్‌ గా ఉంది. సరే వెళ్లిపోదాం


మీరా: ఉండు అజయ్‌ ఆనందిని పిలుచుకుని వస్తాను.


అని మీరా ఆనంది కోసం వెళ్లి అను సెలెక్ట్‌ చేసిన శారీ చూసి బాగుంది అనుకుంటుంది. సేల్స్‌ మెన్‌ను పిలిచి ఈ శారీ కావాలని అడుగుతుంది. అతను అనును చూపించి ఆ మేడం తీసుకున్నారని చెప్పగానే  మీరా షాక్‌ అవుతుంది.


మీరా: ఈ శారీ నాకు కావాలి డబుల్‌ కాస్ట్‌ అయినా పర్వాలేదు.


సేల్స్‌ మేన్‌: సారీ మేడం అలా ఇవ్వడం కుదరదు..


 మీరా: మీ మేనేజర్‌ ఎక్కడ?


సేల్స్‌ మేన్‌: ఒక కస్టమర్‌ తీసుకున్న  శారీస్‌ను ఇంకొకరికి ఇస్తే షాపు రెప్యుటేషన్‌ పోతుంది. మనీ ఈజ్‌ నాట్‌ ఏ మాటర్‌. మేనేజర్‌ కూడా ఏం చేయలేడు.


అను: డబ్బు ఉంది కదా అని ప్రతిదీ కొనాలనుకోవడం కుదరదు మీరా? ఎంత పాస్ట్‌ గా వచ్చినవి అంతే పాస్ట్‌ గా పోతాయి.


అజయ్‌: మీరా..  ఒక శారీ కోసం ఎందుకింత ఆర్య్గుమెంట్.. అంతకన్నా కాస్ట్‌ లీవి వంద కొను..


నీరజ్‌: కాస్ట్ లీ చీరలేం కర్మ ఈ షాపు మొత్తం కొనేస్తారు. కష్టపడకుండా తేరగా వచ్చిన ఆస్థి కదా? నేను అన్నది నిజమే కదా నువ్వు ఇప్పుడు వచ్చిన కారులో డీజీల్‌ కూడా నీ డబ్బులతో కొట్టించలేదు.


మీరా: నీరజ్‌ నువ్వు అజయ్‌ని ఇంసల్ట్‌ చేస్తున్నావు.


అనగానే మాన్షి తాను నీరజ్ కు సపోర్టుగా మాట్లాడకపోతే బాగుండని మీరాకు సైగ చేస్తూ.. ఎం మాట్లాడుతున్నావని అను వెళ్దాం పద అంటూ వెళ్లిపోతారు. మీరా కూడా అజయ్‌ని వెళ్లిపోదాం పద అనగానే ఎక్కడి రివేంజ్‌ అక్కడే తీర్చుకోవాలని నీరజ్‌ ఎవరికో ఫోన్‌ చేస్తాడు. ఆర్య వాళ్లు బిల్‌ పే చేస్తుంటే కార్డ్స్‌ అన్నీ బ్లాక్‌ అవుతుంటాయి. దీంతో నీరజ్‌ ఆఫీసుకు ఫోన్‌ చేసి కార్డ్స్‌ అన్నీ బ్లాక్‌ అయ్యాయేంటని అడగడంతో చైర్మన్‌ అజయ్‌ సార్‌ మీ కార్డ్స్‌ బ్లాక్‌ చేయమన్నారని చెప్పడంతో నీరజ్‌ కోపంగా ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన అజయ్‌ కాలర్‌ పట్టుకుంటాడు నీరజ్‌.


ఆర్య: నీరజ్‌ ఎంటిది పబ్లిక్‌ లో వెళ్దాం పద


నీరజ్‌: దాదా వదినమ్మ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న శారీ..


అను: పర్వాలేదు సార్‌ తర్వాత తీసుకుంటాను.


అజయ్‌: వదినమ్మ నువ్వు అడిగినప్పుడే ఆ శారీ ఇచ్చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు.


అనగానే ఆర్య, నీరజ్‌, అను, మాన్షి పిల్లలు బయటకు వెళ్తుంటారు. అప్పుడే అక్కడకు ఆ షాపు ఓనరు సూరి భార్యను కమలను అంటూ ఒకావిడ వచ్చి ఆర్యను పలకరించి  లోపలికి వెళ్లి సూరిని తీసుకొస్తుంది. బయటకు వచ్చిన సూరి ఆర్యను మీరు చేసిన సాయం వల్లే ఇవాళ నేను ఈ పొజిషన్‌లో ఉన్నానని.. మేనేజర్‌ ను పిలిచి సార్‌ ఏం తీసుకున్నా బిల్లు వేయ్యెద్దని.. చెప్పగానే మేనేజర్‌ వాళ్లు షాపింగ్‌ చేశారని కార్డ్స్‌ పనిచేయలేదని వెళ్తున్నారు అని చెప్పడంతో సూరి.. సార్‌ తీసుకున్నవన్నీ ఇచ్చేయమని మేనేజర్‌కు చెప్తాడు. ఇదంతా గమనిస్తున్న అజయ్‌, మీరా షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ముగ్గురు యువకుల కథలతో ‘శ్రీ‌రంగ‌నీతులు’ - ఆకట్టుకుంటున్న సుహాస్ కొత్త సినిమా ట్రైలర్