Prema Entha Madhuram Serial Today Episode: అకి తన గణేష్‌ విగ్రహం సూపర్బ్‌ గా వచ్చిందని వెళ్లి అభయ్‌ని తీసుకువచ్చేలోపే ఆనంది, అకి విగ్రహంపై వాటర్‌ పోస్తుంది. విగ్రహం పాడైపోతుంది. అకి, అభయ్‌ చూస్తారు. అకి ఏడుస్తుంది. ఇంతలో వాళ్ల ఫ్రెండ్‌ దీనిపై ఆనంది వాటర్‌ పోసింది అని చెప్పగానే అభయ్‌ ఆనందిని తిడతాడు. ఇంతలో టీచర్‌ వస్తుంది. అందర్నీ క్లాస్‌ రూంకు వెళ్లమని చెప్తుంది. తర్వాత ఆర్య, అను, నీరజ్‌, మాన్షి, పిల్లలు అందరూ షాపింగ్ కు వస్తారు. షాపులోకి వెళ్లగానే పిల్లలు అల్లరి చేస్తుంటారు.


అను: అకి, అభయ్‌ మిమ్మల్ని పరిగెత్తొద్దని చెప్పానుగా.. ఎందుకీ అల్లరి.


ఆర్య: అను పిల్లల్ని అలా ప్రతి చోటా డిస్టర్బ్‌ చేయకు. ఫ్రీగా వదిలేయ్‌.


నీరజ్‌: వదినమ్మా ఇదేం స్కూల్‌ కాదు కదా డిసిప్లీన్‌ గా ఉండటానికి .


అను: చాలు చాలు వీళ్లకు మీ ఇద్దరి సపోర్టు చాలా ఎక్కువైపోయింది. నా మాట అస్సలు వినటం లేదు. ఇప్పుడు నేను వీళ్లను చూసుకోవాలా? షాపింగ్‌ చేయాలా?


మాన్షి: అను నువ్వు షాపింగ్‌ చేస్తుండు.. పిల్లల్ని నేను చూసుకుంటాను.


అను: మీరు కూడా శారీస్‌ తీసుకోవాలి కదా? సరే ఒక పని చేయండి ఫస్ట్‌ మీరు తీసుకోండి తర్వాత నేను తీసుకుంటాను.


నీరజ్‌: వదినమ్మ హోమం జరిపించాల్సింది మీరు దాదా ఫస్ట్‌ మీరు తీసుకోండి. మా సంగతి మేము చూసుకుంటాములేండి.


అనగానే పిల్లలు కూడా అవునమ్మా నీకోసం మేము మంచి శారీ సెలెక్షన్‌ చేస్తాం రా అంటూ పిలుస్తారు. అందరూ వెళ్లి శారీస్‌ సెలెక్షన్‌ చేస్తుంటారు. అదే షాపింగ్‌ మాల్‌ కు  అజయ్‌, మీరా కూడా షాపింగ్‌ చేయడానికి వస్తారు. షాపులో రాజనందని శారీస్‌ గురించి ఆర్యవర్థన్‌ గురించి కస్టమర్లు మాట్లాడుకోవడం విని అజయ్‌ ఇరిటేటింగ్‌గా ఫీలవుతాడు.  


అజయ్‌: ఆర్యవర్థన్‌ అనే పేరు పబ్లిక్‌ మైండ్‌లోంచి పోవాలి. అజయ్‌వర్థన్‌ మాత్రమే వాళ్లకు గుర్తుండాలి.


మీరా: దానికి టైం పడుతుంది అజయ్‌. ఆర్య కూడా ఒక్కరోజులో ఏం సాధించలేదు. ఈ గుర్తిపు వెనక కొన్ని సంవత్సరాల కష్టం శ్రమ ఉన్నాయి.


అజయ్‌: మంచి వాడు అనిపించుకోవడానికి మంచితనాన్ని ప్రూవ్‌ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మీరా.  నాకు గుర్తింపు రావాలంటే నేను మంచివాణ్ని అనిపించుకుంటే చాలదు. ఆర్యవర్థన్‌ ను చెడ్డవాణ్ని చేయాలి.


మీరా: ఐడియా బాగానే ఉంది. ట్రై చేద్దాం.


అజయ్‌: ట్రై కాదు మీరా చేసి తీరాలి.


అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరోవైపు ఆనంది టాయ్స్‌ సెక్షన్‌లో ఉంటుంది. అక్కడికి అకి, అభయ్‌ కూడా వస్తారు. దీంతో పిల్లల మధ్య గొడవ జరుగుతుంది. మీరా వచ్చి అభయ్‌ ని కొట్టబోతుంటే అను వచ్చి ఆపుతుంది.


అను: వయసు పెరిగితే సరిపోదు. పిల్లల మీదకు చెయ్యి ఎత్తకూడదు అనే కామన్‌ సెన్స్‌ కూడా ఉండాలి.


మీరా: వీళ్లేం చేశారో తెలుసా? నా బేబీ బొమ్మను లాక్కుని తనను ఏడిపిస్తున్నారు.


అకి: గాడ్‌ ప్రామీస్‌ అమ్మా తనే నా బొమ్మన లాక్కుంది.


అభయ్‌: అవునమ్మా తనే మాతో గొడవ పెట్టుకుంది.


మీరా: మళ్లీ అదే మాట అంటున్నారు.


అను: ఆగండి పిల్లల ముందు ఆర్గ్యుమెంట్‌ చేసుకోవడం కరెక్టు కాదు.  


 అంటూ అను పిల్లలను ఆర్య దగ్గరకు వెళ్లండి అనగానే ఇద్దరూ వెళ్లిపోతారు. మీరా కూడా ఆనందిని వెళ్లమని చెబితే ఆనంది వెళ్లనని మారాం చేస్తుంది. దీంతో అను అది నా పెంపకం, ఇది నీ పెంపకం అనగానే మీరా కోపంగా అనందిని వెళ్లమని చెప్తుంది. దీంతో ఆనంది భయంగా వెళ్లిపోతుంది. తర్వాత అను, మీరాకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా