Prema Entha Madhuram  Serial Today Episode: ఆసలు ఇదంతా మనకు అవసరమా? అంటూ ఆర్యను అడగడంతో అమ్మకు ఇచ్చిన మాట తప్పమంటావా? అంటాడు. అయితే నిజం మీకు తెలుసని అత్తమ్మకు చెప్పమంటుంది అను. అమ్మకు ఈ విషయం చెపొద్దని.. నీకు అమ్మ పడుతున్న బాధ మాత్రమే కనిపిస్తుంది. కానీ నాకు అమ్మ అనుభవిస్తున్న మానసిక క్షోభ అర్థం అవుతుందని నాలుగు రోజులు నువ్వు పిల్లలను తీసుకుని  మీ అమ్మా వాళ్ల ఇంటికి వెళ్లిరమ్మని ఆర్య చెప్తాడు.


అను: అంటే ఏంటి సార్‌ మీ ఉద్దేశ్యం మీరిక్కడ అవమానలు భరిస్తూ.. బాధ పడుతూ ఉంటే నేను అక్కడ సంతోషంగా ఉంటాను అనుకుంటున్నారా?


ఆర్య: నా ఉద్దేశ్యం అది కాదు అను ఇక్కడ జరిగేవన్నీ చూసి నువ్వు డిస్టర్బ్‌ అవుతావని


అను: మీరు దూరం అయితే నేను ఇంకా డిస్టర్బ్‌ అవుతాను.


ఆర్య: సరే వద్దులే నువ్వు ఎక్కడికి వెళ్లనక్కర్లేదు.


అనగానే అను చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో పిల్లలు వస్తారు. అందరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటారు.  అను స్కూల్‌ కు టైం అవుతుందని వెళ్దాం పద అని పిల్లలను తీసుకుని కిందకు  వస్తుంది. మరోవైపు అజయ్‌, మీరా, ఆనంది టిఫిన్‌ చేస్తుంటారు.


ఆనంది: మమ్మీ స్కూల్‌ లో అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. టీచర్స్‌ కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.


మీరా: ఓ దట్స్‌ గ్రేట్‌ బేబీ..


అజయ్‌: యువర్‌ ఆనంది వర్థన్‌ బేబీ ఏదైనా స్పెషల్‌ గా ఉండాలి. గుడ్ మార్నింగ్ అమ్మా..


శారదాదేవి: ఇంకా ఎవరూ రాలేదేంటి? మీరా అందరినీ బ్రేక్‌పాస్ట్‌ కు పిలువు..


మీరా: ఆకలి అయినవాళ్లు వస్తారులే అత్తయ్యా..


అంటుండగానే నీరజ్‌, మాన్షి, ఆర్య, అను పిల్లలు వస్తారు. డైనింగ్‌ టేబుల్‌ మీద వేరే ఫుడ్‌ ఉండటంతో అను చెఫ్‌ను పిలుస్తుంది కొత్తవాళ్లు ఉండటంతో మీరెవరు అని అడుగుతుంది. వాళ్లను నేనే అపాయింట్‌ చేశానని మీరా చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. కొత్త వాళ్లను తీసుకున్నారు బాగానే ఉంది కానీ పాత వాళ్లను ఎందుకు తీసేశారు అని శారదాదేవి అడగడంతో అనవసరమైన ఖర్చు ఎందుకని నేనే తీసేశాను అంటాడు అజయ్‌. అకి, అభయ్‌ తాము ఇద్దరం బ్రేక్‌ టైంలో క్యాంటిన్‌లో తింటామని చెప్పడంతో అను, ఆర్య ఎమోషన్‌గా ఫీలవుతారు. ఇప్పుడు తమకు పాలు ఇవ్వు తాగి వెళ్తామని చెప్పడంతో నీరజ్‌ పిల్లలను తీసుకుని వెళ్లబోతుంటే.. ఆర్య ఆపి మీకు బ్రేక్‌ఫాస్ట్‌ నేను రెడీ చేసి తీసుకొస్తాను అని అనును తీసుకుని కిచెన్‌లోకి వెళ్తాడు ఆర్య. పిల్లలకు ఎగ్‌ దోశ, ఆరెంజ్‌ జ్యూస్‌  తీసుకొస్తారు.


ఆర్య: మీ బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ..


అభయ్‌: సూపర్‌ నాన్నా..


అకి: నాన్నా టేస్ట్ అదిరిపోయింది.


మాన్షి: నీరజ్‌ నువ్వైనా బయట తిను లంచ్‌ పంపిస్తాను.


నీరజ్‌: నో థాంక్స్‌.. అకి, అభయ్‌ పదండి వెళ్దాం స్కూల్‌ కి టైం అవుతుంది.


అను: అత్తమ్మ మీరు ఈ టిఫిన్స్‌ తినరు కదా మీరు మీ గదికి వెళండి నేను పోహా తీసుకొస్తాను.


శారదాదేవి: సరేనమ్మా..


అజయ్‌: ది గ్రేట్‌ బిజినెస్‌ మాన్‌ ఇలా కిచెన్‌ లో చెఫ్‌ అవ్వాల్సి వచ్చింది. సో సాడ్‌


ఆర్య: నో అజయ్‌. బిజీ లైఫ్‌లో ఫ్యామిలీతో చిన్నచిన్న ఆనందాలు పంచుకోవడం కుదరదు. ఇవాళ మీ వల్ల అది  నెరవేరింది. ఎనీవే థాంక్యూ సో మచ్‌ అజయ్‌ అండ్‌ మీరా.


ఆనంది: మమ్మీ డాడీ మీరు కూడా నా కోసం ఏదైనా డిష్‌ ప్రిపేర్‌ చేయండి.


మీరా: వాట్‌ నేనా..


మాన్షి: ఆనంది మీ మమ్మీకి ఆఫీసులో అజమాయిషీ చేసినంత ఈజీగా కిచెన్‌లో గరిటె తిప్పడం రాదు. ఏంటో మీ పరిస్థితి దెబ్బలు తినిపించాల్సిన మీరు ఎదురుదెబ్బలు తింటున్నారు జాగ్రత్త.


అనగానే అజయ్‌, మీరా షాక్‌ అవుతారు. తర్వాత శారదాదేవి, అనును పిలిచి సారీ చెప్పి రేపు పూజలో మీరు కూర్చోవాలి అని చెప్తుంది. చాటు నుంచి మాన్షి అంతా వింటుంది. ఈ విషయం వెంటనే మీరాకు చెప్పాలని వెళ్లిపోతుంది. మరోవైపు రూంలో అజయ్‌ మీరా మాట్లాడుకుంటుంటారు. సెక్యూరిటీ చేంజ్‌ చేయడం, చెఫ్‌ను మార్చడం కాదు. ఇంకా ఏదో చేయాలని ప్లాన్‌ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: 'దేవర' గోవా షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ - నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఎప్పుడు? ఎక్కడా..?