Devara Movie Goa Schedule: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'దేవర'. డైరెక్టర్‌ కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. అలాగే బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి విడుదల ప్రచార పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్‌, టీచర్‌ మూవీ మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీలోని ఎన్టీఆర్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా మరో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుందట. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న షూటింగ్‌ పూర్తయ్యినట్టు తెలుస్తోంది.


జాన్వీ పోస్ట్ వైరల్


దీనిపై జాన్వీ పోస్ట్‌ షేర్‌ చేసింది. గోవా షెడ్యూల్‌ ఇప్పుడే పూర్తి చేసుకున్నానని, మళ్లీ సెట్‌లో ఎప్పుడెప్పుడు అడుగుపెడతానా అని ఆసక్తిగా ఉన్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. కాగా ఇటీవల 'దేవర' షెడ్యూల్‌ గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో పలు యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు జాన్వీ, ఎన్టీఆర్ పై రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్రీకరించారు. అంతేకాదు గోవా షూటింగ్‌ జరుతున్న సెట్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ బయటకు రాగా అది బాగా వైరల్‌ అయ్యింది. తాజాగా ఈ షెడ్యూల్‌కు దేవర టీం ప్యాకప్‌ చెప్పినట్టు సమచారం. చూస్తుంటే ఈ మూవీ విషయంలో కొరటాల ఫుల్‌ జోష్‌లో ఉన్నాడనిపిస్తుంది. ఫ్యాన్స్‌లాగే ఆయన కూడా ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడెప్పుడు కంప్లీట్‌ చేసి థియేటర్లోకి తీసుకురావాలా? ఆయన కూడా ఈగర్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన స్పీడు చూస్తుంటే చెప్పిన తేదీ కంటే ముందే మూవీని రిలీజ్‌ చేసేలా కనిపిస్తున్నారంటున్నారు నెటిజన్లు. 


కాగా పాన్‌ ఇండియా వస్తున్న ఈ సినిమా ఎలాంటి వాయిదాలు, ఆటంకాలు లేకుండ త్వరత్వరగా షూటింగ్ జరుపుకోవడంతో ఫాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్టుగానే ఈ మూవీ అక్టోబర్‌ రిలీజ్‌ అయితే థియేటర్లో రచ్చ చేసేందుకు నందమూరి ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. కాగా 'దేవర' రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌ పార్ట్‌ను దసరా కానుకగా అక్టోబర్‌ 10, 2024లో రిలీజ్‌ చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. ఇకపోతే ఇందులో మరో బాలీవుడ్‌ బ్యూటీ కూడా హీరోయిన్‌ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ బ్యూటీ శృతి మరాఠేని ఇందులో ఎన్టీఆర్‌ భార్యగా నటిస్తున్నట్టు ఇటీవల ఆమె స్వయంగా ప్రకటించుకుంది.


దీంతో ఎన్టీఆర్‌ది ఇందులో డ్యూయెల్‌ రోల్‌ కాన్‌ఫాం అయ్యింది. దీనిపై మూవీ టీం నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ లేకపోయిన ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ కొన్ని అప్‌డేట్స్‌ బయటకు వస్తున్నాయి. ఇటీవల శృతి మరాఠేని తాను ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్నట్టు చెప్పగానే ఇది సినీయర్‌ ఎన్టీఆర్‌ సరసన పాత్ర అని అర్థమైపోయింది. కాగా ఇందులో ఎన్టీఆర్‌ తండ్రి, కొడుకులుగా కనిపిస్తారని ముందు నుంచి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా 'దేవర'ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. తమిళ్‌ యంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమా సంగీతం అందిస్తున్నారు.