Prema Entha Madhuram Serial Today Episode: మార్కెట్ నుంచి వస్తున్న అనును మద్యలో అడ్డగిస్తుంది మీరా. నువ్వు మారలేదు. నీ బస్తీ బుద్దులు కూడా మారలేదు అని వెటకారంగా మాట్లాడుతుంది. అందుకే సర్వెంట్ లా సరుకులు కూరగాయలు మోసుకెళ్తున్నావు అంటుంది. దీంతో నా ఇంటి పనులు నేను చేసుకోవడంలో నాకు చాలా తృప్తిగానే ఉంటుంది. నా సంగతి పక్కన పెట్టండి మీరు చాలా మారిపోయారు. మీలోని నిజాయితీ ఏమాత్రం కనిపించడం లేదు. మీరు ఇంతలా దిగజారిపోతారని నేనసలు ఊహించలేదు అని అను అనగానే మీరా కోప్పడుతుంది. ఇంకొన్ని రోజుల్లో మీ కంపెనీని ఆర్యవర్ధన్ ఆస్తులను మా సొంతం చేసుకుని మిమ్మల్ని ఇలాగే రోడ్డుమీద నిలబెడతాము అప్పుడు మీ పరిస్థితి ఎంటో తెలుసా? ఇలాగే ముష్టి ఎత్తుకోవడం అంటూ మీరా చెప్తుంది. మరోవైపు ఆర్య పిల్లలను స్కూల్‌లో డ్రాప్ చేస్తాడు.
ఆర్య: అఖి, అభయ్ స్కూల్‌కు వెళ్లి బాగా చదువుకోవాలి.
అఖి: బుద్దిగా చదువుకోవాలంటే బ్రేక్‌లో బాగా తినాలి.
అభయ్: బాగా తినాలి అంటే క్యాంటీన్‌లోకి వెళ్లాలి.
అఖి: క్యాంటిన్‌కు వెళ్లాలి అంటే ప్యాకెట్ మనీ ఉండాలి.
ఆర్య: అదేమీ అవసరం లేదు. క్యారేజ్ మిగల్చకుండా ఖాలీ చేస్తే చాలు.
అనగానే పిల్లలు డల్‌గా చూస్తుండిపోతారు. ఇంతలో ఆర్య జేబులు చూసుకుని ఆయ్యో వాలెట్ మర్చిపోయాను అంటాడు. ఇంతలో అభయ్ తన జేబులోంచి వందరూపాయలు తీసి ఈరోజు ఇవి చాలులే అంటారు. తర్వాత ఆర్య ఫోన్ మాట్లాడుతుంటే అజయ్ తన కూతురు ఆనందిని తీసుకుని అదే స్కూల్‌లో డ్రాప్ చేసి వెళ్లబోతూ ఆర్యను చూసి నోటీస్ జీరాక్స్ పేపర్స్ ను ఆర్య మీదకు వేస్తాడు.
అజయ్: వావ్ బ్రో ఏది ఎప్పుడు ఎక్కడికి ఎలా చేరుకోవాలో.. అలా చేరుకుంటాయంటారు. అది ఇదేనేమో చూశావా నీకు ఆఫీసియల్ నోటీస్ పంపిచాను. ఇప్పుడు వాటి నకలు కూడా నీ దగ్గరకు వచ్చాయి.
ఆర్య: నీ ఆశలు కూడా ఇలాగే గాలికి కొట్టకుపోతాయి అనిపిస్తుంది.
అజయ్: నాకేమనిపిస్తుంది చెప్పనా? త్వరలోనే నీ ఆస్థి మొత్తం చేజారిపోతుందని.. యూనివర్స్ నీకు గుర్తు చేస్తుందనిపిస్తుంది.
ఆర్య: అనుకోవడానికేముందిలే సవాలక్ష అనుకుంటాం.. జరగాలి కదా నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు జరిగిందా? జరగలేదు. చైర్మన్ అవ్వాలనుకున్నావు జరిగిందా? జరగలేదు. ఇప్పుడు నా ఆస్థి దక్కించుకోవాలనుకుంటున్నావు జరగదు. జరగనివ్వను..
అజయ్: ఓవర్ కాన్ఫిడెంట్..
ఆర్య: ఓవర్ కాన్ఫిడెంట్ నీది నా కష్టాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అన్నది నా నమ్మకం..
అంటూ ఇద్దరు ఒకరికొకరు సవాల్ విసురుకుని వెళ్లిపోతారు. తర్వాత జలంధర్, అజయ్ గుడి దగ్గరకు వస్తారు.
అజయ్: ఎక్కడికి ఎక్కడికి అంటే చెప్పకుండా గుడి దగ్గరకు తీసుకొచ్చావెందుకు జలంధర్.
జలంధర్: నీకు నిజాన్ని పరిచయం చేయాలి. నీ గురించి నీకే తెలియని నిజం. నీ తలరాతనే మార్చేసే నిజం. ఇప్పుడు నీ జీవితాన్ని మార్చబోయేది గొప్ప నిజం.
అజయ్: నిజం నిజం అంటున్నావు ఎంటా నిజం..
జలంధర్: చెప్పేవాళ్లు చెప్తారు పద
అజయ్: జలంధర్ ఎవరో ఎంటో చెప్తారు అన్నావు ఎవ్వరు వాళ్లు..
జలంధర్: అదిగో నీ జీవితాన్ని మార్చబోయే నిజం..
అంటూ దూరంగా హోమం చేస్తున్న శారదాదేవి ఫ్రెండ్‌ను చూపిస్తాడు. హోమం అయిపోయాక వచ్చిన ఆమె అజయ్‌ని చూసి నువ్వు వసుంధరాదేవి కొడుకువి కాదు శారదాదేవి మొదటి కొడుకువి.. శారదాదేవి సూర్యవర్ధన్ రెండవ భార్య. ఆయనకు మొదటి భార్యకు పుట్టిన కొడుకు ఆర్యవర్ధన్, రెండో భార్య అయిన శారదాదేవికి పుట్టిన మొదటి కొడుకువి నువ్వే అని ఆమె నిజం చెప్పడంతో అజయ్ షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Also Read: డీప్ నెక్ డ్రెస్‌లో మంచు లక్ష్మీ.. అదిరే ఫోటోలు షేర్ చేసిన భామ