Prema Entha Madhuram  Serial Today Episode: ఆర్యను కూడా చెరువు దగ్గరకు తమతో రమ్మని అడుగుతుంది భాను. అయితే ఆర్య అనును చూసి రానని చెప్తాడు. దీంతో నాతో రాకపోయినా మీ ఆవిడకు తోడుగా రమ్మని చెప్తుది. దీంతో అను అవసరం మనది కదా వెళ్దామని చెప్పడంతో ఆర్య సరే అంటాడు. దీంతో భాను అలీభాయ్‌ కి ఫోన్‌ చేసి రెండు వెహికిల్స్‌ పంపమని చెప్తుంది. తర్వాత  తన మోపెడ్‌ మీద ఆర్య, అనులను తీసుకువెళ్తుంది భాను. మిగతా వాళ్ల కోసం ఇద్దరు వ్యక్తులు రెండు సైకిల్స్‌ తీసుకొస్తారు. అవి చూసి అజయ్‌ వాళ్లు షాక్‌ అవుతారు.


అజయ్‌: వాట్‌ టూ వీలర్స్‌ అంటే సైకిల్లా..


మీరా: ఇవి ఎప్పటివో అజయ్‌ వెళ్తే ఉంటామంటావా?


నీరజ్‌: తప్పుతుందా? ఇక వెళ్లాల్సిందే..


మాన్షి: వీటిలో వెళితే మనం క్షేమంగా తిరిగి వస్తామా?


అజయ్: వస్తే  గానీ తెలియదు. వాట్‌ ఏ బాడ్‌ డే


అనుకుంటూ అందరూ కలిసి సైకిళ్ల మీద వెళ్తారు. మరోవైపు నీలకంఠం తన కూతురు గురించి ఊర్లో వాళ్లతో గొప్పలు చెప్పుకుంటుంటే ఇంతలో భాను మోపెడ్‌ మీద ఆర్య, అనులను చెరువు దగ్గరకు తీసుకెళ్లడం చూసి ఎవ్వరూ చూడకుండా అడ్డంగా నిలబడతాడు. కానీ భాను నీలకంఠాన్ని పిలవడంతో అందరూ చూసి  షాక్‌ అవుతారు. వెంటనే మీ అమ్మాయికి అమెరికా సంబంధాలు చూడటం ఆపేమని చెప్తారు. దీంతో నీలకంఠం అక్కడి నుంచి వెళ్లిపోతాడు.  తర్వాత భాను బండిని గతులకుల రోడ్డు మీద నడుపుతుంటే అను బండి ఆపుతుంది.


భాను: ఏమైంది అక్కా..?


అను: నీ డ్రైవింగ్‌ స్కిల్స్‌ చాలా పూర్‌.. గతుకుల్లో కూడా ఎలా డ్రైవ్‌ చేయాలో నేను చూపిస్తా దిగు


ఆర్య: అను ఆర్ యూ కాన్ఫిడెంట్‌ డ్రైవ్‌ చేయగలవు కదా?


అను: ఏ మీకేమైనా డౌటా?


ఆర్య: అలా ఏం లేదు నీకు అలవాటు లేదు కదా అని అడిగాను.


అను: అంతేనా లేక డిసప్పాయింట్‌ అవుతున్నారా? నన్ను గట్టిగా పట్టుకుని కూర్చోండి.


  అనగానే భాను అక్కా నీ ప్లాన్స్‌ నీకుంటే నా ప్లాన్స్‌ నాకున్నాయి అని మనసులో  అనుకుంటుంది. అను డ్రైవ్‌ చేస్తుంటే భాను కొంచెం నెమ్మదిగా వెళ్లమని చెప్తుంది. మరోవైపు అజయ్‌, నీరజ్‌లు సైకిల్‌ తొక్కి అలిసిపోయి ఇద్దరూ మాన్షి, మీరాలతో సైకిల్‌ తొక్కిస్తుంటారు. మరోవైపు చెరువు దగ్గర అను బట్టలు ఉతుకుతుంది. ఆర్య, భాను బట్టలు ఆరేస్తుంటారు. బట్టలు అరవేసే దగ్గర కూడా భాను రొమాంటిక్‌గా మాట్లాడుతూ కింద పడబోతుంటే ఆర్య పట్టుకుంటాడు.


ఆర్య: చూసుకోవాలి కదా భాను..


భాను: సామీ మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు తెలుసా? నాకు ఈరోజు నిద్ర రాదు సామి


అను: ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? పనేమైనా చేస్తారా?


ఆర్య: అయిపోయింది అను.. భాను దీన్ని తీసుకెళ్లి ఆరెయ్‌..


అనగానే భాను బట్టలు ఆరేస్తుంది. అను కోపంగా చూస్తూ బట్టలు ఉతుకుతుంది. ఇంతలో నీరజ్‌, మాన్షి, అజయ్‌, మీరాలు సైకిళ్ల మీద వచ్చి బ్యాలెన్స్‌ ఆపుకోలేక కిందపడిపోతారు. ఆర్య, భాను, అను వచ్చి అందరినీ పైకి లేపుతారు. దీంతో అజయ్‌, మీరా అను, ఆర్యను తిడతారు. ఇవన్నీ మాకోసమే ప్లాన్‌ చేసినట్టు ఉంది అని అజయ్‌ అనగానే సైకిళ్లు చాలా కంఫర్టుగా ఉంటాయి కదా అని భాను చెప్పగానే అజయ్‌ భానును తిడతాడు. తర్వాత అందరూ కలిసి చెరువులో బట్టలు ఉతుకుతుంటే.. త్వరగా ఉతకండని లేట్‌ అయితే ఇక్కడ బర్రెలు కడగడానికి వస్తారని భాను చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   


ALSO READ: కాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - INDIAN 2 ఆడియో లాంచ్‌లో చందమామ పాత్రపై క్లారిటీ