Prema Entha Madhuram  Serial Today Episode:   అకి తనను కాపాడినవాళ్లను ఒకసారి కలుస్తానని చెప్పడంతో జెండే వద్దని సెక్యూరిటీ రీజన్స్‌ ఉన్నాయని చెప్పడంతో కనీసం వాళ్లతో ఫోన్‌ లో అయినా మాట్లాడతానని చెప్పడంతో జెండే యాదగిరికి ఫోన్‌ చేసి శంకర్‌, గౌరిలతో మాట్లాడిస్తాడు. అకితో మాట్లాడున్న శంకర్‌ తన్మయత్వంతో ఫీలవుతాడు. ఇంకోసారి బయటకు ఒంటరిగా వెళ్లొద్దని జాగ్రత్తలు చెప్తాడు. తర్వాత గౌరి ఫోన్‌ మాట్లాడుతూ తాను కూడా ఫీలవుతుంది. గౌరి కూడా అకికి ధైర్యం చెప్తుంది.


అకి: ఎందుకో మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. నాకు మంచి చెడు చెప్పడానికి అమ్మా నాన్నా లేరు.


గౌరి: అలా ఎందుకు అనుకుంటారు. మీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్లు మీతోనే ఉన్నారు. అంతకంటే అదృష్టం ఇంకేముంది.


శంకర్‌: ఇలా ఇవ్వండి. చూడమ్మా లేని వాళ్ల గురించి బాధపడకు. ఉన్నవాళ్లతో సంతోషాన్ని పోగొట్టుకోకూడదు. సంతోషం ఎక్కడో ఉండదు మనలో మనమే వెతుక్కోవాలి. అర్థం అయిందా?


అకి: థాంక్యూ సో మచ్‌. నాకు మిమ్మల్ని పర్సనల్‌ గా కలవాలని ఉంది. రేపే కలుస్తాను.


శంకర్‌: పర్వాలేదమ్మా రేపే కలుద్దాం. సరేనా ఎక్కడ కలుద్దామో నేను చెప్తాను. అక్కడికి వచ్చేయ్‌ మనం కూర్చుని మాట్లాడుకుందాం చక్కగా..


గౌరి: ఒక్క నిమిషం బాయ్‌ అండి టేక్‌ కేర్‌.


అకి: ఫ్రెండ్‌ నాకెందుకో వాళ్లను ఒకసారి కలవాలని ఉంది. నన్ను తీసుకెళ్తావా?


రాకేష్‌: దానిదేముంది. నువ్వు అంతగా అడగాలా? అంకుల్‌ రేపే తీసుకెళ్తారులే


జెండే: రాకేష్‌.. అది డిసైడ్‌ చేయాల్సింది నువ్వు కాదు. వాళ్లను ఎప్పుడు కలవాలో నాకు తెలుసు. అకి అది నేను ప్లాన్‌ చేస్తానుగా నువ్వు రెస్ట్‌ తీసుకో..


 అని జెండే చెప్పి వెళ్లిపోతాడు. కావాలనే జెండే వాళ్లను అవైడ్‌ చేస్తున్నాడు. వాళ్లెవరో తెలుసుకోవాలని రాకేష్‌ అనుకుంటాడు. మరోవైపు సంధ్య బట్టలు సర్దుతుంటే ఎలుక వస్తుంది. ఎలుకను చూసి సంధ్య బయపడగానే చిన్నా  వచ్చి ఎలుకను పట్టుకోబోతుంటే ఇంతలో శ్రావణి రూంలోకి వస్తుంది. శ్రావణిని చూసిన చిన్నా మంచం కింద దాక్కుంటాడు.


శ్రావణి: సంధ్యా ఏంటో నీ అరుపులు వినిపించాయి. ఎందుకు అరిచావు.


సంధ్య: అది ఎలుకను చూసి భయపడ్డాను.


శ్రావణి: అంతేనా ఆ చిన్ను నీ గదిలోకి వచ్చాడేమో అనుకున్నాను.


సంధ్య: చాచా అతను నా గదిలోకి ఎందుకు వస్తాడు. రాలేదు.


పొద్దోడు: శ్రావణి గారు మా చిన్నోడు ఏమైనా ఇటోచ్చాడా?


శ్రావణి: వచ్చాడు ఇదిగో ఈ మంచం కింద దాక్కున్నాడు.


  అని చెప్పగానే పెద్దోడు మంచం కింద ఉన్న చిన్నోణ్ని చూసి ఓరే చిన్నోడా ఇక్కడేం చేస్తున్నావు అంటాడు. చిన్నోడు మంచం కింద నుంచి రావడంతో శ్రావణి షాక్‌ అవుతుంది. ఇంతలో గౌరి రావడంతో పెద్దొడు, చిన్నోడు ఇద్దరూ మంచం కింద దూరుతారు. గౌరి వచ్చి శ్రావణి, సంధ్యలతో మాట్లాడుతుంటే శంకర్‌ వస్తాడు. మా తమ్ముళ్లు ఇటేమైనా వచ్చారా అని అడగ్గానే గౌరి వచ్చారండి. ఈ మంచం కింద దాక్కున్నారు. అని చెప్తుంది. దీంతో శ్రావణి, సంధ్య షాక్‌ అవుతారు. ఇంతలో మా తమ్ముళ్లు మంచాల కింద దాక్కునే క్యారెక్టర్‌ కాదని చెప్తుంటే గౌరి వాళ్లు వెళ్లిపోతారు. ఇంతలో కరెంట్‌ పోతుంది. ఇద్దరు తమ్ముళ్లు వచ్చి శంకర్‌ ముందు నిలబడతారు. ఇంతసేపు ఎక్కడున్నారని అడగ్గానే ఇద్దరు తిక్క తిక్కగా మాట్లాడుతుంటారు. తర్వాత ఎగ్జామ్‌కు వెళ్తున్న శ్రావణి, సంధ్యలకు శంకర్‌ ఆశీర్వాదం తీసుకోమని గౌరి చెప్తుంది. తర్వాత పేపర్‌లో వచ్చిన బెస్ట్‌ కపుల్‌ యాడ్‌ చూసి ప్రైజ్‌ మనీ 5 లక్షలు అని తెలిసి అందుకోసం మనిద్దరం డమ్మీ పెళ్లి చేసుకుని ఈ కాంపిటీషన్స్‌ కు వెళ్దామా? అని శంకర్‌, గౌరిని అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: వచ్చే నెల నుంచి షూటింగ్స్‌ బంద్ - ధనుష్‌పై దండెత్తిన నిర్మాతలు, ఎందుకీ గొడవ?