Prema Entha Madhuram Serial Today Episode: కోయదొర వచ్చి జోస్యం చెప్తుంటే.. యాదగిరి వచ్చి తిడుతాడు. జెండే వచ్చి ఇలాంటి వాళ్లు నిజం చెప్తారు. అనగానే.. యాదగిరి గురించి చెప్తాడు. నిజం చెప్పావు అంటాడు జెండే.. జెండే గురించి కూడా నిజం చెప్తాడు. దీంతో యాదగిరి షాక్ అవుతాడు. ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతాడు. అందరినీ పిలవండి అంటాడు కోయదొర. దీంతో యాదగిరి అందరినీ పిలుస్తాడు. అందరూ రాగానే కోయదొర ఈ ఇంటి శత్రువు రక్తం ఈ ఇంట్లో చేరింది. ఆ రక్తం బయటకు వెళితేనే ఈ ఇంటికి పట్టిన చెడు వీడుతుంది అని చెప్తాడు.
రవి: నమ్మి వచ్చిన వాళ్లను అలా ఎలా వెళ్లగొడతారు.
కోయదొర: కుర్రో కుర్రు.. నీ గురించి కూడా కొండదేవర చెప్పింది దొర. ఈ అమ్మాయికి తాళి కట్టి నువ్వు ఏలుకుందామని వచ్చినావు. కానీ కళ్యాణ గడియల్లో కొన్ని తప్పులు జరిగినాయి. పెళ్లి తర్వాత జరగాల్సిన తంతులు కొన్ని జరగలేదు. నీ పాదం కూడా ఈ ఇంటికి అచ్చి రాలేదు దొర.
గౌరి: అలా అంటారేంటి కొండదేవర. శుభంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వాళ్లకు అమ్మ ఆశీర్వాదం దొరకాలంటే ఎలా..?
కోయదొర: చెబుతాను తల్లి. ఒక వారం రోజులు భార్యాభర్తలు దూరం కావాలా..? పిల్లాఉ అత్తారింటి వైపు రాకూడదు. వారం తర్వాత అమ్మాయిని అప్పగించాలి.
రవి: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా పాదం అరిష్టం ఏంటి..?
కొయదొర: ఓ చిన్నదొర నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టగానే ఈ ఇంటి మనిషి పెళ్లి పెద్ద అపహరణ అయ్యారా లేదా..?
యాదగిరి: అవును మా మేడంను కిడ్నాప్ చేశారు.
కోయదొర: నిశ్చితార్థం అవ్వగానే.. ఒకరి ప్రాణాల మీదకు తెచ్చారా లేదా..?
గౌరి: అవును జెండే సార్‌ను పొడిచారు.
శంకర్: భలే ఇరకాటంలో పెట్టావు కొండ దొర.. ఒకరేమో ఈ ఇంటి అల్లుడు. ఒకరేమో అమ్మా నాన్నా లేని అనాథ. పైగా అన్న ఒక పెద్ద వెధవ. ఇప్పుడు వీళ్లిద్దరినీ ఎలాగయ్యా బయటకు పంపించేంది.
కొండదొర: ఇప్పుడు ఈ ఇల్లు పచ్చగా ఉండాలంటే.. కొండదేవర ఆన జరిగిపోవాల్సిందే..
జెండే: ఆలోచించుకుని చేద్దాం కొండదేవర.
కొండదేవర: అంత టైం లేదు దొర.. ఇప్పుడే జరిగిపోవాలి.
అని చెప్పి వెళ్లపోతాడు శంకర్ చాలా తెలివిగా లాక్ చేశాడు అని మనసులో అనుకుంటుంది మాయ. తర్వాత బయటకు వెళ్లిన కొండ దేవర దగ్గరకు వెళ్లిన శంకర్ థాంక్స్ చెప్తాడు. తర్వాత మాయ, రవి కోపంగా శంకర్‌ను తిట్టుకుంటారు. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతే మనం ఎప్పటికీ ఈ ఫ్యామిలీని ఏమీ చేయలేము అంటుంది. కానీ మనం ఇచ్చే దెబ్బతో శంకర్ ప్లాన్ ఫెయిల్ అయి మన జోలికి రావాలంటే భయపడిపోవాలి అనుకుంటారు. మరోవైపు యాదగిరి, రవి బట్టలు సర్దుతుంటే రవి రానని చెప్తాడు. ఇంతలో గౌరి వెళ్లి చెబితే కూడా యాదగిరి వినడు. దీంతో శంకర్ ను తీసుకురావాలని గౌరి శంకర్ దగ్గరకు వెళ్తుంది. రవిని యాదగిరి తీసుకెళ్తున్నాడు మీరు వచ్చి ఆపండి అని చెప్తుంది. శంకర్ రానని చెప్తాడు. దీంతో గౌరి ఏడుస్తుంది. మీరు చాలా మారిపోయారు అంటుంది. మరోవైపు యాదగిరి, రవిని తీసుకుని కిందకు వచ్చి మా వాడిని తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. మాయ మాత్రం రవిని తిట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!