Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode సుమిత్ర పెట్టిన టిఫెన్స్ అందరూ లొట్టలేసుకొని తిని తెగ పొగిడేస్తారు. ఆ వంటలు అన్నీ దీప చేసిందని కార్తీక్ టిఫెన్ సెంటర్ నుంచి తీసుకొచ్చానని సుమిత్ర చెప్తుంది. నువ్వు ఎందుకు వెళ్లావమ్మా అని శివన్నారాయణ అంటే గుడి నుంచి వస్తూ తీసుకున్నానని అంటుంది. ఆ మనిషే వద్దు అనుకుంటే ఆ చేతి వంటలు ఎందుకు అని ప్లేట్‌లో చేయి కడిగేస్తాడు. దశరథ్ కూడా భార్య మీద కోప్పడి ప్లేట్‌లో కడిగేస్తాడు.


సుమిత్ర: థ్యాంక్యూ జోత్స్న దీపకి రెస్టారెంట్ రేంజ్ ఉందని నువ్వే ఒప్పుకున్నావ్. దీపతో రెస్టారెంట్ పెట్టిస్తావా. ఏమంటారు అత్తయ్యగారు.
జ్యోత్స్న: మనసులో ఇంట్లో ఎవరికీ తెలీకుండా మమ్మీ దీప దగ్గరకు వెళ్లడం ఏంటి. మార్నింగ్ గ్రానీ కొడుకు వచ్చాడు. మమ్మీలో ఏదో మార్పు కనిపిస్తుంది దీనికి కారణం దీపేనా.
దీప: ఈ రోజు మన టిఫెన్ సెంటరు దగ్గరకు సుమిత్రమ్మ వచ్చారు కదా ఇంత దూరం వచ్చి ఎందుకు పలకరించకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు లేనిది ఎందుకు వచ్చారు. 
కార్తీక్: ఇలాంటి పరిస్థితిలో చూడటానికి ముఖం చెల్లక ఆటోలో వచ్చి డ్రైవర్‌తో టిఫెన్ కట్టించుకొని వెళ్లిపోయింది. దాసు మామయ్య వచ్చాడు. మా అమ్మ అత్త మంచి ఫ్రెండ్స్ తన ఫ్రెండ్ టిఫెన్‌ సెంటర్‌లో పని చేస్తుంటే పలకరించలేదు కదా అందుకే చాటుగా చూసి వెళ్లిపోవాలి అనుకుంది. నేను చూశాను కాబట్టి తెలిసింది లేదంటే ఎవరికీ తెలీకుండా చూసి వెళ్లిపోయేది. 
దీప: సొంత మనుషుల మధ్య దూరాలు ఎలా పెరిగి పోయావి.
కార్తీక్: ఇవన్నీ శాశ్వతం కాదు కాకపోతే మనం కొంచెం ఓపిక పట్టాలి. 


ఉదయం టిఫెన్ సెంటర్ దగ్గర కాంచన కూరగాయలు కట్ చేస్తుంటే దీప మీరు ఎందుకు వచ్చారు ఇంట్లో ఉండమని చెప్పాను కదా అంటుంది. ఇంతలో కొంత మంది ఆఫీసర్లు వస్తారు. టిఫెన్‌ సెంటర్‌లో శుభ్రం లేని క్వాలిటీ లేని ఫుడ్ ఆపుతున్నారని కంప్లైంట్ వచ్చిందని అమ్మకాలు ఆపమని చెప్తారు. కార్తీక్, దీప, కాంచనలు షాక్ అయిపోతారు. దీప అందరినీ టిఫెన్ ఎలా ఉంది అంటే బాగుంది అని అందరూ చెప్తారు. అర్థం చేసుకోండి అని దీప చెప్తుంది.  ఎవరు కంప్లైంట్ ఇచ్చారని అంటే అవన్నీ చెప్పకూడదు అని అంటారు. ఇక సాంపిల్స్ తీసుకొని బండి సీజ్ చేయమని అంటారు. దూరం నుంచి జ్యోత్స్న చూస్తూ నవ్వుతుంది. ఇంతలో ఓ పెద్దాయన వస్తే దీప విషయం చెప్తుంది. తాను ఓ రిటైర్డ్ కలెక్టర్ అని అధికారులను ప్రశ్నిస్తాడు. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అంటే అన్‌నౌన్ పర్సన్ అని అనడంతో అందరికీ సారీ చెప్పించి అక్కడి నుంచి వెళ్లమంటాడు.  జ్యోత్స్న చాలా డిసప్పాయింట్ అవుతుంది. దీప ఆయనకు దండం పెడుతుంది.


జ్యోత్స్న కారుని కార్తీక్ చూసి ఇదంతా జ్యోత్స్న పనా అని అనుకుంటాడు. జ్యోత్స్న ఆఫీస్‌కి వెళ్లి వాళ్ల ఎదుగులను నాశనం చేయాలి అనుకుంటుంది. ఇక జ్యోత్స్న కంపెనీలో 50 ఏళ్లు పైబడిన వాళ్లని తీసేస్తున్నామని మెయిల్ పెట్టమని నోటీస్ ఇవ్వమని అంటుంది. అలా చేస్తే వాళ్లు ఊరుకోరు అని జ్యోత్స్నతో మ్యానేజర్ అంటాడు. రాత్రి దీప అందరికీ  భోజనాలు పెడుతుంటుంది. ఆఫీస్‌లో మ్యానేజర్‌తో పాటు 50 ఏళ్లు పైబడిన కొంత మంది కార్తీక్ దగ్గరకు వస్తారు. తమకు అన్యాయం జరిగిందని సీఈవో జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని 50 ఏళ్లు పైబడిన వారిని జాబ్ నుంచి తీసేశారని చెప్తారు. అందరూ న్యాయం చేయమని కార్తీక్‌ని బతిమాలుతారు. దాంతో కార్తీక్ మీకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను అని ప్రశ్నిద్దామని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: 'త్రినయని' సీరియల్: అద్దంలో త్రినేత్రి ఆత్మ.. మనవరాలు చనిపోయిందని గుండె పగిలేలా ఏడుస్తున్న బామ్మ!