Prema Entha Madhuram  Serial Today Episode: తన నటనతో మాయ పూర్తిగా అభయ్‌ని నమ్మిస్తుంది. ఇక వెళ్తాను అని వెళ్లబోతుంటే.. ఎక్కడికి వెళ్తావు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అని చెప్తాడు అభయ్‌. సైలెంట్‌ గా వచ్చి అంతా వింటుంటాడు రవి.  అభయ్‌ మాయను తీసుకుని పైకి వెళ్తాడు. రవి జెండే, శంకర్‌లకు సైగ చేస్తాడు. పైకి రూంలోకి వెళ్లిన మాయ భయపడుతున్నట్టు నటిస్తూ.. అభయ్‌ను హగ్‌ చేసుకుంటుంది. డోర్‌ దగ్గర నుంచి అకి అంతా చూస్తుంది. అభయ్‌ బయటకు రాగానే అభయ్‌ వర్ధన్‌ పెద్ద బకరా అని మనసులో అనుకుంటుంది.


అకి: అన్నయ్యా…?


అభయ్‌: అకి నువ్వేంటి ఇక్కడ..


అకి: ఊరికే మాయకు అంతా కంఫర్ట్‌ గా ఉందో లేదో అని కనుక్కుందామని వచ్చాను. తనను చూసుకోవడానికి నువ్వు ఉన్నావని ఇక్కడే ఆగిపోయాను.  


అభయ్‌: అది తన అన్నయ్య విషయంలో చాలా భయపడిపోయింది.


అకి: అవునా పాపం.. అందుకేనా హగ్‌ చేసుకుని అంతలా ఓదారుస్తున్నావు..


అభయ్‌: అది క్యాజువల్‌ హగ్‌ అకి


అకి: అందుకే తనకు ఇవాళ్టీ నుంచి అన్నీ నువ్వే అన్నావు….  అన్నయ్యా నీ మనసు నాకు తెలుసులే..? వెంటనే ఈ విషయం రవికి చెప్పాలి.


అని రవి దగ్గరకు వెళ్లి హగ్‌ చేసుకుని హ్యాపీగా అకి అభయ్‌, మాయల గురించి చెప్తుంది.  దీంతో నువ్వు నా వలలో పడ్డావు మీ అన్నయ్య మాయ వలలో పడ్డాడు అని మనసులో అనుకుంటాడు రవి. మీ నాశనానికి మీరే దారులు వేసుకుంటుంటే.. సపోర్టు చేయడమేంటి సర్వనాశనం చేస్తాను  అనుకుంటాడు రవి. మరోవైపు శంకర్‌ ఆలోచిస్తుంటే జెండే వెళ్తాడు.


జెండే: శంకర్‌ ఏం ఆలోచిస్తున్నావు. రవి నిజస్వరూపం తెలిసి అకి జీవితం ఏమై పోతుందోనని భయపడుతున్నావా..?


శంకర్‌: కాదు సార్‌ అభయ్‌ లైఫ్‌ ఏమవుతుందోనని ఆలోచిస్తున్నాను.


జెండే: ఏం మాట్లాడుతున్నావు శంకర్‌..


శంకర్‌: అభయ్‌, మాయను ఇష్టపడుతున్నాడు సార్‌.


మరోవైపు


మాయ: వాట్‌ అభయ్‌ నన్ను ప్రేమిస్తున్నాడని అకి కన్‌ఫం చేసుకుందా..?


రవి: కన్‌ఫం చేసుకోవడం కాదు. అందరితో మాట్లాడి ఏకంగా మీ పెళ్లి జరిపించాలనే ఆలోచనలో ఉంది.


ఇంకోవైపు..


జెండే: ఏమంటున్నావు శంకర్‌ నువ్వు అనుకుంటున్నది. కరెక్టు కాదేమో.. శత్రువు కూతురు అయినా తన మంచిదని షెల్టర్‌ ఇచ్చాడేమో..?


శంకర్‌: లేదు సార్‌ మాయ ఈ ప్లాన్‌ ఇప్పుడు చేసింది. కాదు. తను ఎప్పటి నుంచో ప్లాన్‌ చేసింది. ఇప్పుడు రాకేష్‌తో గొడవ కూడా నాటకమే..


మరోవైపు…


మాయ: ఎస్‌ ఆ నమ్మకాన్ని కలిగించడానికే నేను ఇంత డ్రామా వేశాను. మా నాన్న గారి కోరిక నెరవేరుస్తాను.


రవి: లేదు మాయ నువ్వు అభయ్‌ ని తక్కువ అంచనా వేసినా పర్వాలేదు. కానీ శంకర్‌ను తక్కువ అంచనా వేయకు అతనుండగా వర్థన్‌ ఫ్యామిలీని ఏమైనా చేయడం కష్టం.


ఇంకోవైపు..


జెండే: కష్టమేంటి శంకర్‌. ఆ అమ్మాయి గురించి, రవి గురించి బయటపెట్టి వాళ్లను కాపాడుకుందాం.


శంకర్‌: రవిని బయటపెట్టడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. ఇక మాయను తక్కువ అంచనా వేయకూడదు.


అంటూ ఒకరి మించి ఒకరు తమ ప్లాన్లు వేసుకుంటారు. జరిగేది చూడటం తప్పా ప్రస్తుతం మనం ఏం చేయలేము సార్‌ అంటాడు శంకర్‌. ఎన్ని మలుపులు తిరిగినా ఈ ఆటలో చివరికి గెలిచేది నేనే అంటుంది మాయ. తర్వాత అకి.. గౌరి దగ్గరకు వెళ్లి అభయ్‌, మాయను ప్రేమిస్తున్నాడని చెప్తుంది. గౌరి భయపడుతుంది. దీంతో అకి, గౌరిని కన్వీన్స్‌ చేస్తుంది. తర్వాత శంకర్‌ ఆలోచిస్తూ ఉంటే గౌరి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. దీంతో శంకర్‌ మీ తలలో ఏదో లూజు అయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన అడుగుతాడు. మొన్న  కిడ్నాప్‌ చేసిన రౌడీలు తల మీద ఏమైనా కొట్టారా అని అడుగుతాడు. దీంతో గౌరి.. శంకర్‌ను లాగి తన కళ్లల్లోకి చూడండి అని చెప్తూ.. మన ప్రేమను మరోసారి గుర్తు చేసుకోండి సార్‌ అని మనసులో అనుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!