Prema Entha Madhuram  Serial Today Episode:   చిన్నోడు పెద్దోడు బండి మీద ఆఫీసుకు వెళ్తుంటే.. పోలీసులు వచ్చి బైక్‌ చెక్‌ చేస్తారు. బైక్‌లో మత్తు పదార్థాలు దొరుకుతాయి. దీంతో పోలీసులు చిన్నోడు పెద్దొడిని పట్టుకుని ఇవి ఎలా వచ్చాయని నిలదీస్తుంటారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంధ్య, శ్రావణి ఏమైందని అడుగుతారు. ఇంతలో పోలీసులు చిన్నోడిని పెద్దొడిని తీసుకుని వెళ్తారు. శంకర్‌, జెండే వస్తారు.

శంకర్‌: అమ్మా శ్రావణి, సంధ్య తమ్ముళ్లు ఎక్కడ..?

సంధ్య: వాళ్ల బైకులో మత్తు పదార్థాలు ఉన్నాయని ఇప్పుడే పోలీసులు తీసుకెళ్లారు.

శంకర్: జెండే సార్‌ తమ్ముళ్లను తీసుకెళ్లారట వెళ్దాం పదండి.. సంధ్య, శ్రావణి మీరు రండి. త్వరగా వెళ్దాం పదండి.

మరోవైపు హాస్పిటల్‌ లో

రాకేష్‌: ఏంటమ్మా నువ్వు చెప్పేది శంకర్‌ తమ్ముళ్లను అరెస్ట్‌ చేయించావా..? అది కూడా మత్తు పదార్థాల కేసులోనా..?

మాయ: అవును అన్నయ్యా..! నీకిలా జరగడానికి కారణమై నన్ను కూడా బాధ పెట్టాడు కదా..? మరి అదే బాధ అ శంకర్‌ కూడా అనుభవించాలి కదా..? అందుకే ప్లాన్‌ చేసి మరీ ఇరికించాను.

రాకేష్‌: నేనంటే ఎంత ప్రేమ మాయ నీకు నేను హాస్పిటల్‌ లో ఉంటేనే వాళ్లను రోడ్డు మీదకు తీసుకొచ్చేలా చేశావంటే.. నాకు ఏదైనా అయ్యుంటే.. వర్దన్‌ ఫ్యామిలీని సర్వ నాశనం చేస్తావేమో..?

మాయ: ఇది జస్ట్‌ వాళ్లకు వేకప్‌ కాల్‌ అన్నయ్యా..? అంతే.. అభయ్‌ని పూర్తిగా నావైపు తిప్పుకుని ఆ ఇంట్లో అలజడి సృష్టిస్తాను.

రాకేష్‌: జాగ్రత్త అమ్మా ఆ శంకర్‌ సామాన్యుడు కాదు.

మాయ: డోంట్ వర్రీ అన్నయ్యా నా ప్లాన్స్‌ నాకు ఉన్నాయి. రవి మన గ్రూప్‌లోంచి మిస్‌ అయ్యి వాళ్ల వైపే ఉన్నాడు. ఆ బావాబామ్మర్దుల బంధం బలపడక ముందే అభయ్‌ ని రెచ్చగొడతాడు. వర్ధన్‌ కుటుంబం బలమే ఐకమత్యం అందుకే వాళ్లను ఒక్కోక్కరిగా విడగొడతాను.

రాకేష్: సూపర్‌ చెల్లెమ్మా.. కానీ శంకర్‌ ఇక్కడ ఆర్యవర్థన్‌ కాదు. వాళ్లకు ఏమైతే నాకేంటని లైట్‌ తీసుకుంటే..?

మాయ: పేరుకు అతను శంకరే కావొచ్చు కానీ గత జన్మ వాసనలు పోలేదు. అందుకే తిరిగి కుటుంబానికి అండగా నిలబడుతున్నాడు. అభయ్‌, అకి కోసం ఎంత రిస్క్‌ అయినా చేస్తాడు. అదే నాకు ప్లస్‌.

రాకేష్‌: ఒకవేళ వీళ్లే ఎవరైనా శంకరే ఆర్యవర్థన్‌ అని నిజం చెప్తే..

మాయ: వాళ్లు ఎప్పటికీ చెప్పరు. ఎందుకంటే విధిని వాళ్లు బాగా నమ్ముతారు.

రాకేష్‌: ఓకే నిజమే కానీ ఇప్పుడు జెండే పలుకుబడితో శంకర్‌ తమ్ముళ్లను కాపాడితే..

అని డౌటు క్రియేట్‌ చేయగానే.. మాయ శంకర్‌ కు ఫోన్‌ చేసి నీ తమ్ముళ్లను ఇరికించి వదిలేస్తాను అనుకున్నావా..? నా నెక్ట్‌ టార్గె్‌ట్‌ అకి అని చెప్తుంది. మాయ చెప్పినట్టు గానే రవి, అభయ్‌ మధ్య గొడవ జరుగుతుంది. రవి కోసంగా వెళ్లి అకిని మన ఇంటికి వెళ్దాం పద అని అడుగుతాడు. అకి షాక్‌ అవుతుంది.  రా అకి అని చేయి పట్టుకుని తీసుకెళ్లబోతుంటే.. అభయ్‌ కోపంగా  తను రాదు అంటూ అపేస్తాడు. దీంతో రవి మరింత కోపంగా ఇప్పుడు నాతో వస్తే తీసుకెళ్తాను.. లేదా ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను శాశ్వతంగా అంటాడు రవి. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అకి ఏడుస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మాయ హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

   

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!