Prema Entha Madhuram  Serial Today Episode:   దారి మధ్యలో రాకేష్‌ గుంతలు తీయించి కారు టైర్లు పంచర్‌ అయ్యేలా చేయిస్తాడు. ఇంతలో అదే రూట్‌లో వచ్చిన అకి, అభయ్‌ ల కారు టైర్‌ పంచర్‌ అవుతుంది. జెండే కారు దిగి చూస్తాడు. కారు టైర్‌ పంచర్‌ అయి ఉంటుంది. ఏమైందని శంకర్‌ అడగ్గానే.. కారు పంచర్‌ అయిందని జెండే చెప్తాడు.


శంకర్‌: ఇందులో ఏముంది సార్‌.. స్టెపినీ ఉంది కదా మార్చుకుని వెళ్దాం


రవి: ఏంటిది శంకర్‌ గారు రెండో సారి ఆటంకం వస్తే మీరే ప్రోగ్రాం క్యాన్సిల్‌ చేస్తా అన్నారు కదా..? ఇప్పుడు చూడండి ఏకంగా టైరే పంచర్‌ అయింది. ఇది కూడా అపశకునమే కదా..?


శంకర్‌: అబ్బా రవి ఇది అపశకునమేంటి..? రాళ్లు ఉన్నాయి. పంచర్‌ అయింది. అంతే


మాయ: కానీ మీ కారు కంటే ముందు మా కారే వచ్చింది కదా శంకర్‌ గారు. మా కారుకేం కాలేదే..? కేవలం అకి, రవి ఉన్న కారుకే పంచర్‌ అయ్యిందేంటి..? అలోచించండి మీరే


జెండే: ఇలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.


గౌరి: ఎందుకో నాకు భయంగా అనుమానంగా ఉంది. వెనక్కి వెళ్లిపోదాం..


రవి: కాదు కూడదు అని కొట్టి పారేయకండి.. కావాలంటే మీరు వెళ్లండి  నేను అకి రాము.


శంకర్‌: అది కాదు రవి..


అకి: శంకర్‌ గారు ఫ్లీజ్‌ నాక్కూడా ఇది వార్నింగ్‌ లాగానే అనిపిస్తుంది ఊరికి ఇంకెప్పుడైనా వెళ్దాం ఈ ఫ్రోగ్రాం క్యాన్సిల్‌ చేద్దాం.


జెండే: సరేలే వెనక్కి వెళ్లాలన్నా టైర్‌ మార్చాల్సిందే కదా రా శంకర్‌ టైర్‌ మార్చేద్దాం.


అంటూ శంకర్‌ను జెండే వెనక్కి తీసుకెళ్తాడు.  


జెండే:  ఇప్పుడు ఏం చేద్దాం శంకర్‌..


శంకర్‌: నాకు ఏమీ అర్తం కావడం లేదు సార్‌. ఇది కూడా ప్లాన్‌ ప్రకారమే చేశారు. ఇక్కడ ఎక్కడ కన్‌స్ట్రక్షన్‌ జరగడం లేదు. కానీ ఎలాగైనా సరే అకి వాళ్లను అయోద్యపురం తీసుకెళ్లాల్సిందే..


జెండే: ఎందుకు ఇంత స్ల్రాంగ్‌ గా ఫిక్స్ అయ్యావు శంకర్‌. ఏదైనా రీజన్‌ ఉందా..?


శంకర్‌: సార్‌ అది అక్కడికి వెళ్లాక మీకే తెలుస్తుంది.


జెండే: మరి ఇప్పుడు వాళ్లను ఎలా ఒప్పిస్తావు..


శంకర్‌: ఏమో సార్‌ తెలియడం లేదు. అంతా అమ్మ దయ


అని ఇద్దరూ కలిసి టైర్‌ మార్చగానే.. అందరూ ఇక వెళ్దామా..? అంటారు సరే అంటారు.


మాయ: పాపం శంకర్‌ గారు విలేజ్‌లో బాగా ప్లాన్‌ చేశారనుకుంటా..? అవన్నీ ఫెయిల్‌ అయ్యాయి.. అభయ్‌ కార్‌ తీయ్‌..


 అని మాయ చెప్పగానే.. సరే అని అందరూ తిరిగి వెళ్లబోతుంటే జోగమ్మా వస్తుంది. జోగమ్మను చూసిన అందరూ ఆగిపోతారు. గౌరి, అకి, శంకర్‌, అభయ్‌ హ్యాపీగీ పీలవుతారు. దూరం నుంచి గమనిస్తున్న రాకేష్‌, రవి, మాయ షాక్‌ అవుతారు. జోగమ్మ దగ్గరకు వస్తుంది.


జోగమ్మ: ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో.. శుభకార్యానికి బయలుదేరి వెనకడుగు వేస్తున్నారా..?


జెండే: అకి పెళ్లి జరిగింది కద జోగమ్మా వాళ్లిద్దరిని సొంతూరుకు తీసుకెళ్లాలని బయలుదేరాం.. కానీ మధ్యలో ఏవో ఆటంకాలు.


గౌరి: అవును జోగమ్మా ముందుగా యాక్సిడెంట్‌ అయింది. ఆ తర్వాత ఇప్పుడు టైర్‌ ఫంచర్‌ అయింది. పెళ్లైన దంపతులను ఇలాంటి ఆటంకాల మధ్య తీసుకెళ్లడం మంచిది కాదని వెనక్కి వెళ్లిపోతున్నాం.


జోగమ్మా: అమ్మను నమ్ముకున్న వాళ్లకు ఆటంకమా..? ఎప్పటికీ ఉండదు. మీ ఈ ప్రయాణంలో మీ ఆలోచనలు ఎన్ని ఉన్నా..? అమ్మ ఆజ్ఞ వేరేలా ఉంది.


శంకర్: వేరేలా అంటే..?


జోగమ్మ: జీవితాలు ముడిపడేలా..? దూరమైన ప్రేమలు దగ్గరయ్యేలా..? జన్మజన్మల బంధాలు మరింత బలపడేలా..? నీకు నీ జతతో ముడిపడనుంది.


అని జోగమ్మా చెప్పగానే గౌరి హ్యాపీగా ఫీలవుతుంది. శంకర్‌ మాత్రం ఏమీ పట్టనట్టు చూస్తుండిపోతాడు. తర్వాత అందరూ అయోద్యపురం వెళ్తారు. అక్కడ ఇంట్లోకి గౌరి, శంకర్‌ ఒకేసారి అడుగుపెడతారు. ఇంతలో శంకర్‌ తన్మయత్వంతో గౌరిని చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!