Prema Entha Madhuram Serial Today Episode: చాలా రోజుల తర్వాత ఆర్య, అను ఆఫీసుకు వస్తున్నారని నీరజ్ స్టాఫ్‌తో కలిసి గ్రాండ్ వెల్‌కం చెప్తాడు. విలేజ్ నుంచి కొంత మంది చేనేత కార్మికులు వచ్చి అను, ఆర్యను సత్కరిస్తారు. మీ వల్లే మా ఊరు మొత్తం చేతి నిండా పనితో సంతోషంగా ఉంది అని చెప్తారు. దీంతో ఈ సక్సెస్ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది. అంటూ అందరినీ మెచ్చుకుంటారు. స్టాఫ్ కూడా ఆర్యను, అనును పొగడ్తలతో ముంచెత్తుతారు. అను చేనేత కార్మికులతో మాట్లాడటానికి బయటకు వెళ్తుంది. ఆర్య బోర్డు మీటింగ్ కు వెళ్తుంటాడు.
ఆర్య: జెండే పాపకు సంబంధించిన యాడ్ పోస్ట్ చేశారు కదా? ఎనీ రెస్పాన్స్..
కేశవ్: లేదు ఆర్య
ఆర్య: ఆదేంటి జెండె యాడ్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అయ్యింది కదా? ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ రాకపోవడం ఏంటి?
అంటూ ఆర్య వెళ్లిపోతాడు. మరోవైపు ఇంట్లో శారదాదేవి పూజ చేసుకుంటుంటే ఆనంది అనుమానంగా పైకి వెళ్తుంది. పైన ఎవరో మేకప్ వేసుకుంటుంటారు. ఆనంది డోర్ తెరుచుకుని లోపలికి వెళ్లగానే వెనకాలే ఎవరో రూం లోపలకి వెళ్తారు. లోపల ఉన్న చీరలను, నగలను పట్టుకుని చూస్తుంది ఆనంది. దెయ్యం పట్టినట్లు చేస్తుంది ఆనంది. మరోవైపు ఆర్య క్యాబిన్ లోకి కేశవ్ వస్తాడు.
కేశవ్: ఆర్య బోర్డు మీటింగ్ లో మనం ప్రజెంట్ చేయబోతున్న ప్రాజెక్టు ఫైల్ నువ్వు ఒకసారి చెక్ చేసి చెబితే నేను పంపిస్తాను.
అని చెప్పగానే ఆర్య ఫైల్స్ చెక్ చేస్తుంటాడు. కేశవ్ మొబైల్‌కు ఇంట్లో సీసీటీవీ పుటేజ్ అలెర్ట్ వస్తుంది. కేశవ వీడియో ఓపెన్ చేసి చూడగానే అందులో ఆనంది రూంలో కుర్చీ మీద కూర్చుని దెయ్యం పట్టినట్లు ఊగుతున్నట్లు వీడియో కనిపిస్తుంది. కేశవ్ షాక్ అవుతాడు. వీడియోను ఆర్యకు చూపిస్తాడు. వీడియో చూసిన ఆర్య షాక్ అవుతాడు.
ఆర్య: ఆ రూం లాక్ చేసి ఉంటుంది. కదా జెండే.. నేను అను తప్ప ఆ రూంలోకి ఎవ్వరూ వెళ్లే చాన్స్ లేదు.
కేశవ్: అను అయితే ఆఫీసులోనే ఉంది కదా ఆర్య. ఒకసారి రివైండ్ చేసి చూద్దాం అసలు ఏం జరిగిందో తెలుస్తుంది.
అని వీడియో మొదటి నుంచి చూస్తారు. లాక్ చేసి ఉన్న గదిలోకి ఆనంది వెళ్లడం చూసి ఆర్య షాక్ అవుతాడు. ఇంతలో అను వస్తుంది. ఏంటి టెన్షన్ గా ఉన్నారని అడగ్గానే ఏం లేదని ఆర్య చెప్తాడు. సైట్‌లో చిన్న ప్రాబ్లమ్ అని కేశవ్ చెప్పి తాను వెళ్లి అక్కడ ప్రాబ్లమ్ చూస్తాను అని వెళ్లిపోతాడు. అను, ఆర్య బోర్డు మీటింగ్‌కు వెళ్తారు. మరోవైపు అఖి, అభయ్ స్కూల్ నుంచి అనుకు ఫోన్ చేసి తాము ఇంటికి వెళ్లం అని అక్కడ ఆనంది ఉంటుంది అని చెప్పడంతో అను షాక్ అవుతుంది. మేము ఇంటికి వెళ్లకుండా ఆఫీసుకు వస్తామని చెప్పడంతో అను సరే అంటుంది. తాను డ్రైవర్‌కు చెప్తానని అనడంతో పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు కంగారుగా ఇంటికి వెళ్లిన కేశవ్ ను చూసిన శారదాదేవి కంగారుపడుతుంది.
శారదాదేవి: కేశవ ఎంటి ఇలా వచ్చావు.
కేశవ: అమ్మా ఈరోజు ఆఫీసులో బోర్డు మీటింగ్ ఉంది. ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాడు ఆర్య అది తీసుకెళ్దామని వచ్చాను.
శారదాదేవి: ఫోన్ చేస్తే నేనే డ్రైవర్‌తో పంపించేదాన్ని కద. అదే పనిగా నువ్వు రావడం దేనికి?
కేశవ: అమ్మా అది కొంచెం కాన్ఫిడెన్షియల్ ఫైల్ నేనే తీసుకెళ్దామని వచ్చాను.
శారదాదేవి: అవునా వెళ్లి తీసుకో.. కేశవా..ఫైల్ తీసుకుని వెంటనే వెళ్లిపోకు ఎలాగూ వచ్చావు కదా భోజనం చేసి వెళ్దువు..
కేశవ: అమ్మా అంత టైం లేదు..
అని కేశవ పైకి వెళ్లి రూమ్స్ అన్ని వెతుకుతాడు. ఆనంది ఎక్కడా కనిపించదు. దీంతో భోజనం తీసుకుని ఆఫీసుకు వెళ్తున్న కేశవ కారు ఎక్కగానే ఆనంది కారులో వెనక సీట్లో కూర్చుని ఉంటుంది. ఆనందిని చూసిన కేశవ షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: మరోసారి గొప్ప మ