Prema Entha Madhuram Serial Today Episode: డైనింగ్ టేబుల్ దగ్గర ఆనంది, ఆర్యను నాన్న అని పిలిచి నాకు అన్నం తినిపించవా అని అడగడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఆనంది నేను నాన్న అని పిలిచానని నువ్వు కూడా అలా పిలవకూడదు అంటుంది అఖి. నువ్వు మీ నాన్నను మాత్రమే నాన్న అని పిలవాలి అని చెప్పడంతో..
అను: అఖి తనేదో పొరపాటున పిలిచిందిలే నువ్వు తిను.
కేశవ్: ఏం పాప నీకు కలుపుకోవడం రాదా అమ్మా..
అని అడగ్గానే చేతికి కట్టు చూపిస్తుంది. దీంతో ఆర్య, ఆనందికి అన్నం తినిపిస్తాడు. అఖి, అభయ్ లు వింతగా చూస్తుంటారు. ఆర్య లక్ష్మీని పిలిచి ఆనందిని పైన పడుకోబెట్టమని చెప్తాడు.
శారదా దేవి: ఏంటి నాన్నా ఆ పాప నిన్ను నాన్నా అంటోంది.
ఆర్య: అదేం లేదమ్మా యాక్సిడెంట్ వల్ల తను మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యుండొచ్చని డాక్టర్ అన్నారు.
కేశవ్: మేము ఎవ్వరం పలకరించినా ఏం రెస్పాన్స్ అవ్వదు ఆర్య. నీతో మాత్రం బాగుంటుంది.
ఆర్య: జెండే సృహ వచ్చిన తర్వాత తను ఫస్ట్ నన్నే చూసింది. తను భయపడుతున్నట్లు కనిపిస్తే నేనే దగ్గరుండి ధైర్యం చెప్పాను. అందుకే చిన్న కనెక్షన్.
అను: తను ఎందుకో ఏ డీటెయిల్స్ అడిగినా చెప్పడం లేదండి. ఎవ్వరూ కూడా తన కోసం వెతుకుతున్నట్లు లేదు.
అంటూ అందరూ ఆనంది గురించి ఆలోచిస్తుంటారు. మరోవైపు చాయా టెన్షన్ పడుతుంది. తమ ప్లాన్ వర్కవుట్ కాలేదని కోపంగా అటూ ఇటూ తిరుగుతుంది. మాన్షి కూడా కోపంగా ఆర్యను తిడుతుంది.
జలంధర్: కొన్నిసార్టు మంచి జరిగినట్లు అనిపిస్తుంది. కానీ అది మంచి కాదు. కొన్ని సార్లు బ్యాడ్ జరుగుతుంది. అదంతా బ్యాడ్ కాదు కదా? మంచేదో చెడేదో మనమే తెలుసుకోవాలి.
మాన్షి: అదే ఎలా ఎం చేయగలం మనం
చాయా: ఫ్యామిలీతో సహా బంగలాకు చేరుకున్నారు కదా అక్కడ సిచ్యుయేషన్ ఏంటో కనుక్కో
మాన్షి: కనుక్కోవడానిక ఏం ఉంది. ఆ బంగళాలో పండుగ వాతారవణం ఉంటుంది.
అని మాన్షి ఇంటిలో పనిమనిషికి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుందో చెప్పు అని అడగడంతో ఇళ్లంతా పండుగ వాతావరణం నెలకొందని చెప్తుంది. అలాగే ఆనందిని తీసుకొచ్చిన విషయం చెప్పగానే చాయా, జలంధర్, మాన్షి షాక్ అవుతారు. ఆనంది ఆర్యను నాన్నా అని పిలిచింది అనగానే హ్యాపీగా ఆ పాప ఫోటో పంపించమని చెప్తారు. పనిమనిషి ఆనంది ఫోటో పంపిచగానే చూసి ఎవరా పాప అని ఆలోచిస్తారు. మరోవైపు ఆర్య పాప గురించి తన ఫోటో పాప దగ్గర ఉన్న విషయం కేశవ్‌కు చెప్తాడు.
కేశవ్: వాట్ పాప దగ్గర నీ ఫోటో ఉండటం ఏంటి ఆర్య.
ఆర్య: నాకు అదే అర్థం అవ్వడం లేదు. తను నన్ను నాన్నా అని పిలవడం. తన దగ్గర నా ఫోటో ఉండటం నాకే షాకింగ్ గా అనిపిస్తుంది.
కేశవ్: నువ్వు చెప్పిందంతా వింటుంటే ఏదో అనుమానం వస్తుంది.
అని ఈ విషయం ఎవ్వరితో చెప్పొద్దని ఒక క్లారిటీ వచ్చే వరకు ఎవ్వరికీ చెప్పొద్దని కేశవ్ చెప్తాడు. ముందు తను ఎవరు? ఎంటి? అనే విషయం తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఎంక్వైరీ చేయమని ఆర్య కేశవ్‌కు చెప్తాడు. కేశవ్ వెళ్లాక ఆర్యకు ఎవరో స్పీడుగా వెళ్లినట్లు షాడో కనిపిస్తుంది. ఇంతలో వీణ వాయిస్తున్న సౌండ్ విని అటు వెళ్తాడు ఆర్య. అక్కడ ఆనంది వీణ వాయిస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్యకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆర్యను చూసిన ఆనంది నాన్నా అంటూ పరుగెత్తుకొచ్చి హగ్ చేసుకుంటుంది.
ఆర్య: నీకు ఆ వీణ వాయించడం వచ్చా అమ్మా ఎక్కడ నేర్చుకున్నావు
ఆనంది: ఏమో తెలియదు.
ఆర్య: మరి తెలియకుండా..
ఆనంది: ఏ నాన్నా నీకు నచ్చలేదా? సరిగ్గా ప్లే చేయలేదా?
ఆర్య: అది కాదమ్మా బాగా ప్లే చేశావు.
అని మెచ్చుకుని ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. వెళ్లి పడుకో అని చెప్పగానే ఆనంది వెళ్లిపోతుంది. మళ్లీ ఆర్య పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. తర్వాత అను రూంలో తాళాలు వెతుకుతూ కింద పడబోతుంటే ఆర్య వచ్చి పట్టుకుంటాడు. నా ప్రేమలో ఎప్పుడో పడిపోయావు మళ్లీ మళ్లీ ఎందుకు పడతావంటూ రొమాంటిక్‌గా మాట్లాడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఆయనతో విలన్ క్యారెక్టర్ చేస్తే తంతారు - మెగా హీరోతో మల్టీ స్టారర్‌పై వరుణ్ వ్యాఖ్యలు