Prema Entha Madhuram Serial Today Episode: ఆర్య కారులో వెళ్తుంటే పాప కనిపిస్తుంది. కారు ఆపి పాపను పిలుస్తాడు. పాప ఆర్యను చూసి పరుగెత్తుకొస్తుంది. ఎందుకు హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావని ఆర్య పాపను అడుగుతాడు. నన్ను అక్కడి నుంచి వేరే చోటికి పంపిస్తారేమోనని వచ్చానని పాప చెప్తుంది. అయితే మీ అమ్మా నాన్న ఎవరు? ఎక్కడుంటారు చెప్పు అంటూ ఆర్య పాపను అడుగుతాడు. పాప పలకకుండా అలాగే నిలబడిపోతుంది. పోనీ నాన్న ఎక్కడ పని చేస్తారో తెలుసా? నాన్న పేరేమిటి? అని అడగ్గానే పాప ఆర్యవర్థన్ నే చూపిస్తుంది. దీంతో షాక్ అయిన ఆర్యవర్ధన్ నేనా అంటాడు.
పాప: నేను చెప్పేది నిజం నువ్వే మా నాన్న నువ్వే మా నాన్న..
ఆర్య: ఎందుకిలా ఈ పాప ఇలా మాట్లాడుతుంది. ఈ పాపతో ఎవరైనా ఇలా మాట్లాడిస్తున్నారా?
అని పాపను భుజం తట్టి అడుగుతుంటే పాప సంచిలోంచి ఆర్య ఫోటో కిందపడుతుంది. ఫోటోను చూసిన ఆర్య షాక్ అవుతాడు.
పాప: నీ ఫోటో చూపించి అడ్రస్ అడుగుతూ వచ్చాను నాన్న
ఆర్య: చూడమ్మా ఈ ఫోటో నీకు ఎవరిచ్చారు. నా దగ్గరకు వెళ్లమని ఎవరైనా చెప్పారా? భయపడకుండా చెప్పమ్మా..
అని అడుగుతుండగానే పాప ఏడుస్తుంది. దీంతో డాక్టర్ మాటలు గుర్తు చేసుకున్న ఆర్య పాపను ఓదార్చి తీసుకెళ్తాడు. ఇంట్లో హోమం చేస్తున్న అను, ఆర్య కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంతలో పంతులు కూడా హోమం అయిపోవచ్చింది. ఆర్యను రమ్మనమని చెప్పడంతో ఇంతలో ఆర్యనే పాపను తీసుకుని వస్తాడు. పాపను చూసిన ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. ఈ పాప ఎవరని అడుగుతారు. పాప గురించి అన్ని విషయాలు చెప్తాడు ఆర్య దీంతో ముందు హోమం పూర్తి చేయమని వాళ్ల అమ్మ చెప్తుంది. హోమం పూర్తి అయిన తర్వాత అను పాప రూంలోకి వెళ్లి పలకరిస్తుంది.
అను: పాప నీ పేరేంటి?
పాప: ఆనంది
అను: నైస్ నేమ్ నొప్పిగా ఉందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. మీ అమ్మానాన్న ఎక్కడుంటారు. మీ అమ్మా నాన్న పేరు తెలుసా? ఎందుకు ఆనంది ఏడుస్తున్నావు. భయమేస్తుందా? ఆనంది అంటే అర్థం తెలుసా నీకు
ఆనంది: తెలియదు.
అను: ఎప్పుడు ఆనందంగా ఉండేదని అర్థం. సరే భోజనం చేద్దాం రా
ఆనంది: సరే మీరు వెళ్లండి నేను వస్తాను.
అని ఆనంది చెప్పడంతో అను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అను వెళ్లిన తర్వాత ఆనంది మెల్లగా ఆర్య ఫోటో తీసుకుని చూసి ఐ లవ్ యూ డాడీ అని చెప్తుంది. మరోవైపు ఆర్య తన పిల్లలతో కలిసి గేమ్ అడుతుంటాడు. ఇంతలో ఆర్య గెలిచాడని వాళ్ల పాప హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో అను లోపలికి వచ్చి పిల్లలను ఓడించి గెలిచానని గొప్పలు చెప్పుకోవడం కాదు మీరు నాతో గెలవండి అంటుంది. దీంతో ఆర్య, అనుతో పోటీపడతాడు. అను రొమాంటిక్‌గా చూడటంతో ఆర్య ఓడిపోతాడు. తర్వాత అందరూ కలిసి భోజనానికి వెళ్తారు. ఆనంది కూడా భోజనానికి వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఆర్యను నాన్న అని పిలిచి నాకు తినిపించవా అని ఆనంది అడగడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేదు, నన్ను వదిలేయండి - ట్రోల్స్‌పై ‘సూపర్’ నటి ఆయేషా టాకియా ఫైర్