Prema Entha Madhuram  Serial Today Episode:     అందరూ వెళ్లిపోయాక శంకర్‌, గౌరి ఫోటో చూస్తూ.. మిస్‌ యూ గౌరి గారు మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని కాపాడతాను అంటాడు. ఈరోజు జెండే సార్‌ అనురాధ, ఆర్యవర్ధన్‌ ల ప్రేమ గురించి చెప్తుంటే నాకు ఒకటి అర్థం అయింది. అంత గొప్ప ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలనిపించింది. మీరు ఎప్పుడూ భార్యాభర్తల బంధం గురించి ఎందుకు గొప్పగా చెప్తారో ఈ రోజే అర్థం అయింది. మీరు తిరిగి వచ్చాక మీ మాట వింటాను. కానీ మీతో గొడవ పడకుండా మాత్రం ఉండలేను అంటూ ఎమోషనల్ అవుతాడు. తర్వాత రవికి జ్యోతి ఫోన్‌ చేసి జాగ్రత్తలు చెప్తుంది.

అకి: ఎవరు రవి అత్తయ్యగారా..?

రవి: అవును అకి. అమ్మ మనల్ని చాలా మిస్‌ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి అని పదే పదే చెప్తుంది.

అకి: సారీ రవి పెళ్లాయ్యాక మనం ఇంటికి వెళ్లి ఉండాలి. కానీ అమ్మ కిడ్నాప్‌ అవ్వడం వల్ల వెళ్లలేకపోయాం. అసలు మనకు పెళ్లి అయిన సంతోషమే లేకుండా పోయింది.

రవి: అలా మాట్లాడకు అకి. నీ కష్టం నా కష్టం కాదా చెప్పు. ఇంకెప్పుడు అలా ఆలోచించకు సరేనా..?

అని చెప్పి అకిని ఓదారుస్తాడు రవి. నెక్స్ట్‌ మామయ్య ఏం చేస్తున్నారో తెలుసుకుందాం పద అని కిందకు వస్తారు. కింద శంకర్‌, గౌరి ఫోటో చూడటం చూసి జెండే, అకి, అభయ్‌, రవి షాకింగ్‌ గా చూస్తుంటారు. గత జన్మ గుర్తుకు వచ్చిందేమోనని అనుమాన పడతారు. జెండే లేదని చెప్తాడు. అకి వెళ్లి  నాన్నా అని పలకరిస్తుంది. అభయ్‌ వెంటనే అకి మనం ఓనరు ఉన్నప్పుడు అలా పిలవాలి అని చెప్పగానే సారీ శంకర్‌ గారు అంటుంది. పర్వాలేదులే అకి నువ్వు అలా పిలుస్తుంటే నాకు బాగుంది అంటాడు. ఇంతలో యాదగిరి వచ్చి ఆ ఓనరు గాడు స్పృహలోకి వచ్చేలా ఉన్నాడని చెప్తాడు. పైన ఉన్న ఓనరు స్పృహలోకి రాగానే రాజా భూపతి రాజా గెటప్‌ చూసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంతలో యాదగిరి పనోడి గెటప వేసుకుని పాలు తీసుకుని వస్తాడు.

ఓనరు: ఎవరు నువ్వు..

యాదగిరి: తమరికి స్వచ్చమైన పాలు తీసుకురావడం కొంచెం ఆలస్యం అయింది రాజావారు. క్షమించడం.. సేవించండి.

ఓనరు: చూస్తుంటే.. యాదగిరిలా ఉన్నాడు.. అడిగేస్తో పోలా ( అని మనసులో అనుకుంటాడు) ఏమయ్యా యాదగిరి ఏంటిదంతా..?

యాదగిరి: ఆలస్యం అయినందుకు తమరికి నా పై ఆగ్రహం కలిగినట్టు ఉంది. మీ సేవకునిగా నేను ధరించేవి ఈ వస్త్రములే కదా రాజావారు.

అని ఓనరును  గత జన్మలోకి తీసుకెళ్తాడు. ఓనరుకు జెండే చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.  నేను టైం ట్రావెలింగ్ చేసి ఈ కాలానికి వచ్చానన్న మాట. నేను ఆర్యవర్ధన్‌ వాళ్ల తాత రాజా భూపతి రాజా అన్నమాట అని మనసులో అనుకుంటాడు. అంటే యాదగిరి గత జన్మలో నా పనివాడన్న మాట. అందరం ఒకరితో ఒకరం కనెక్టు అయ్యేలా పునర్జన్మ ఎత్తావన్నమాట. ఇప్పుడు చెప్తాను వీడి సంగతి అంటూ కొంచెం తల నొప్పిగా ఉంది నా తల పట్టుము అంటాడు. యాదగిరి తనకు వస్తున్న కోపాన్ని దిగమింగుతూ తల పడతాడు. తర్వాత ఇద్దరూ కలిసి కిందకు వస్తారు. కింద జెండే దివాన్‌ జీ లాగా వేషం వేసుకుని వస్తాడు. ఓ జెండేకు కూడా పునర్జన్మ ఉందన్నమాట అనుకుంటాడు ఓనరు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!