Prema Entha Madhuram  Serial Today Episode: గౌరిని ఎలా కాపాడాలో శంకర్‌ అందరికీ చెప్తాడు. నా మీద నమ్మకం ఉంటే మీరందరూ ఇప్పుడు భోజనం చేయండి అని చెప్తాడు. మీ మీద నమ్మకం ఉందని నువ్వు చెప్పినట్టే అందరం నడుచుకుంటామని చెప్తారు. సరేనని తన ప్లాన్‌ చెప్తాడు శంకర్‌. ఇంటికి ఎదురుగా రాకేష్‌ మనిషి బైనాక్యులర్ లో చూస్తాడు. రాకేష్‌ ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి అక్కడ వర్ధన్‌ కుటుంబంలో ఎవరెవరు ఎలా బాధపడుతున్నారు అని అడుగుతాడు. బైనాక్యులర్‌ లో చూసిన వ్యక్తి అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అసలు వాళ్లను చూస్తుంటే.. ఆ ఇంట్లో కిడ్నాప్‌ జరిగినట్టు లేరని పెళ్లి జరిగింది కదా..? నెక్స్ట్‌ తతంగం జరగడానికి ప్లాన్‌ చేస్తున్నారేమో అంటాడు. దీంతో రాకేష్‌ షాక్ అవుతాడు. శంకర్‌ మాత్రం స్టైలిష్ గా వెళ్తుంటాడు.

అకి: రవి నాన్న  ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు.

రవి: అత్తయ్యన వెతకడానికి ఏదో ప్లాన్‌ చేసే ఉంటారు.

అకి: అయితే నాన్న తన ప్లాన్‌ ను మొదలు పెట్టేశారన్నమాట.

శ్రావణి: సంధ్య శంకర్‌ గారు బయటకు వెళ్తున్నారే.. ఎంత జాలీగా వెళ్తున్నారో చూడు.

సంధ్య: అక్కను తీసుకొస్తానని మాటిచ్చారు కదా..? అందుకోసం వెళ్తున్నట్టున్నారు.

యాదగిరి: జెండే సార్‌ ఆర్య సార్‌ ఎక్కడికి వెళ్తున్నారో మీకు ఏమైనా చెప్పారా..?

జెండే: లేదు యాదగిరి. చూడబోతే ఆపరేషన్‌ గౌరి సర్చింగ్‌ స్టార్ట్‌ చేసినట్టు ఉన్నారు.

యాదగిరి: అయితే ఆ రాకేష్‌ గాడికి మూడినట్టే..

రౌడీ: బాస్‌ ఆ శంకర్‌ గాడు కారులో ఎక్కడికో వెళ్తున్నాడు.

రాకేష్‌: అవునా మరి నువ్వేం చేస్తున్నావు.. ముందు ఆ శంకర్‌ గాడిని ఫాలో అవ్వు

అని రాకేష్‌ చెప్పగానే ఆ రౌడీ శంకర్‌ను ఫాలో అవుతుంటాడు. కారు సైడు మిర్రర్‌లో రౌడీ తనను ఫాలో కావడం శంకర్‌ చూస్తాడు. రాకేష్‌ ఆ రౌడీతో శంకర్‌ ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతాడు. జూబ్లీహిల్స్ కు వెళ్తున్నాడు అని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడని చెప్తాడు. నువ్వు అక్కడే ఉండి అన్ని గమనిస్తూ ఉండు స్టేషన్‌లో ఏం జరగుతుందో నేను తెలుసుకుంటాను అంటాడు. స్టేషన్‌లోకి వెళ్లిన శంకర్‌ ఇంటి ఓనరుకు బెయిల్‌ ఇప్పిస్తాడు. శంకర్‌ ను చూసిన ఓనరు భయంతో నాకు ఈ బెయిల్‌ వద్దు అని భయపడతాడు. శంకర్‌ నిన్నేమీ అనను బయటకు రా అని పిలుస్తాడు. రౌడీ ఫోన్‌లో రాకేష్‌కు ఓనరుకు శంకర్‌ బెయిల్‌ ఇప్పించాడని చెప్తాడు. రాకేష్‌ షాక్‌ అవుతాడు.

రాకేష్‌: అరేయ్‌ శంకర్‌ ఏం చేస్తున్నావురా… అసలు నీ ప్లాన్‌ ఏంటి..?

గౌరి: అసలు నేను ఎక్కడ ఉన్నాను. రాకేష్‌ ఎక్కడున్నావు.. నన్ను ఎక్కడ బంధించావురా.. మర్యాదగా నా కట్లు విప్పు..

అంటూ అరుస్తుంది. మరోవైపు ఇంట్లో అందరూ భయపడుతుంటారు. శంకర్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని కంగారు పడుతుంటారు. ఇంతలో శంకర్‌, ఓనరును తీసుకుని ఇంటికి వస్తాడు.

జెండే: ఎక్కడికి వెళ్లావు శంకర్‌ ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయడం లేదు.

శంకర్‌: పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాను సార్‌

అభయ్‌: కిడ్నాప్‌ కంప్లైంట్‌ ఇవ్వడానికి వెళ్లారా.. చెప్తే మేము వచ్చే వాళ్లం.

శంకర్‌: లేదు అభయ్‌ బెయిల్‌ మీద రిలీజ్‌ చేయించడానికి వెళ్లాను.

యాదగిరి: బెయిల్ ఇచ్చారా..? ఎవరికి సార్‌..

అని అడగ్గానే శంకర్‌ గురువు గారు అంటూ ఓనరును పిలవగానే ఓనరు ఇంట్లోకి వస్తాడు. ఓనరును చూసిన యాదగిరి కత్తి తీసుకుని పోడవడానికి వెళ్తాడు. అందరూ వద్దని ఆపేస్తారు. ఈయన మీద చెయ్యి పడిందంటే నేను ఊరుకునేది లేదు అంటాడు శంకర్‌. శంకర్‌ మాటలకు ఓనరు షాక్‌ అవుతాడు.  ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!