Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీ వల్లే అమర్ సంతోషంగా ఉన్నాడని ఆరు ఉన్నా కూడా ఇలాంటి మంచి పని చేసేది కాదని మెచ్చుకుంటారు నిర్మల, శివరాం. రాథోడ్‌ కూడా మా సార్‌ ఇంత ఆనందంగా ఉండటం నేనేప్పుడూ చూడలేదని ఆనందతో భాగీని పొగడ్తలతో ముంచెత్తుతాడు. అవేమీ పట్టించుకోని భాగీ మీకు నిర్మలకు కాఫీ తీసుకురావడనికి లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు అమర్‌ పిల్లలతో హ్యాపీగా మాట్లాడుకోవడం ఆరు చూస్తుంది.

ఆరు: మిమ్మల్ని పిల్లలను ఇలా చూస్తాను అనుకోలేదండి. మీకు సరైన జోడీ మిస్సమ్మే అనుకున్నాను. నా నమ్మకాన్ని మిస్సమ్మ ఈరోజు నిలబెట్టింది.

అమ్ము: డాడ్‌ ఇక మేము వెళ్లి  పడుకుంటాడు గుడ్‌ నైట్‌.

భాగీ: ఏంటి పిల్లలు చక్కగా మీ డాడీతో ఎంజాయ్‌ చేసినట్టు ఉన్నారు.

  పిల్లలందరూ ఏడుస్తుంటారు.

భాగీ: అరేయ్‌ ఏంటది.. ఎందుకు కన్నీళ్లు

అంజు, మిస్సమ్మను హగ్‌ చేసుకుంటుంది.

అంజు: హగ్‌ ఇచ్చాను కదాని అయిపోయింది అనుకోకు కోపం అలాగే ఉంటుంది.

భాగీ: నేను కూడా హగ్‌ ఇచ్చాను కదాని గొడవ అయిపోయింది అనుకోకు చిన్న బ్రేక్‌ ఇచ్చాను అంతే.

  అంటుంది మిస్సమ్మ. దీంతో పిల్లలందరూ మిస్సమ్మను హగ్‌ చేసుకుంటారు. డాడీతో చాలా కబుర్లు చెప్పాము.. డాడీని చాలా మిస్‌ అయ్యాము అని చెప్తారు. సరే లేట్‌ అయింది కదా వెళ్లి పడుకోండి అని పిల్లలను రూంలోకి పంపిచేస్తుంది. తర్వాత అమర్‌ దగ్గరకు వెళ్తుంది భాగీ.

భాగీ: ఏవండి రాత్రి ఏ టైంలో అయినా అవసరం ఉంటే నన్ను నిద్రలేపండి మొహమాట పడకుండా అడగండి.

అమర్‌ : మిస్సమ్మ థాంక్స్‌

భాగీ: ఎందుకండి.. జాగ్రత్తలు చెప్తున్నందుకా..?

అమర్‌: పిల్లలు వచ్చి మాట్లాడారు. ఈ సంతోషానికి, మా నవ్వులకు కారణం నువ్వే అని నాకు తెలుసు మిస్సమ్మ. ఆరు లేదని బాధపడ్డాను కానీ ఆరును పిల్లల్లో చూసుకోవచ్చని తెలియలేదు.

భాగీ: ఇంత చిన్న విషయానికి థాంక్స్‌ ఎందుకండి.

అమర్‌: నీకు తెలియదు. కానీ  ఇది నాకు చాలా పెద్ద విషయం.. ఆరు ఏ లోకంలో ఉన్నా నీకు చాలా పెద్ద థాంక్స్‌ చెప్తుంది. నాకు హెల్త్‌ సెట్‌ అయ్యాక వీక్లీ ఒకసారి అందరం కలిసి ఇలాగే కబుర్లు చెప్పుకుందాం మిస్సమ్మ

అంటూ అమర్‌ చెప్తూ పడుకుంటాడు. భాగీ సరే అంటుంది.   మరోవైపు బాబ్జీ కిరాయికి లారీ తీసుకుంటాడు. ఆదే లారీతో భాగీని యాక్సిడెంట్‌ చేసి చంపాలనుకుంటాడు. మనోహరి ఫోన్‌ చేసి రెడీగా ఉన్నావా..? అని అడుగుతుంది. అంతా రెడీగా ఉందని రేపటి నుంచి మీ జీవితంలోంచి ఆ మిస్సమ్మ మిస్‌ అవుతుందని చెప్తాడు. భాగీ, అమర్‌కు జాగ్రత్తలు చెప్తుంది. టాబ్లెట్స్‌ గురించి చెప్తుంది.

భాగీ: మీకు ఏ అవసరం వచ్చినా అత్తయ్యను పిలవండి.. నేను గుడికి వెళ్లగానే మీకు ఫోన్‌ చేస్తాను

అమర్‌: మిస్సమ్మ కూర్చో నేను బాగానే ఉంటాను నాకు ఏ అవసరం రాదు. వచ్చినా చూసుకోవడానికి ఇంట్లో చాలా మంది ఉంటారు. నువ్వు ప్రశాంతత కోసం గుడికి వెళ్తున్నావు కదా..? ఈ ఆలోచనలు అన్ని ఇక్కడే పెట్టి ప్రశాంతంగా వెళ్లి రా ఇంతకీ ఎలా వెళ్తున్నావు

భాగీ: నడుచుకుంటూ వెళ్తానండి.

అమర్‌:కొద్ది సేపు ఆగితే రాథోడ్‌ వస్తాడు కదా..? కారులో డ్రాప్‌ చేస్తాడు

భాగీ: మన వీధి చివరే కదండి గుడి నడుచుకుంటూ వెళ్తానులేండి.

అని భాగీ చెప్పగానే సరే వెళ్లు అని అమర్‌ చెప్తాడు. భాగీ అక్కడి నుంచి బయటకు వస్తుంది. కింద భాగీ కోసం మనోహరి వెతుకుతుంది. వెనక నుంచి వచ్చిన భాగీ నాకోసం వెతుకుతున్నావా..? మనోహరి గారు అని అడుగుతుంది. అదేం లేదని చెప్తుంది మనోహరి. బయటకు వచ్చిన భాగీ గార్డెన్‌లో కూర్చున్న ఆరును చూసి గుడికి రమ్మని అడుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!