Prema Entha Madhuram  Serial Today Episode: బెస్ట్‌ కపుల్‌ ఫంక్షన్‌కు శ్రావణి, సంధ్య రావడంతో వాళ్లను చూసిన యాదగిరి షాక్‌ అవుతాడు. వాళ్లను ఎలాగైనా అక్కడి నుంచి పంపిచేయాలని ప్రయత్నిస్తాడు. కానీ వాళ్లు వెళ్లరు. ఇంతలో చిన్నొడు, పెద్దొడు కూడా ఆ ఫంక్షన్‌కు రావడం చూసి కంగారుపడతాడు. వాళ్లను కూడా వెళ్లమని చెప్తే వెళ్లమని మేం వచ్చిందే భార్యాభర్తల రిలేషన్‌ గురించి తెలుసుకోవడానికి అనడంతో యాదగిరి భార్య అన్నయ్య, వదిన ఇక్కడ ఉన్నారని మీకు ఎలా తెలిసింది బాబు అని అడగడంతో యాదగిరి షాక్‌ అవుతాడు. ఇంతలో చిన్నోడు, పెద్దోడు లోపలికి వెళ్లిపోతారు. లోపల టెన్షన్‌ పడుతున్న శంకర్‌ ను ఇబ్బంది పడొద్దని చెప్తుంది గౌరి.


గౌరి: శంకర్‌ గారు ఎందుకు అలా తిరుగుతున్నారు.


శంకర్‌: టెన్షన్‌ గా తిరిగితే నాలో ఉన్న టెన్షన్‌ ఏమైనా కవర్‌ అవుతుందేమోనని ట్రై చేస్తున్నానండి. చేతికి వచ్చిన క్యాష్‌ ప్రైజ్‌ చేజారిపోయేలా ఉంది. లాస్ట్‌ రౌండ్‌ ఏం టాస్క్‌ ఇస్తారో ఏమో నాకేం అర్థం కావడం లేదు.


గౌరి: అబ్బా ఏం రాసి పెట్టినా మనం గెలస్తాం అండి. ముందు మూడు టాస్క్‌ లు గెలిచాము కదా ఇది గెలవలేమా?


శంకర్‌: ఎంటండి మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.


గౌరి: కాన్పిడెంట్‌ ఈజ్‌ ద ఫస్ట్‌ స్టెప్‌ ఇన్‌ ద విక్టరీ అండి.  


   అని గౌరి చెప్పగానే ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెంట్‌ వచ్చిందని శంకర్‌ అంటాడు. ఇంతలో యాదగిరి వచ్చి అవతల అసలు సమస్య వచ్చిందని మీ చెల్లెల్లు, మీ తమ్ముళ్లు ఈ ఫంక్షన్‌ కు వచ్చారని చెప్పడంతో గౌరి, శంకర్‌ షాక్‌ అవుతారు. ఎందుకొచ్చారని అడగ్గానే భార్యాభర్తల సంబంధం తెలుసుకుని మీకో మంచి భర్తను, మీకో మంచి భార్యను తీసుకురావాలని వచ్చారంట అని చెప్పగానే గౌరి అక్కడి నుంచి వెళ్లిపోదాం అంటుంది. ఇంతదూరం వచ్చాక నేను ప్రైజ్‌ మనీ వదులుకోనని శంకర్‌ అంటాడు. మరోవైపు ఫంక్షన్‌ కు వచ్చిన శ్రావణి, సంధ్య, పెద్దోడు, చిన్నోడు ఒకరిని ఒకరు చూసుకుని షాక్‌ అవుతారు. శ్రావణి వాళ్లను ఫంక్షన్‌ హాల్‌ నుంచి పంపించేయడానికి యాదగిరి, ఆయన భార్య శత విధాలా ప్రయత్నించినా వాళ్లు వెళ్లరు. ఇంతలో అక్కడికి జెండే వస్తాడు.


యాదగిరి: సార్‌ వచ్చారా?


జెండే: యాదగిరి.. ఏంటి కంగారు


యాదగిరి: ఏం లేదు సార్‌. ఇంతకీ అభయ్‌ ఎక్కడ సార్‌


జెండే: అభయ్‌ ఏదో పని ఉందని కాస్త లేటుగా వస్తానన్నాడు. బట్ రాకేష్‌ ఏమైనా అభయ్‌ ని పొల్యూట్‌ చేస్తున్నాడేమోనని డౌట్‌ గా ఉంది.


యాదగిరి: వాడేంటి సార్‌ ఇలా తగిలాడు. మీరు వాణ్ని ఏదో ఒకటి చేయండి.


జెండే: కొంచెం టైం పడుతుంది. వాణ్ని అంత ఈజీగా వదిలిపెట్టను యాదగిరి. అవును నువ్వేంటి ఎదో కంగారుగా ఉన్నావు.  


 అనగానే యాదగిరి అటు చూడండి అంటూ శ్రావణి వాళ్లను చూపిస్తాడు. దీంతో ఏదో ఒకటి చేసి వాళ్లను ఇక్కడి నుంచి పంపించు అని చెప్పి జెండే వెళ్లిపోతాడు. మరోవైపు అకి, నీతూ మాట్లాడుకుంటుంటారు.


అకి: నీతూ నువ్వు వెళ్లి కాసేపట్లో ప్రోగ్రాం మొదలవుతుందని అనౌన్స్‌ మెంట్‌ ఇవ్వు


నీతు: ఓకే బట్‌ నువ్వు కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది.


అకి: ప్రాగ్రాం అయిపోయిన తర్వాత చూద్దాంలే..


జెండే: నో అకి ఇప్పుడే మాట్లాడాలి.


అకి: ఫ్రెండ్‌ వచ్చావా? అన్నయ్య ఎక్కడ?


జెండే: ఏదో అర్జెంట్‌ పని ఉండి చూసుకుని వస్తానని చెప్పారులే.. ముందు నువ్వు ప్రోగ్రాం స్టార్ట్‌ చేయ్‌. హార్ట్‌ఫుల్‌గా నీ ఫీలింగ్స్‌ అన్ని అదరితో షేర్‌ చేసుకో..


 అని చెప్పగానే అకి సరే అంటుంది. నీతు వెళ్లి ప్రోగ్రాం ఇంకాసేపట్లో  స్టార్ట్‌ అవుతుందని చెప్తుంది. అలాగే ఈ ప్రోగ్రామ్‌ కండక్ట్‌ చేస్తున్న  ఆకాంక్ష వర్థన్‌ తన అభిప్రాయాలు మీతో పంచుకుంటుందని చెప్తుంది. దీంతో అకి స్టేజి మీదకు వచ్చి తన అభిప్రాయాలు చెప్తుంది. తన అమ్మానాన్నాలను      (ఆర్యవర్థన్‌, అను) గుర్తు చేసుకుంటుంది. రూంలో ఉన్న గౌరి, శంకర్‌ లు అకి మాటలు వింటూ ఎమోషనల్‌ అవుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘ఇండియన్ 2’లో ముందుగా సిద్ధార్థ్ ప్లేస్‌లో ఆ హీరో? పెద్ద డిజాస్టర్ తప్పించుకున్నాడంటున్న ప్రేక్షకులు