Indian 2: ఒకప్పుడు మెసేజ్ ఓరియెంట్ కథకు భారీ బడ్జెట్‌ను జతచేసి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న దర్శకుడు శంకర్. కొన్నాళ్ల క్రితం శంకర్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉండేది. ప్రీ బుకింగ్స్ విషయంలోనే ఆయన సినిమాలు వండర్స్ క్రియేట్ చేసేవి. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదురవ్వడంతో ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పోయింది. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘ఇండియన్ 2’కు డిజాస్టర్ టాక్ రావడంతో పాటు చాలామంది దానిని ట్రోల్ కూడా చేశారు. అయితే ముందుగా ఈ మూవీలో సిద్ధార్థ్ చేసిన క్యారెక్టర్ కోసం మరో హీరోను పరిగణనలోకి తీసుకున్నారట మేకర్స్.
మిస్ చేసుకున్నాడు..
‘ఇండియన్ 2’లో కమల్ హాసన్ హీరోగా నటించారు. తనతో పాటు సెకండ్ హీరోగా సిద్ధార్థ్.. మరో కీలక పాత్రలో కనిపించాడు. కానీ ఈ పాత్ర కోసం ముందుగా కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్‌ను పరిగణనలోకి తీసుకున్నారట మేకర్స్. అయితే శివకార్తికేయన్ కాల్ షీట్స్ ప్రస్తుతానికి ఖాళీగా లేవు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండడంతో పాటు కొత్త కథలను ఎంచుకోవడంలో ఈ హీరో ఆసక్తి చూపిస్తున్నాడు. అలా పలు కారణాల వల్ల తను ‘ఇండియన్ 2’ను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ అవకాశం సిద్ధార్థ్‌కు వచ్చింది. కమల్ హాసన్ లాంటి స్టార్‌తో కలిసి నటించడం అదృష్టం అని భావించాడు సిద్ధార్థ్. కానీ ఆ అవకాశం వల్లే ఇప్పుడు ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రమోషన్స్‌లో హైలెట్..
‘ఇండియన్ 2’ను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగానే ప్రమోషన్స్ జరిగాయి. అన్నింటిలో కమల్ హాసన్, శంకర్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా యాక్టివ్‌గా పాల్గొన్నారు. కానీ అందరికంటే సిద్ధార్థే ఈ ప్రమోషన్స్‌లో హైలెట్‌గా నిలిచాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు దురుసుగా సమాధానాలు ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. పలు ఈవెంట్స్‌లో కమల్ హాసన్‌ను సిద్ధార్థ్ కనీసం మాట్లాడనివ్వడం లేదంటూ తమిళ మీడియా తనను విమర్శిస్తూ వార్తలు కూడా ప్రసారం చేసింది. ఇదంతా చూస్తుంటే శివకార్తికేయన్ చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నాడేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.
పలుమార్లు పోస్ట్‌పోన్..
భారీ అంచనాల మధ్య ‘ఇండియన్ 2’ అలియాస్ ‘భారతీయుడు 2’ విడుదలయ్యింది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు’.. 1996లో విడుదలయ్యింది. అప్పట్లోనే ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇన్నాళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ వస్తుంది అని ప్రకటించినప్పుడు కూడా ప్రేక్షకుల్లో దీనిపై పాజిటివ్ అభిప్రాయమే ఉంది. కానీ షూటింగ్ మొదలయినప్పటి నుండి ‘భారతీయుడు 2’కు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. దీంతో ఆడియన్స్‌లో కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఫైనల్‌గా మూవీ విడుదలయ్యి డిజాస్టర్ టాక్ అందుకుంది.
Also Read: చైతూ, శోభితాపై కామెంట్స్ - వేణు స్వామికి మంచు విష్ణు వార్నింగ్? పోలీసు కేసు నమోదు