Prema Entha Madhuram  Serial Today Episode: రాజనందిని ఫోటో కింద పడిపోతుంది. ఫోటో కింద పడిన సౌండ్‌కు అందరూ ఆ రూంలోకి వెళ్తారు. శంకర్ ఫోటో తీసి యథా స్థితిలో పెడతాడు. సడెన్‌ గా ఫోటో కింద పడటం ఏంటని అందరూ అనుమానిస్తారు. ఇంతలో అకి కాలికి అద్దం గుచ్చుకుంటుంది. అందరూ కంగారు పడతారు. రవి అకిని తీసుకెళ్తాడు. శంకర్‌, యాదగిరి ఆలోచిస్తుంటారు.


శంకర్: బాబాయ్‌ ఏమైంది..?


యాదగిరి: ఏం లేదు సార్‌ ఇంట్లో చనిపోయిన వాళ్ల ఫోటోలు ఇలా కింద పడి పగిలి పోవడం దేనికో హెచ్చరిక అంటుంటారు. అంటే వాళ్లు ఏ విషయం గురించో జాగ్రత్త అని చెప్తుంటారు. పైగా రాజనందిని గారి ఫోటో కింద పడటం అంటే టెన్షన్‌ గా అనిపిస్తుంది.


శంకర్‌: నువ్వు చెప్తుంది నిజమే బాబాయ్‌ ఆ ఫోటో చూస్తున్నంత సేపు నాకేదో మెసేజ్‌ ఇస్తున్నట్టుగా అనిపించింది. ఏదో తెలియని పీలింగ్‌ కలిగింది. అదేంటో తెలియడం లేదు.


పనిమనిషి: అంటే నేను అకి మేడంకు ప్రమాదం తలపెట్టాలనుకున్నందుకే నాకు ఇలా జరిగేలా చేసిందా..? అమ్మో నాకేదో భయంగా ఉంది.


యాదగిరి: ఏమ్మా వెళ్లి గాయానికి పసుపు రాసుకోమంటే.. మేము మాట్లాడుకునేది వింటున్నావేంటి..?


పనిమనిషి: ఏం లేదు సార్‌..


అంటూ వెళ్లిపోతుంది. శంకర్, యాదగిరి ఆలోచిస్తుంటారు.  మరోవైపు అకి కోసం తీసుకొస్తున్న స్వీట్లలో రాకేస్‌ పాయిజన్ కలుపుతాడు. అవి తీసుకుని డెలివరీ బాయ్‌ వెళ్లిపోతాడు.


రాకేష్‌: స్వీట్స్ కావాలా అకి నీకు స్పెషల్ స్వీట్స్‌ పంపిస్తున్నాను తిని ఎంజాయ్‌ చేయ్‌.  వర్ధన్‌ వంశ నాశనం ఈరోజుతో మొదలవుతుంది.


అనుకుంటూ వెళ్లిపోతాడు. మరోవైపు యాదగిరి ఎవరితోనే పోన్‌ మాట్లాడుతుంటాడు.


యాదగిరి: లేదు సత్యం నాకు ఒక మూడు రోజులు ఫ్యాక్టరీకి రావడానికి వీలు పడదు. అక్కడ పనులన్నీ నువ్వు కాస్త చూస్తూ ఉండు. అది చెబుదామనే ఫోన్‌ చేశాను. ఉంటాను.


ఇంతలో ఇంటి మీద గద్ద తిరుగుతుంది. యాదగిరి భయపడుతాడు. ఇంతలో శంకర్‌ వస్తాడు.


శంకర్‌: బాబాయ్‌ కారు ఏదో బాగు చేయించాలి అన్నావుగా పద వెళ్దాం. ఏంటి బాబాయ్‌ అలా చూస్తున్నావు.


యాదగిరి: ఇంటి పైన గద్ద తిరుగుతుంది సార్‌. అలా తిరగడం మంచిది కాదు సార్‌ అదే చూస్తున్నాను.


శంకర్‌: నాకు కూడా మనసంతా ఏదో అలజడిగా ఉంది బాబాయ్‌. లోపల ఫోటో పగలడం. అకికి దెబ్బ తగలడం.. ఇక్కడ గద్ద తిరగడం ఇదంతా చూస్తుంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అని కంగారుగా ఉంది.


యాదగిరి: సార్‌ గౌరి మేడం వాళ్లు ఎలా ఉన్నారో ఏంటో..?


శంకర్‌: వాళ్లు వాళ్ల బాబాయ్‌ దగ్గర సేఫ్‌గానే ఉంటారు బాబాయ్‌. ఇక మాయ సంగతి అంటావా..? రాకేష్‌ దగ్గర ఇష్టం లేకుండా ఉన్నా బాగానే ఉంటుంది. ఇక్కడ అందరం బాగానే ఉన్నాం కదా..? అయినా సరే ఏదో డిస్టర్బ్‌ గా అనిపిస్తుంది.


యాదగిరి: సార్‌ ఈ ఒక్క రోజు ఇంట్లోనే ఉందాం సార్‌..


శంకర్‌: సరే నీ మాట ఎందుకు కాదనాలి..


అంటూ ఇద్దరూ లోపలికి వెళ్తుంటే.. స్వీట్స్‌ తీసుకుని డెలివరీ బాయ్‌ వస్తాడు. ఆ దెబ్బలు ఏంటి అని అడిగితే వస్తుంటే చిన్న యాక్సిడెంట్‌ అయిందని బాయ్‌ చెప్తాడు. స్వీట్స్‌ తీసుకుని లోపలికి వెళ్తారు. రాకేష్‌, పని మనిషికి ఫోన్‌ చేసి నిజం చెప్తాడు. మరోవైపు రాకేష్‌కు శంకర్‌ స్పాట్‌ పెడతాడు. అందుకోసం ఒక పవర్‌ ఫుల్‌ ఎస్సైని రంగంలోకి దించుతాడు. దీంతో రాకేష్‌,శర్మ వాళ్లు ఉన్న ఇంటికి ఎస్సై వెళ్తుంది. రాకేష్‌ అక్కడి నుంచి పారిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


   


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!