Prema Entha Madhuram Serial Today April 16th: పని చేస్తున్న ఫ్యాక్టరీని అర్ధాంతరంగా అజయ్ వర్ధన్ ఇంటి బయట కార్మికులు సమ్మె చేస్తుంటారు. అసహనంగా ఉన్న అజయ్ వాళ్ళని క్లియర్ చేయమంటాడు. చాలామంది యూనియన్ కూడా వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు సిట్యువేషన్ అసలు ఏమీ బాలేదు అని తన కింద పనిచేసేవాళ్ళు అజయ్ కి చెబుతారు. ఈ లోపు మా కంపెనీ వర్కర్స్ కూడా మీ కార్మికులతో పాటు జాయిన్ అవుతామని అంటున్నారు సార్ అని అంటూ ఇతర కంపెనీల అధినేతలు కాల్ చేస్తుంటారు.. దీంతో అజయ్ పోలీసులను పిలుస్తాడు.
పోలీసులు వచ్చిసమ్మెను విరమించుకోమని ఆర్య కి చెబుతారు. అయితే . ఓ పారిశ్రామికవేత్తగా కార్మికుల యొక్క కష్టాలను తెలుసు కాబట్టి వాళ్లకి మద్దతుగా నిలిచిచానంటాడు ఆర్య. శాంతియుతంగా అంతా జరుగుతోంది అంటూ పోలీసులు చేతులు ఎత్తేయడంతో దీంతో అజయ్ తన మనుషులతో పోలీసులను కొట్టించి లాఠీ ఛార్జ్ జరిగేలా చేస్తాడు.
ఆర్య వాళ్ళందరినీ అడ్డుకొని గట్టిగా సపోర్టుగా నిలబడతాడు ఆర్య కి చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకొని వాళ్ల పక్కనే నిలబడి వాళ్లతో పాటు ఉంటూ కార్మికుల యొక్క ఐక్యత వర్ధిల్లాలని చెప్పి దెబ్బల తరువాత కూడా సమ్మె కొనసాగిస్తారు. అజయ్ ఈ పరిస్థిని మరింత తీవ్రం చేయటానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు అను బాధ పడుతుంది. అజయ్ ఈ సారి ఎవరినైనా చంపి ఈ గొడవ పెద్దది చేద్దాం అనే ఆలోచనలో ఉంటాడు. పోలీసులకి కావలసినంత డబ్బు సీతానని మభ్య పెడతాడు.
ఇంతలో అక్కడ ఉన్న ఎస్పికి పరిశ్రమల మంత్రి నుంచి ఫోన్ వస్తుంది. సమ్మె వేగంగా ఆపించమని లేదంటే తాను రంగంలోకి దిగాల్సివస్తుంది అంటాడు. అయితే ఇక్కడ సమ్మె చిన్న విషయం కాదు ఆర్య వర్ధన్ వీరందరికీ అండగా ఉన్నారు అని ఎస్పీ మంత్రికి చెప్తాడు. దీంతో సమ్మె ఆగకపోతే తాను కూడా వచ్చి ఆర్యవర్ధనకే సపోర్ట్ చేయాల్సి వస్తుందని మంత్రి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. విషయం అజయ్ కి చెబుతాడు ఎస్పి. ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోమంతాడు. అందరూ సమస్యనుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుండగా అను వచ్చిఒక సలహా ఇస్తుంది . కార్మికులకు ఉద్యోగం ఇస్తాను అంటూనే ఒక కండిషన్ పెట్టమంటుంది. బయటకు వచ్చిన అజయ్ అందరినీ ఉద్యోగంలో చేర్చుకుంటానని కానీ ఓ కండిషన్ అంటూ 15 రోజుల్లోగా ఆ కాంట్రాక్ట్ ని పూర్తి చేయాలని చెబుతాడు... లేకపోతే మన ఒప్పందాన్ని రద్దు అయిపోతుందని వార్నింగ్ ఇస్తాడు. ఇందుకు కార్మికులేవరూ ఒప్పుకోకపోయినా ఆర్య వర్ధన్ వాళ్ళని ఒప్పించేలా చేస్తాడు.. అజయ్ వర్ధన్ చెప్పడంతో అందరూ అక్కడ సమ్మెను విరమించుకొని యాదగిరి సంతకం చేయించి సమ్మె ని విరమించుకుంటారు. అయితే ఆర్య వర్ధన్ బలం ఈ జనమే అని తెలుసుకున్న అజయ్ ఆ జనం నుంచి , వారి నమ్మకం నుంచి ఆర్యని దూరం చేసి తీరతాను అని పంతం పడతాడు.
ఆర్య వర్ధన్ ఇంటికి దెబ్బలతో వస్తాడు. ఆ దెబ్బలను చూసి అందరూ ఏమైంది? ఏమైంది ఏమైంది అని అడుగుతారు. కారణం అనుకి మాత్రం తెలుసు.. కానీ చెప్పుకోలేక మానసికంగా ఎంతో ఆవేదన చెందుతూనే ఆర్య దెబ్బలకు మందులు రాసేందుకు అన్ని సిద్ధం చేస్తుంది.