సీరియల్స్ లైఫ్ టైం ఇటీవల తగ్గింది. కొన్ని సీరియళ్లు 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న తర్వాత ముగించేస్తున్నారు. అటువంటిది ఒక సీరియల్ 5 ఏళ్ల పాటు సాగిందంటే వీక్షకుల ఆదరణ దానికి ఏ స్థాయిలో లభించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల నుంచి సాగిన, 1500కు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఒక ధారావాహికకు జీ తెలుగు శుభం కార్డు పలుకుతోంది.
ప్రేమ ఎంత మధురం...ఇటీవల క్లైమాక్స్ షూటింగ్ పూర్తి!శ్రీరామ్ వెంకట్ (Sriram Venkat) కథానాయకుడిగా నటించడంతో పాటు సౌత్ ఇండియా స్క్రీన్స్ సంస్థ మీద నిర్మించిన సీరియల్ 'ప్రేమ ఎంత మధురం' (Prema Entha Madhuram Serial). ఇందులో కన్నడ అమ్మాయి వర్ష హెచ్.కె (Varsha HK) ఫిమేల్ లీడ్. కళ్యాణ్, దివ్య, రామ్ జగన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సీరియల్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలో ఎండ్ కార్డు వేయనున్నారు.
20 ఏళ్ల అమ్మాయి... మిడిల్ ఏజ్డ్ మనిషి...పునర్జన్మల నేపథ్యంలో సరికొత్త ప్రేమ కథ!ఐదేళ్ల పాటు 1500 ఎపిసోడ్లు తీయడం అంటే మామూలు మాటలు కాదు. అసలు ఈ సీరియల్ కథ ఏమిటి? ఏముందని ఇన్ని రోజులు ప్రేక్షకులు చూశారు? అంటే... 20 ఏళ్ల అమ్మాయితో ఒక మిడిల్ ఏజ్డ్ వ్యాపారవేత్త ప్రేమలో పడతాడు. ఇదీ క్లుప్తంగా 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ కథ. పునర్జన్మల నేపథ్యంలో తీసిన సరి కొత్త సీరియల్. ఆ అమ్మాయితో ప్రేమలో పడడానికి ఒక కారణం ఉంటుంది. పలు ట్విస్టులు, టర్నులతో సీరియల్ ముందుకు సాగింది. అను ఆర్యల ప్రేమ కథ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ వారాంతంలో లేదంటే ఏప్రిల్ మొదటి వారం చివరిలో సీరియల్ శుభం కార్డు వేస్తారని సమాచారం.
Also Read: ప్రేరణ - శ్రీపాద్ జోడీ కప్పు కొట్టింది... బిగ్ బాస్ ట్రోఫీ మిస్ అయ్యింది కానీ ఈసారి విన్నరే