Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode: విహారిని సెల్‌లో వేయడమేగాక...ఎస్ఐ  విచక్షణరహితంగా  లాఠీతో కొడతాడు. మరోవైపు ఇంట్లో  సహస్ర  లక్ష్మీపై మండిపడుతుంది. నువ్వు ఇంట్లో అడుగుపెట్టగానే  అందరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.....ఆఫీసులో అడుగుపెట్టగానే ఇప్పుడు విహారీ జైలుపాలయ్యాడని  తిడుతుంది. ఇదంతా ఆమె కాలుపెట్టిన ప్రభావమేనని అంబిక కూడా తిడుతుంది. సమర్థించబోయిన  విహారి తల్లిని కూడా కలిపి  తిడతారు. వెంటనే కంపెనీ లాయర్‌తో మాట్లాడమని చెబుతారు. దీంతో  లక్ష్మీ కంపెనీ లాయర్‌కు ఫోన్ చేస్తుంది. మీరు వెంటనే బెయిల్‌ తీసుకుని  పోలీసుస్టేషన్‌కు రావాలని కోరుతుంది. తాను ఢిల్లీలో ఉన్నానని  చెబుతాడు. ఇదంతా  అంబికా ముందుగానే  ప్లాన్‌ చేసి కంపెనీ లాయర్‌ను డబ్బులిచ్చి కొనేస్తుంది. ఇంతలో  సహస్ర తల్లి తనకు  తెలిసిన లాయర్‌ను పిలిపిస్తుంది. వెంటనే స్టేషన్‌కు వెళ్లి బెయిల్‌పై విహారని బయటకు తీసుకొచ్చేందుకు  అందరూ కలిసి బయలుదేరతారు.
 
ఈలోగా పోలీసులు విహారిని ఓ చీకటి గదిలో బంధించి టార్చర్ చేస్తుంటారు. బెయిల్ పేపర్లు తీసుకుని లాయర్‌తోపాటు సహస్ర, వాళ్ల అమ్మ, లక్ష్మీ స్టేషన్‌కు వస్తారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా టాప్‌ బిజినెస్‌మేన్‌ను  ఎలా అరెస్ట్ చేస్తారని లాయర్‌ సీఐని నిలదీస్తాడు. కోర్టులో దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని లాయర్ బెదిరిస్తాడు. దీంతో సీఐ తాము అసలు విహారిని అరెస్ట్ చేయలేదని...మా ఎస్‌ఐ లీవ్‌లో ఉన్నాడని చెబుతాడు. దీంతో ఆందరూ షాక్‌ అవుతారు. తాము ఎవరినీ కస్టడీలోకి తీసుకుని విచారించలేదని చెబుతాడు. మీ ఇంటికి వచ్చింది నిజమైన పోలీసులేనా  లేకపోతే ఎవరైనా ఫేక్‌ పోలీసులు వచ్చారా అంటూ సీఐ ప్రశ్నిస్తాడు.  మీ శత్రువులు  ఎవరైనా  ప్లాన్  చేసి తీసుకెళ్లి ఉంటారని చెబుతాడు. మీ పోలీసులే కుట్ర చేస్తున్నారని లక్ష్మీ అనడంతో సీఐ మండిపడతాడు. కావాలంటే కంప్లైంట్ ఇస్తే  కేసు నమోదు చేస్తామని చెప్పడంతో లక్ష్మీని వదిలేసి వాళ్లంతా వెళ్లిపోతారు.
సీఐ మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో లక్ష్మీ అక్కడే ఉండి ఈ కుట్రను చేధించాలని అనుకుంటుంది. అక్కడ అందరినీ అడుగుతుంది. విహారి ఫొటో చూపించి వేడుకుంటుంది. పోలీసులే తన భర్తను తీసుకొచ్చి హింసిస్తున్నారని. దీనివెనక ఎవరో కుట్రపన్నుతున్నారని....ఆ కుట్రను చేధించి  విహారీని తీసుకుని వెళ్లాలని గట్టిగా  నిర్ణయించుకుంటుంది.మరోవైపు పోలీసు కస్టడీలో విహారని పోలీసులు టార్చర్ పెడుతుంటారు. ఈలోగా అంబికా సీఐకి ఫోన్‌ చేసి విహారీని వీలైనంత త్వరగా ఎన్‌కౌంట్ చేయాలని కోరుతుంది. పగటిపూట ఎన్‌కౌంటర్ చేయడం కుదరదని...రాత్రి వరకు ఆగాలని చెబుతాడు. లక్ష్మీ మాత్రం అక్కడే ఉండి అందరిని ఆడుగుతుంది. పోలీసులు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో...లక్ష్మీ స్టేషన్‌లో  విహారీగారు...విహారీగారు అంటూ గట్టిగా కేకలు వేస్తుంది.ఆ మాటలు విహారికి వినిపిస్తాయి. అటు నుంచి విహారీ కూడా కనకం అంటూ గట్టిగా అరుస్తాడు. ఈ మాటలు లక్ష్మీ చెవినపడతాయి. ఆమె గొడవ చేయడంతో  లక్ష్మీని పోలీసులు బయటకు నెట్టివేస్తారు. అటు విహారి జాడ తెలియక కుటుంబ సభ్యులంతా బాధపడుతుంటారు. ఆలస్యం చేసే కొద్దీ ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని బయపడుతుండటంతో 
ఈరోజుఎపిసోడ్ ముగిసిపోతుంది.