Podharillu Serial Today Episode: చక్రి, మహాలక్ష్మీతోపాటు కుటుంబాన్ని తీసుకుని రిసార్ట్‌కు వస్తాడు. అక్కడికి  వచ్చిన తర్వాత చక్రి పీజులు ఎగిరిపోతాయి. రిసార్ట్‌ అంటే ఏదో చిన్నది అనుకున్నాను కానీ...ఇంత పెద్దగా ఉందేంటని అనుకుంటాడు. ఇక్కడ ఉండాలంటే రోజుకు ఎంత అవుతుందేమోననని భయపడిపోతుంటాడు. ఇంతలో కేశవ్‌ కల్పించుకుని ఏంటిరా చూస్తున్నావు...వెళ్లి రూమ్‌లు బుక్‌చేయమని అంటాడు. మహా అయితే రోజుకు పాతికవేలు అవుతుందిఅంతేగా అని అంటాడు. ఆ మాటలు విన్న చక్రికి ఏం చేయాలో అర్థంగాక అయోమయంలో ఉంటాడు.ఇంతలో మహా కల్పించుకుని ఆమాత్రం ఇవ్వలేడనుకున్నావా...వెళ్లేప్పుడు టిప్పుగా మరో 5వేలు ఎక్స్‌ట్రా కూడా ఇస్తాడని అంటుంది. చక్రి భయపడుతుంటే...మాధవ్‌ వాళ్లకు తెలియకుండా తన దగ్గర ఉన్న డ‌బ్బులు చక్రికి ఇచ్చి రూమ్‌లు తీసుకోమని చెప్పి పంపిస్తాడు.                      అదే రిసార్ట్‌కు అంతకన్నా ముందే మహాలక్ష్మీ తండ్రి కుటుంబంతో సహా వస్తుంది.అక్కడికి వచ్చిన తర్వాత  కూడా ప్రతాప్‌ మహా గురించే ఆలోచిస్తుంటాడు. నీ మనసు బాగాలేదనే కదా ఇక్కడికి తీసుకొచ్చానని ఇప్పుడు కూడా నువ్వు బాధపడుతుంటే అర్థం లేదని ఆదిఅంటాడు. మనల్ని వద్దనుకుని వెళ్లిపోయిన దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలని అంటాడు. తెలిసినవాళ్లు,తెలియని వాళ్లంతా నీ కూతురు  లేచిపోయిందంట కదా అని అడుగుతుంటే...తట్టుకోలేకపోతున్నానని ప్రతాప్‌ అంటాడు. అందుకే కదా దాని గాలి కూడా సోకనంత దూరంగా ఈ రిసార్ట్‌కు వచ్చామని ఇక్కడ హాయిగా నువ్వు రెస్ట్‌ తీసుకోమని తండ్రికి ఆది చెబుతాడు.                      మహా కన్నాతోపాటు అందరితోనూ  ఫొటోలు దిగుతూ...తనను మాత్రం కనీసం పక్కకు కూడా రానివ్వకపోవడంతో చక్రి బాధపడుతుంటాడు.ఇంతలో రూమ్‌తీసుకోవడానికి వెళ్లగా...అక్కడ ఆధార్‌కార్డు అడగడంతో ఇదే మంచిఛాన్స్‌ అనుకుని మహా దగ్గరకు వెళ్లి ఆధార్‌కార్డు లేకుండా నీకు రూమ్‌ ఇవ్వడం కుదరదంటున్నారని చెబుతాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని అంటే....మనమిద్దరం భార్యాభర్తలమని చెబితే నా పేరుమీద రూమ్‌ ఇస్తారంటా అని అంటాడు. అలా అని వాళ్లకు రుజువు చూపించాలని చెబుతాడు. కాబట్టి మీరు నాతో భార్యగా ఫొటో దిగితే అది చూపించి రూమ్ తీసుకుంటానని అంటాడు. ఇదంతా నీ ప్లాన్‌ కదా అన్నయ్య అని కన్నా అంటాడు. నువ్వు నోరుమూసుకుని ఉండరా అనిచెప్పి మహాతో ఫొటోలు తీయించుకుంటాడు. నువ్వు నాతోనే ఫొటోలు దిగకపోతే నా ప్లాన్స్‌ నాకు ఉంటాయని చక్రి అనుకుంటాడు.

Continues below advertisement

                      రూమ్‌కు వెళ్లి అందరూ ఫ్రెష్‌ అయిన తర్వాత తినడానికి రెస్టారెంట్‌కు వస్తారు.అప్పటికే అక్కడ ప్రతాప్‌ వాళ్లు తినడానికి కూర్చుని ఉంటారు. భోజనం ఆర్డర్ ఇచ్చినా...నారాయణ తినకపోవడం చూసి మహా అడుగుతుంది.నేను మందు తాగకుండా అన్నం తినలేనని చెప్పడంతో....వెళ్లి రెండు  పెగ్‌లు వేసి రమ్మని పర్మిషన్ ఇవ్వడంతో సంతోషంగా వెళ్లిపోతాడు. ప్రతాప్‌ కూడా  మహా జ్ఞాపకాలతో బాధపడుతుండగా...ఆది పక్కనే బార్‌ ఉందని వెళ్లిరమ్మని చెప్పి పంపిస్తాడు.నారాయణ అప్పటికే బ్రాందీ ఆర్డర్ ఇచ్చి తాగడానికి కూర్చుంటాడు. ప్రతాప్‌ కూడా వచ్చి బ్రాందీ  ఆర్డరివ్వగా...స్టాక్‌ లేదని బాయ్ చెబుతాడు. ప్రతాప్‌ లేచి వెళ్లబోతుండగా నారాయణ  ఆపి...నా దగ్గర ఫుల్‌ బాటిల్‌ ఉందని నేను అంత తాగితే నా కోడలు ఒప్పుకోదని మీరు కొంచెం తీసుకోండని చెప్పి ఇస్తాడు. ఇద్దరూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటారు.

ప్రతాప్ సిగార్‌ కాల్చుకోవడానికి నారాయణ అగ్గిపెట్టె ఇస్తే బదులుగా  నారాయణకు ప్రతాప్ సిగార్ ఇస్తాడు. పైగా మందుకు డబ్బులు కట్టడానికి ప్రతాప్ చూడగా....ఇవాళ నేను కడతానని రేపు మీరు ఇవ్వండని చెప్పి పంపిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆది దూరం నుంచి చూసి తండ్రితో  ఎవరు నాన్న అతను అని అడగ్గా...ఇక్కడే కలిశాడని మంచిచెడ్డలు మాట్లాడుకున్నామని చెబుతాడు. ఎవరైతే ఏం అని మిమ్మల్ని సంతోషపెట్టాడని చెబుతాడు. మీ ముఖంలో నవ్వుచూసి చాలారోజులు అయ్యిందని అంటాడు.

Continues below advertisement