Podharillu Serial Today Episode: ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి అన్నీ సర్దుకుని రెడీ అయిన మహా...కన్నా కాలేజీకి వెళ్లేవరకు ఆగి వెళ్తానని చెబుతుంది. పరీక్షలు రాయడానికి వెళ్తూ కన్నా మహాలక్ష్మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. సాయంత్రం వచ్చేప్పుడు నీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ తీసుకుని వస్తానని చెప్పి వెళ్తాడు. సాయంత్రం నువ్వు వచ్చేసరికి నేను ఉండనని తెలిసి ఎంత బాధపడతాడోనని మహా అనుకుంటుంది. కేశవ్‌, కన్నా బయటకు వెళ్లిపోవడంతో  మహా బయలుదేరుతుంది.
 
చక్రి వచ్చి నిన్ను దిగబెట్టి వస్తాడని మాధవ్‌ చెప్పడంతో మహా సరేనంటుంది. ఇద్దరూ కలిసి బైక్‌పై  కొత్త ఇంటికి బయలుదేరతారు. మార్గమధ్యలో చక్రి అసలు ఏం బాధపడుకుంటా పాటలు పాడుకుంటూ జాలీమూడ్‌లో ఉండటం చూసి మహాకు అనుమానం వస్తుంది. ఖచ్చితంగా  ఎవరో చెప్పినట్లు  చక్రి ఆమె అద్దెకు రూమ్‌ తీసుకున్న వీధిలోకి వచ్చి బైక్‌ ఆపుతాడు. దీంతో మహా చక్రిని నిలదీస్తుంది. నీకు నేను ఈ వీధిలోనే రూమ్‌ తీసుకున్నట్లు ఎలా తెలుసని అడగుుతుంది. దీంతో దొరికిపోయానేమోనని  చక్రి భయపడతాడు. వెంటనే తేరుకుని మీరే కదా వాటర్‌ ట్యాంక్ పక్కలైన్‌ అని చెప్పారు. అందుకే తీసుకొచ్చానని చెప్పి తప్పించుకుంటాడు. అయినా కానీ మహాలక్ష్మీ అనుమానం అలాగే ఉంటుంది. ఇక నువ్వు వెళ్లు అని చెబుతుంది. సరేనని చక్రి అంటాడు. మళ్లీ దగ్గరకు  వస్తుంది. ఏంటని అడిగితే...ఏం లేదు నువ్వు నాకోసం చాలా చేశావు కదా థ్యాంక్స్‌ చెబుదామని వచ్చాను అంటుంది. అయినా నువ్వు ఎవరో నేను ఎవరో అన్నారు కదా...ఇక ఈ  థ్యాంక్స్‌ అన్నీ ఎందుకు అని అంటాడు. దీంతో కోపంతో మహా వెళ్లిపోతుంది.
 
మహా వెళ్లిపోయినా  తిరిగి మళ్లీ ఇక్కడికే రావాలి కదా అన్నట్లు చక్రి అక్కడే ఉండి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు. నేరుగా  అద్దె ఇంటికి వెళ్లి మహా బెల్‌ కొట్టగానే ఓనర్‌ వస్తాడు. నీకు రూమ్ అద్దెకు ఇవ్వడం లేదని చెబుతాడు. అదేంటి నిన్న టోకెన్ ఎమౌంట్‌  కూడా తీసుకున్నారు కదా అని అడిగితే....మాఆవిడ వాళ్ల బంధువులు ఎవరో వస్తున్నారంటా వాళ్లకి ఇచ్చేసింది కాబట్టి నీకు ఇవ్వడం కుదరదని చెబుతాడు.  ఆమాటలకు మహా షాక్‌ తింటుంది. నిన్ను నమ్ముకుని అన్నీ సర్దుకుని వచ్చేశానని ఇప్పుడు ఏం చేయనని అడుగుతుంది. అవన్నీ నాకు తెలియదమ్మా....ఒంటరి మహిళకు రూమ్ ఇవ్వొద్దని మా ఆవిడ చెప్పిందంటాడు. నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తానని ఇస్తాడు. ఆమాటలకు మహాకు మరింత కోపం వస్తుంది. వాడిని చెడామడా తిట్టి బయటకు వచ్చేస్తుంది.
మహా కోసం రోడ్డుమీదే చక్రి ఎదురుచూస్తూ  ఉంటాడు. చక్రి ఇంకా వెళ్లకపోవడంతో మహా అనుమానం మరింత బలపడుతుంది. దగ్గరకు వచ్చిన మహాను ఏంటి మళ్లీ తిరిగి వచ్చావని చక్రి అడుగుతాడు. ఓనర్‌ రూమ్ ఇవ్వనన్నాడని అంటుంది. అక్కడ జరిగిన విషయం చెబుతుంది. నాకు నీమీదే అనుమానం ఉందని...ఉదయం నుంచి నువ్వు చాలా జాలీగా పాటలుపాడుతూ ఉన్నావని...సరిగ్గా నేను చెప్పకుండానే ఈ వీధిలోకి తీసుకొచ్చి బైక్‌ ఆపావని అంటుంది. ఆ ఇంటి యజమానినే నువ్వే బెదిరించి ఉంటావని అంటుంది. దీంతో చక్రిలో కంగారు మొదలవుతుంది.
 
అసలు నాకు ఆ ఓనర్‌ ఎవడో కూడా తెలియదని అంటాడు. మీరు ఇక్కడ రూమ్ తీసుకున్నారని చెప్పారు కానీ....ఏ  ఇల్లు  చెప్పలేదు కదా. మరి నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. అయినా మీరు వెళ్లిపోతుంటే నేను ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తానని అంటాడు. అయితే ఆ ఇంటి యజమాని దగ్గరే తేల్చుకుందాం పదా అని తీసుకెళ్తాడు. వాడు వీళ్లిద్దరినీ చూసి మరింత భయపడతాడు. రూమ్ ఎందుకు ఇవ్వలేదని చక్రి గట్టిగా నిలదీయడంతో నువ్వే వద్దన్నావ్‌ కదా అని చెప్పబోగా....చక్రి చొక్కాపట్టుకుని మళ్లీ బెదిరిస్తాడు. దీంతో నా ఇల్లు నా ఇష్టం అని వాళ్లిద్దరినీ అక్కడి నుంచి పంపిస్తాడు. దీంతో చేసేదిలేక మహా మళ్లీ చక్రి బైక్‌ ఎక్కి వాళ్ల ఇంటికే బయలుదేరి వెళ్తుంది.
 
చక్రి, మహా సూటుకేస్‌తో  బైక్‌పై వెళ్లడం చూసిన  కేశవ్‌ షాప్‌లోని కుర్రాడు...కేశవ్‌కు విషయం చెప్పడంతో కన్నాను తీసుకుని ఇంటికి వచ్చి మాధవ్‌ను నిలదీస్తారు. వదిన ఎక్కడికి వెళ్లిందని కన్నా గట్టిగా అడుగుతాడు. వదిన నిజంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందా అని అడుగుతారు. ఇక నిజం చెప్పక తప్పదని మాధవ్‌ వాళ్లకు నిజం చెప్పేలోగా...చక్రి మహాను తీసుకుని వస్తాడు. ఎక్కడికి వెళ్లారని అడిగితే...వదిన బట్టలు  ఇస్త్రీ చేయించడానికి  తీసుకెళ్లామని అబద్ధం చెబుతాడు. దీంతో వాళ్లు నిజమేనని నమ్మి వెళ్లిపోతారు. ఏం జరిగిందని మాధవ్‌ చక్రిని అడగ్గా....ఆ ఇంటి యజమాని రూమ్ ఇవ్వనని అడ్డం తిరిగాడని చెబుతాడు. దీంతో మహా మాధవ్‌కు సారీ చెబుతుంది. మీరు వద్దన్నా వెళ్లానని చెప్పడంతో....ఇది నీ ఇల్లు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చు. తిరిగి వెళ్లొచ్చని మాధవ్‌ ఆమెకు భరోసా ఇస్తాడు.