Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ఫస్ట్‌నైట్‌రోజు మ్యాడీకి దగ్గరవ్వాలని శ్రీలక్ష్మీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే మ్యాడీ ఏమాత్రం తనకు లొంగకుండా దూరంగా జరిగిపడుకుంటాడు.లక్ష్మీమాత్రం అతన్నే చూస్తూ పడుకోవడంతో ఇబ్బందిగా ఫీల్‌ అయిన మ్యాడీ...నా బెడ్‌మీద నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. ఇది ఇప్పుడు నీ ఒక్కరి బెడ్‌ కాదని...మన ఇద్దరిదని లక్ష్మీ చెప్పడంతో మ్యాడీ కిందకు వెళ్లి పడుకుంటాడు.  దీంతో శ్రీలక్ష్మీ కూడా నేలపై అతని పక్కనే పడుకుంటుంది. మళ్లీ ఎందుకు వచ్చావని అడిగితే....మీరు కిందపడుకుంటే నేను పైన ఎలా పడుకుంటానని చెబుతుంది. కావాలంటే మీరే బెడ్‌మీద పడుకోండని...నేను కిందనే పడుకుంటానని చెప్పి పంపిస్తుంది. కానీ మ్యాడీ, శ్రీలక్ష్మీ ఫస్ట్‌నైట్ జరిగిపోయిందని సింధూజాక్షి, ప్రియంవద కలగని కంగారుపడతారు. 
 
ఉదయం అందరికన్నా ముందే సింధూజాక్షి, ప్రియంవద ఇద్దరూ కలిసి మ్యాడీ రూమ్ ముంందు తచ్చటలాడుతుంటారు. లోపల ఏం జరిగి ఉంటుందోనని కంగారుపడుతుంటారు. ఆ శ్రీలక్ష్మీ ఖచ్చితంగా మ్యాడీని లొంగదీసుకుని ఉంటుందని అనుకుంటారు. అందరికన్నా ముందే తెల్లవారుజామునే నిద్రలేచి అందరికీ టీ పెట్టించే లక్ష్మీ ఇంకా లోపలి నుంచి బయటకు రాలేదేంటని అనుకుంటుంటారు. ఈమాటలన్నీ తలుపు సందులో నుంచి విన్న శ్రీలక్ష్మీ....వీళ్లను ఓ ఆట ఆడిద్దామనుకుంటుంది.
తల్లోపూలు చెరుపుకుని బొట్టుతుడుచుకుని గది అంతా గందరగోళం చేసి సిగ్గుపడుతూ బయటకు వస్తుంది. దాని  వాలకం చూసి నిజంగానే ఫస్ట్‌నైట్‌ అయిపోయిందని వీళ్లిద్దరూ భ్రమపడతారు. వెంటనే వెళ్లి మ్యాడీని నిద్రలేపుతారు. రాత్రి ఏం జరిగిందని అడుగుతారు. అసలు ఏం జరగలేదని చెబుతాడు. నిజం చెప్పు...ఆ శ్రీలక్ష్మీ సిగ్గుపడటం చూస్తే, రాత్రి ఏదో జరిగిపోయినట్లే ఉందని ప్రియంవద అంటుంది. నిజంగా మీరు అనుకున్నట్లు ఏం జరగలేదని...నేను బెడ్‌పై పడుకుంటే అది కిందపడుకుందని చెబుతాడు. అయితే ఆ శ్రీలక్ష్మీ కావాలనే ఇలా చేసిందని అనుకుంటారు. నువ్వు మాత్రం దాని మాయలోపడొద్దని చెబుతారు. ఇప్పటి వరకు నువ్వు ఒక్కదానివి కాబట్టే ఆ శ్రీలక్ష్మీని బయటకు పంపించలేకపోయామని...ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి దాన్ని ఎలాగైనా బయటకు పంపిద్దామని సింధూజాక్షి చెబుతుంది.
 
గోపి, సింధూజాక్షి ఇద్దరూ లాయర్‌ను కలవడానికి ప్రియంవద అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భర్తను తీసుకుని బయటకు వెళ్లడానికి సింధూ బయలుదేరగా...శ్రీలక్ష్మీ ఎక్కడికి అని అడుగుతుంది. మీ అన్నయ్యకు సిటీ చూపించి తీసుకొస్తానని చెబుతుంది. అయితే డ్రైవర్‌ను ఇచ్చి పంపుతానని సూర్యనారాయణ అనగా....మేం సరదాగా అలా తిరిగి వద్దామనుకుంటున్నామని...డ్రైవర్‌ అవసరం లేదని చెబుతారు. సరేనని అనడంతో వాళ్లిద్దరూ లాయర్‌ను కలవడానికి వెళ్తారు. మ్యాడీ, శ్రీలక్ష్మీ కూడా కాలేజీకి బయలుదేరి వెళ్తారు. మ్యాడీ లక్ష్మీని బస్టాండ్‌లో దింపి వెళ్లిపోతాడు. అప్పుడే గోపీ, సింధూజాక్షి లాయర్‌ను కలిసి మాట్లాడటం శ్రీలక్ష్మీ చూస్తుంది.