Podharillu Serial Today Episode: శైలు ఫోన్ ఇంట్లో మరిచిపోయి వెళ్లిన కేశవ్ మళ్లీ అది తీసుకోవడానికి ఇంటికి వస్తాడు. మహాలక్ష్మీ ఫోన్ పక్కనే ఉండటంతో కేశవ్‌కు అనుమానం వస్తుంది. వెంటనే ఫోన్ తీసుకుని బయటకు వచ్చి చెక్ చేస్తాడు. అప్పటికే కన్నా,మహాలక్ష్మీ శైలు చేసిన ఫోన్ కాల్‌లిస్ట్ డిలీట్ చేస్తారు. ఎందుకైనా మంచిదని మళ్లీ శైలుకి ఫోన్ చేసి కేశవ్ అడుగుతాడు. నువ్వు ఏమైనా ఫోన్ చేశావా అని నిలదీస్తాడు. అప్పుడే వాళ్లిద్దరూ బుస్సు, ముంగిస అని పిలుచుకుంటున్నట్లు మహా, కన్నా వింటారు. తాను ఎలాంటి ఫోన్ చేయలేదని శైలు చెప్పడంతో కేశవ్ అక్కిడి నుంచి వెళ్లిపోతాడు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పెద్ది పప్పు తాళింపు పెడుతుంటే...మహా బుస్సు బుస్సు అనగానే కేశవ్ కంగారుపడతాడు. తాళింపు బుస్సుబుస్సు మని శబ్ధం వస్తుందని మహాలక్ష్మీ కవర్ చేస్తుంది. ఆ తర్వాత అన్నం తింటుంటే మళ్లీ కన్నా బుస్సుమంటాడు. ఏంటని అడగ్గా...మన ఇంటి పక్కనే ఉన్న చెట్లు కొట్టేశారంటా....పాములన్నీ ఇళ్లల్లోకి వస్తున్నాయని చెప్పారని అంటాడు. పాములు వస్తే వాటికోసం ముంగిసలు కూడా వస్తాయి కదా అని మహాలక్ష్మీ అంటుంది. వీళ్లిద్దరి మాటలు ఏదో తేడాగా ఉన్నాయని కేశవ్ అనుకుంటాడు. నిజం వీళ్లకు తెలిసిపోయిందా అని కేశవ్ భావిస్తాడు. లేకపోతే అన్నిసార్లు పాము, ముంగిస గురించి ఎందుకు మాట్లాడుకుంటారని అని అనుమానిస్తాడు.ఎందుకైనా మంచిదని ఓసారి శైలూ నెంబర్‌కు కాల్ చేసి అడుగుతాడు. నువ్వు ఏమైనా నేను లేనప్పుడు ఈ ఫోన్‌కు ఫోన్ చేశావా అని ఆరాతీస్తాడు. తొలుత లేదని అదరగొట్టినా...కేశవ్ గట్టిగా నిలదీసేసరికి శైలూ తానే ఫోన్ చేశానని చెబుతుంది. ఏం మాట్లాడవని అడిగితే...మనిద్దరం ప్రేమించుకుంటున్నట్లు మాట్లాడానని చెబుతుంది. దీంతో కేశవ్ శైలుపై మండిపడతాడు. లేకపోతే నా ఫోన్ తీసుకుని ఏడిపిస్తుంటే...చూస్తూ ఊరుకుంటానా అని అంటుంది. అందుకే నీకు ఓ చిన్న ఝలక్ ఇచ్చానని అంటుంది. మర్యాదగా నా ఫోన్ తీసుకుని వచ్చిన నాకు ఇవ్వకపోతే...నేరుగా ఇంటికే వచ్చేస్తానని అంటుంది. ఓహో అయితే ఇదంతా నీ పనేనా అని అనుకుంటాడు. నీ ఫోన్ ఇవ్వడం కాదు...నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసని అంటాడు. అయితే విషయం ఇంట్లో వాళ్లకు తెలిసిపోయిందన్నమాట అందుకే ఉదయం నుంచి బుస్సు,బుస్సుమంటూ ఆటపట్టిస్తున్నారా అని కేశవ్ అనుకుంటాడు. సర్టిఫికేట్ల కోసం యాదగిరిగుట్టలోని కాలేజీకి వెళ్లడానికి మహా తన ఫ్రెండ్‌కు ఫోన్ చేస్తుంది. రేపు ఉదయం వస్తానని...ఇద్దరం కలిసి కాలేజీ వెళ్లి సర్టిఫికేట్లు తెచ్చుకుందామని చెబుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన చక్రి...రేపు ఏ టైంకు వెళ్దామని అడుగుతాడు. నువ్వు ఎందుకు అని మహా నిలదీస్తుంది.అదేంటి అంతదూరం నువ్వు ఎలా వెళ్తావని...పైగా మీనాన్న,అన్నలు అక్కడే ఉంటారు కాబట్టి ఏదైనా చేస్తారేమోనని అంటాడు. నా సేఫ్టీ నేను చూసుకోగనలని అంటుంది. అయినా నా గురించి ఆలోచించడానికి నువ్వు ఎవరని అంటుంది. ఈ మాట ఇంట్లో నుంచి తీసుకొచ్చినప్పుడు అడగాల్సిందని...పోలీసుస్టేషన్‌లో మీవాళ్లు నన్ను కొడుతున్నప్పుడు అడగాల్సిందని అంటాడు. అవన్నీ ఇప్పుడు ఎందుకు నువ్వు తీసుకొచ్చినందుకు నీకు కిరాయి డబ్బులు ఇచ్చాను కదా అని అంటుంది. నేను కన్నా, పెద్దికోసమే ఇక్కడ ఉంటున్నాని అని వెళ్లిపోతుంది. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా...మరోసారి కన్నా బుస్సుబుస్సుమనడంతో చక్రి భయపడి లేస్తాడు. ఇంట్లోకి పాము వచ్చిందంటూ అందరినీ నిద్రలేపుతాడు. పాములేదు ఏమీలేదని ఈకన్నాగాడు,మహా కావాలని బుస్సుబుస్సుమని ఏడిపిస్తున్నారని కేశవ్ చెబుతాడు. అయితే మేమే సినిమా ధియేటర్ల వెంట తిరిగామని మహా అనగా....ఆ అమ్మాయికి అంతసీన్‌లేదని, అదో పిచ్చిదని చెబుతాడు. దీంతో అసలు అమ్మాయి ఎవరని మాధవ్ నిలదీస్తాడు.
