Lakshimi Raave Maa Intiki Serial Today Episode: యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయిన శ్రీలక్ష్మీ వైద్యానికి సహకరించడం లేదని డాక్టర్లు చెప్పడంతో మ్యాడీతోపాటు సూర్యనారాయణ అందరూ షాక్ తింటారు. శ్రీలక్ష్మీకి ఇలా జరిగిందేంటని బాధపడతారు. మా ప్రయత్నాలు మేం చేస్తున్నామని...మిగిలినది ఆ పైవాడి దయ అంటూ డాక్టర్లు చెబుతారు. ఎవరికీ ఎలాంటి కీడు తలపెట్టని లక్ష్మీకి ఇలా జరిగిందని ...ఎంతో చలాకీగా అల్లరి చేస్తూ ఇంట్లో తిరిగే పిల్ల...ఇలా జీవచ్ఛవంలా ఆస్పత్రి బెడ్‌పై పడుకుందని సూర్యనారాయణ అంటాడు. ఆ దేవుడికి కూడా లక్ష్మీపై దయ కలగలలేదని ఏడుస్తాడు.దీంతో ఇందిర భర్తను ఓదార్చి....తప్పు చేయని వారికి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడని చెప్పే మీరే ఇలా బాధపడిపోతే ఎలా అని అంటుంది. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడని అంటుంది.
మ్యాడీని తనతో తీసుకుని ఇందిర బయటకు వెళ్తుంది. ఎక్కడికి అని మ్యాడీ అడిగినా....ఏం మాట్లాడకుండా తనతో రమ్మని చెప్పి బలవంతంగా లాక్కుని వెళ్తుంది. అమ్మవారి గుడికి తీసుకెళ్లిన ఇందిర...నీ భార్య త్వరగా కోలుకోవాలని అమ్మవారికి మొక్కుకోమని చెబుతుంది. ఇలాంటి మూఢనమ్మకాలు తాను నమ్మనని మ్యాడీ అంటాడు. నిజంగా అమ్మవారు లక్ష్మీని కాపాడేదే అయితే లక్ష్మీనే ఇక్కడికి తీసుకొచ్చేవాళ్లం కదా అంటాడు. మ్యాడీ మాటలు విన్న పూజారి..తప్పుబాబు అలా అనకూడదని అంటాడు. దేవుడిని పూజించడం మూఢనమ్మకం కాదని..ఆ దేవుడిపై పెట్టుకునే నమ్మకమని అంటాడు.నువ్వు భక్తితో అమ్మవారిని ధ్యానిస్తే....తప్పకుండా నీకు రక్షగా ఉంటుందని అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నిప్పులు గుండం చూపించి నీ భార్యకు నయమవ్వాలని గట్టిగా కోరుకుని ఆ నిప్పుల గుండంలో నడవమని ఇందిర చెబుతుంది. దీంతో మ్యాడీ భయపడిపోతాడు. ఏం కాదని ఆమె నచ్చజెబుతుంది. నువ్వు యాక్సిడెంట్ చేసి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిలో తప్పు తనపై వేసుకుని శ్రీలక్ష్మీ స్టేషన్‌కు వెళ్లిందని...అలాంటి అమ్మాయి చావుబతుకుల మధ్య ఉంటే నువ్వు ఈమాత్రం చేయవా అంటూ అనడంతో మ్యాడీ నిప్పుల గుండంలో మూడుసార్లు నడుస్తాడు. ఆ లక్ష్మీకి ఏం జరగకూడదని అమ్మవారికి మొక్కుకుంటాడు.పూజారి అమ్మవారి కుంకుమ ఇచ్చి శ్రీలక్ష్మీకి పెట్టమని చెప్పి మ్యాడీ చేతికి ఇస్తాడు.
శ్రీలక్ష్మీ పరిస్థితి మరింత దిగజారిందని...కావాలంటే ఒకసారి చూసుకోవచ్చని డాక్టర్లు చెప్పడంతో సూర్యనారాయణ చాలా ఏడుస్తాడు. ఆ మాటలు విన్న మ్యాడీ షాక్‌కు గురవుతాడు. లోపలికి వెళ్లి తన చేతిలో ఉన్న కుంకుమ ఆమె నుదిటిపై పెట్టి త్వరగా కోలుకోవాలని కోరుకుంటాడు.ఇంతలో లక్ష్మీకి మెలకువగా వస్తుంది. సూర్యనారాయణ అందరూ వచ్చి ఆమెను పలకరిస్తారు. డాక్టర్లు వచ్చి అద్భుతం జరిగిందని అంటారు.తనకు బాగానే ఉందని శ్రీలక్ష్మీ చెప్పడంతో....రేపు ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు చెబుతారు.
సింధూజాక్షితో చేపలు కూర వండించుకుని తినాలనుకున్న వాళ్ల అత్తయ్యకు నిరాశ ఎదురవుతుంది. తనకు చేపల కూర వండటం రాదని చెప్పకుండా శ్రీలక్ష్మీ చేసిన వంట చేస్తుంది.అది చూసి ఆమె బెంబేలెత్తిపోతుంది.ఇది తింటే వారం రోజుల్లో చావడం ఖాయమని చెప్పి కోపంగా అక్కడి నుంచి కూతురిని తీసుకుని వెళ్లిపోతుంది. ఆస్పత్రి నుంచి శ్రీలక్ష్మీని ఇంటికి తీసుకొస్తారు. అసలు కాలేజీలో ఏం జరిగిందని...ఎందుకు ముందుగానే క్లాస్ నుంచి వచ్చేశావని సూర్యనారాయణ అడుగుతాడు. శ్రీలక్ష్మీనిజం చెప్పేస్తుందేమోనని మ్యాడీ భయపడిపోతాడు.
