Podharillu Serial Today Episode: మాధవ్‌పై వాళ్ల మామయ్య పురుషోత్తం చేయిచేసుకున్నాడని తెలియగానే చక్రి, కేశవ్‌ కోపంతో రగిలిపోతారు. వాళ్ల అంతు చూస్తామంటూ బయలుదేరతారు. మాధవ్‌వాళ్లను ఆపుతున్నా ఆగకుండా వాళ్ల అత్త వాళ్ల ఇంటికి వెళ్లిగొడవ పెట్టుకుంటారు. కేశవ్‌ వాళ్ల మామయ్య చొక్కా పట్టుకుని నిలదీయగా...చక్రి ఏకంగా వాళ్లమామను కొడతాడు. వాళ్ల అత్తయ్య అడ్డుగా వచ్చినా వినకుండా  దేవుడిలాంటి మా అన్నయ్యపైనే చేయిచేసుకుంటారా అంటూ ఇద్దరూ కలిసి పురుషోత్తంపై దాడి చేస్తారు. దీంతో పురుషోత్తం ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఇంకోసారి మా ఇంటి జోలికి వచ్చినా....మా అన్నయ్యను ఏమైనా అన్నా మీ అందరినీ చంపేస్తమని హెచ్చరిస్తారు.గొడవ మరింత పెద్దదవుతుందని భావించిన మాధవ్‌ తమ్ముళ్లను అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు.
కన్నా కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి మహా విషయం మొత్తం చెప్పేస్తుంది. మాధవ్‌పై పురుషోత్తం చేయిచేసుకున్నాడని తెలిసి నారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇవాళ్ల వాళ్లందరినీ చంపేస్తానంటూ బయలుదేరుతుండగా...మాధవ్‌ తమ్ముళ్లను తీసుకుని ఇంటికివస్తాడు. ముగ్గురు వెళ్లి ఆ వెధవలను ఏం చేయకుండా ఎందుకు వచ్చారని నారాయణ మాధవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనం గొడవ పెట్టుకుంటే వాళ్లు చూస్తూ ఊరుకోరాని మరింత పెద్దది చేస్తారని మాధవ్‌ అంటాడు. ఇప్పటికే ఏం అపాయం ముంచుకొస్తుందోనని అంటుండగానే....తాయర్‌, పురుషోత్తం కలిసి పోలీసులను తీసుకుని వస్తారు. మా అమ్మాయిపట్ల ఈమాధవ్‌ అనుచితంగా ప్రవర్తిస్తుంటే ప్రశ్నించినందుకు తమ్ముళ్లను తీసుకుని మా ఇంటిమీదకు వచ్చి గొడవ పెట్టుకుని నన్ను కొట్టాడని పురుషోత్తం చెబుతాడు. దీంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా...మహా అడ్డుకుంటుంది. వీళ్లు చెప్పేదంతా అబద్ధమని...గాయత్రినే ఇష్టం లేని పెళ్లిచేసుకోలేక మా ఇంటికి వచ్చిందని చెబుతుంది. వీళ్లే కావాలని వచ్చి మాధవ్‌ను కొట్టి వాళ్ల అమ్మాయిని తీసుకెళ్లారని చెబుతుంది. ఏదైనా ఉంటే స్టేషన్‌కు వచ్చి చెప్పుకోండని ఎస్‌ఐ అంటాడు. అయితే కన్నా అసలు ఇంట్లోనే లేడని...కాలేజీకి వెళ్లి ఇప్పుడే వచ్చాడని వాడిని తీసుకెళ్లొద్దని చెప్పినా వినకుండా పోలీసులు నలుగురు అన్నదమ్ములను స్టేషన్‌కు తీసుకెళ్తారు.
 
కొడుకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో నారాయణ వాళ్ల చెల్లి ఇంటి మీదకు వెళ్లి గొడవ చేస్తాడు. అప్పుడే అక్కడికి వెళ్లిన మహా...మీరు ఇక్కడ ఏం చేసినా, మీ కొడుకులపై కేసు స్ట్రాంగ్‌ అవుతుందని చెబుతుంది. వీళ్లు గొడవపడుతుండగా మెల్లగా మహా గాయత్రి దగ్గరకు వెళ్లి నువ్వు స్టేషన్‌కు వచ్చి నిజం చెప్పకపోతే...అనవసరంగా వాళ్ల నలుగురిపై కేసు పెడతారని చెబుతుంది.నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారని ఎలా రాగలనని అంటుంది.అయితే నేను స్టేషన్‌కు వెళ్లి నీకు ఫోన్ చేయిస్తానని..ఎస్‌ఐకి అన్ని విషయాలు చెప్పమని చెప్పి వెళ్లిపోతుంది. నారాయణను తీసుకుని అక్కడి  నుంచి వెళ్లిపోతుంది.
స్టేషన్‌లో మాధవ్‌ ఎస్‌ఐతో మాట్లాడుతుంటాడు. ఇందులో మా తప్పు ఏం లేదని...ఎన్నో ఏళ్లుగా మా అత్తయ్యకు మాకు గొడవలు ఉన్నాయని చెబుతాడు. మేం కావాలని వాళ్ల ఇంటి మీదకు వెళ్లలేదని చెబుతాడు. మరి ఎందుకు వెళ్లారని అడగ్గా....మా  అన్నయ్యపై చేయిచేసుకుంటుంటే మేం చూస్తూ ఎలా  ఉండగలమండీ అందుకే అడగడానికి వెళ్లామని చక్రి చెబుతాడు. అంతే తప్ప వాళ్లతో గొడవ పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని అంటాడు. దయచేసి ఏదైనా ఉంటే నాపై కేసు పెట్టి మాతమ్ముళ్లను వదిలిపెట్టమని మాధవ్‌ బ్రతిమలాడతాడు. ఇంతలో మహా అక్కడికి రావడంతో చూసి నువ్వు ఎందుకుఇక్కడికి వచ్చావమ్మా అంటూ మాదవ్‌ అమెను ప్రశ్నిస్తాడు.