Meghasandesam Serial Today Episode: కేపీని కలిసిన శారద.. పూరి పెళ్లికి రావాలని చెప్తుంది. శారద మాటలకు ఆశ్చర్యపోయిన కేపీ ఏంటి శారద ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నువ్వు ఆ ఇంటికి వచ్చి నన్ను పూరి పెళ్లికి రమ్మని పిలుస్తావా..? అంటాడు. శారద: అవునండి..కేపీ: నువ్వు పిలవగానే వెళ్లు కేపీ అని నన్ను బావగారు పంపిస్తారు అనుకున్నావా..? శారద: అంత ఈజీగా పంపిస్తారని నేను అనుకోవడం లేదండి. అవసరం అయితే ఆయన గారి కాళ్లు పట్టుకుని బతిమిలాడుతానున.. కేపీ: వద్దు శారద అంత పని చేయకు.. ఇప్పుడేంటి..? గగన్ ఒప్పుకోడు అయినా సరే నేను పూరి పెళ్లికి రావాలి. అంతేగా.. వస్తాను.. శారద: రావడం అంటే చాటు మాటుగా వచ్చి గగన్‌కు కూడా కనబడకుండా నాలుగు అక్షింతలు వేసి వెళ్లిపోవడం కాదండి. పూరి తండ్రిగా మీరు ఆ పెళ్లిలో నిలబడాలి. కేపీ: శారద పూరికి తండ్రికి నేను ఈ పెళ్లిలో నిలబడటానికి గగనే ఒప్పుకోడు. శారద: నేను వాడితో మాట్లాడాను అండి.. పెళ్లిలో మీరు నిలబడటమే మన ఇంటికి గౌరవం అని చెప్పాను.. వాడు అవును అని కానీ కాదు అని కానీ చెప్పలేదు. పెళ్లిలోపు వాణ్ని ఎలాగైనా ఒప్పిస్తాను అనే నమ్మకం నాకు ఉందండి.. కేపీ: శారద నువ్వు వాణ్ని ఒప్పించినా ఇక్కడ ఈ ఇంట్లో అపూర్వ కానీ బావగారు కానీ ఒప్పుకోరు. పైగా నువ్వు ఈ ఇంటికి వస్తే వాళ్లు నిన్ను అవమానిస్తారు. శారద: నేను చూడని అవమానాలా..? గగన్ ఒప్పించాక మీరు వాళ్లకు తెలియకుండా వచ్చి పెళ్లిలో నిలబడితే వాళ్లకు తెలియకుండా పోతుందా..? అప్పుడు నేరుగా పెళ్లికే వచ్చి గొడవ చేయరా..? పెళ్లిలో జరిగే అవమానం కంటే.. అదేదో నాకు ఆ ఇంట్లోనే జరగనివ్వండి. ఎన్ని అవమానాలు పడైనా సరే పూరి పెళ్లికి మీరు రావడానికి ఒప్పిస్తాను. కేపీ: శారద నీకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందోనని చాలా టెన్షన్‌గా ఉంది. అంటూ కేపీ భయపడుతుంటాడు. మరోవైపు భూమి, గగన్‌లు బంధువుల, స్నేహితులు ఇండ్ల దగ్గరకు వెళ్లి శుభలేఖ ఇస్తూ.. అందరినీ ఆహ్వానిస్తుంటారు. భూమి బొట్టు పెడుతుంటే గగన్ కార్డు ఇస్తుంటాడు. గగన్: సార్ మీరు తప్పకుండా రావాలి.. చాలా సంతోషంగా ఉంటుంది మాకు. సార్: నువ్వు పిలవడం మేము రాకపోవడమా..? నా సంగతి పక్కన పెట్టు ఇంత గ్రాండ్‌గా నీ చెల్లి పెళ్లి చేస్తున్నావు కదా..? మీ నాన్ను ఆహ్వానిస్తున్నావా..? మీ నాన్న ప్రస్తావన తీసుకొస్తే నీకు కోపం వస్తుందని నీకు తెలుసు. కానీ మీ నాన్నే కనక రాకపోతే ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం అందరికీ ఇచ్చినట్టు అవుతుంది. నీ గురించి మాట్లాడుకోకుండా ఉండాలంటే మీ నాన్న ఉండాలనేదే నా ఉద్దేశం. భూమి: ఉంటారు అంకుల్ మామయ్యను మేము పిలుస్తున్నాం.. ఏంటండి అలా చూస్తున్నారు. పిలుస్తున్నాం కదా.? వస్తాం అంకుల్ పెళ్లికి తప్పకుండా రావాలి. పద బావ. అంటూ ఇంట్లోంచి ఇద్దరూ బయటకు వస్తారు. బయటకు రాగానే గగన్ కోపంగా ఆయన్ని పిలవడం ఏంటి భూమి.. నువ్వు కూడా ఆయన్ని పిలవాలని కమిట్ అయ్యావా అంటూ అడగ్గానే.. భూమి బాధగా శారద బాధపడుతున్న విషయం గుర్తు చేస్తుంది భూమి. గగన్ కోపంగా వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది. ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
