Podharillu Serial Today Episode: మహా సైకో అని తిట్టడంతో భూషణ ప్రతాప్‌పై గొడవపెట్టుకుంటాడు. తను ఫోన్ లిప్ట్ చేయకపోయేసరికి కంగారుగా నేను వస్తే...నన్నే ఇంత మాటలు అంటుందా అని మండిపడతాడు. తనకు చిన్నపిల్లని...నేను సర్దిచెబుతానని ప్రతాప్‌ ప్రాధేయపడతాడు. ఆది కూడా సారీ చెప్పడంతో భూషణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.మహాచేసిన పనికి ఇంట్లో అందరూ కోపంగా ఉంటారు. ప్రతాప్ మహాను కిందకు పిలిచుకుని రమ్మనిఆదిని పంపిస్తాడు. కిందకు వచ్చిన మహా వాళ్ల నాన్నతో  గొడవపడుతుంది. ఇద్దరికీ మాటామాటా పెరుగుతుంది.

Continues below advertisement

భూషణ్‌ నీమీద చాలా ప్రేమ చూపిస్తుంటే...మొదటి నుంచి నువ్వు అతన్ని రాక్షసుడిగా  చిత్రీకరిస్తున్నావని ప్రతాప్‌ అంటాడు. వాడు నన్ను బానిసగానే చూస్తున్నాడని అంటాడు.దీంతో ప్రతాప్‌కు కోపం వచ్చి ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు. అందుకే నువ్వు ఈ పెళ్లి చెడగొడుతున్నావా అని అంటాడు. దీంతో నిహారికి, లలిత కూడా ప్రతాప్‌ను మందలిస్తాడు. ఎవరికోసమో...మన కూతురిని అనుమానిస్తావా  అంటారు. దీంతో మహా ఇంకా బాధపడుతుంది. ఎవడికోసమే తొలిసారి నామీద చేయిచేసుకున్నారని...ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారని మహా ఏడుస్తుంది. దీనికన్నా నన్ను చంపేయమంటూ ప్రతాప్‌పై కోప్పడుతుంది. దీంతో వాళ్ల నాన్నుకు మరింత కోపం వస్తుంది.ఇప్పటి వరకు జరిగింది వదిలేయమని....పెళ్లి మాత్రం అతనితోనే ఫిక్స్‌ అంటూ చెబుతుతాడు. పెళ్లయి అత్తారింటికి వెళ్లేవరకు నోరు విప్పడానికి వీళ్లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అందరూ మహాకే నీతులు చెప్పి వెళ్లిపోతారు. నిహారిక కూడా ఇప్పుడు ఇక ఏం చేయలేమని...పెళ్లి చేసుకుని భూషణ్‌ను మార్చుకోవడం తప్ప...మన చేతుల్లో ఏం లేదని అంటుంది.             

మహాను ఇంట్లో వాళ్లంతా మాటలు అంటుంటే విన్న చక్రి...ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంటాడు.ఇంతలో కోపంగా మహా అతని వద్దకు వస్తుంది.   ఈ రాత్రికే నేను ఈ ఇంట్లోనుంచి బయటపడాలని అంటుంది.అది నీకు చేతనవుతుందా అని నిలదీస్తుంది. ఆ మాటలకు చక్రి ఉలిక్కిపడతాడు.మీలో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటాడు. నా మాటలకు విలువు ఇవ్వని ఈ పెద్దరికాన్ని గౌరవించాల్సిన అవసరం లేదన్నది. నాకు పెళ్లి ఇష్టం లేకపోతే... ఎవడో ఉన్నాడనుకునే వీళ్లకోసం నా జీవితాన్ని నాశనం చేసుకోలేనని అంటుంది. వాడి కోసం మా నాన్న నామీద చేయిచేసుకున్నాడంటే... మున్ముందు వాడు ఏం చేసినా నావైపు మాట్లాడడని నమ్మకంపోయిందని  అంటుంది.

Continues below advertisement

నేను బయటకు వస్తానని అంటుంది. ఈ పంజరం దాటి నేనెప్పుడు బయటకు వెళ్లింది లేదని....నాకు నీ సాయంకావాలని కోరుతుంది. నేను అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత...మళ్లీ మీరు వెనక్కి తగ్గరు కదా అని చక్రి అంటాడు. ఈఇల్లు గురించి ఆలోచించలేదని...నేను  కూడా వాళ్ల గురించి ఆలోంచనని చెబుతుంది. మహా అన్న మాటలకు చక్రి ఎగిరి గంతులేస్తాడు.             

ఇంట్లో పెళ్లిఏర్పాట్లు జరుగుతుండగా...మహా ఇంట్లో వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేస్తుంటుంది. బయటకు వెళ్లాలంటే డబ్బులు కావాలని...ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటుంది. ఇంతలో  కులదైవం గుడిలో పూజలు చేయించడానికి ఇంట్లోవాళ్లు వెళ్తున్నారని తెలుసుకున్న మహా...పారిపోవడానికి ఇదే సరైన సమయమని అనుకుంటుంది.